పాముకు చుక్కలు చూపించిన ఎలుక | rat attack on snake to rescue her baby | Sakshi
Sakshi News home page

పాముకు చుక్కలు చూపించిన ఎలుక

Published Tue, Jul 5 2016 5:33 PM | Last Updated on Mon, Sep 4 2017 4:11 AM

పాముకు చుక్కలు చూపించిన ఎలుక

పాముకు చుక్కలు చూపించిన ఎలుక

చిట్టి ఎలుక.. గట్టి సాహసం
సాధారణంగా ప్రపంచంలో ఏ జీవి అయినా సరే ఎవరైనా తన పిల్లల జోలికొస్తే ఆ తల్లి ఊరుకోదు. ఈ విషయం మరోసారి రుజువైంది. కేవలం మనుషులు మాత్రమే కాదు జంతువులు, కీటకాలు కూడా తమ తల్లి ప్రేమను నిరూపించుకుంటాయి. ఓ చిట్టి ఎలుక పిల్లను దాదాపు ఏడు అడుగుల పాము ఆహారంగా తీసుకోవాలని ప్రయత్నించింది. ఇక అంతే ఈ విషయాన్ని ఆ ఎలుక తల్లి గమనించింది. దాని కోపం తారాస్థాయికి చేరుకుంది. అవతల శత్రువు అన్నది పామా.. లేక ఏంటి అన్నది ఆ తల్లి హృదయానికి అక్కర్లేదని భావించింది. ప్రాణాలకు తెగించి మరీ పాముతో పోరాటానికి దిగింది.

ఆ పామును చిరుతలా వెంటాడి మరీ తరిమికొట్టింది. పాము బుసలు కొడుతున్నా ఆ ఎలుక తల్లి వెనక్కి తగ్గలేదు. తన పిల్లను రక్షించుకోవడానికి పాము కాటుకు బలైన సరే అన్న తీరుగా చెలరేగిపోయింది. దీంతో చేసేదేం లేక బతుకు జీవుడా అనుకుంటూ చిన్న ఎలుకను వదిలేసి పాము అక్కడి నుంచి పారిపోయింది. రోడ్డుపై నుంచి మెల్లగా జారుకుని పొదల్లోకి పారిపోయింది. అయినా సరే పామును వెంటాడి తరిమేసింది. చిన్న ఎలుకను నోట కరుచుకుని తల్లి ఎలుక తీసుకెళ్లింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement