మీ ఏసీలు పాములకు పుట్టలేమో చూడండి? | Rat becomes snake's snack after serpent comes out of AC | Sakshi
Sakshi News home page

మీ ఏసీలు పాములకు పుట్టలేమో చూడండి?

Published Tue, Jun 13 2017 2:21 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM

మీ ఏసీలు పాములకు పుట్టలేమో చూడండి?

మీ ఏసీలు పాములకు పుట్టలేమో చూడండి?

పాము ఎక్కడ ఉంటుందని ప్రశ్నిస్తే ఎవరైనా టక్కున పుట్టలో ఉంటుందని చెబుతారు. కానీ, ఈ రోజుల్లో పాము ఎక్కడ ఉంటుందని ప్రశ్నించినప్పుడు కూడా అలాంటి పాత సమాధానమే చెబితే పప్పులో కాలేసినట్లే అవుతుంది. ఎందుకంటే ఈ రోజుల్లో పాములు పుట్టలు వదిలేసి ఏసీల్లో కూడా దూరిపోతున్నాయి. ఈ మాట నిజమే. ఓ కుటుంబానికి ఈ అనుభవం స్వయంగా ఎదురైంది. తమ ఎయిర్‌ కండిషన్‌లో దూరిన పామును చూసి వారు బిత్తర పోయారు.

ఇంకాస్త ఆశ్చర్యపరిచే విషయమేమిటంటే అప్పటి వరకు ఏసీలో నిద్రించిన ఆ పాము కాస్త వారు అలా చూస్తుండగానే ఓ ఎలుకని చూసి బుస్సుమంటూ సగానికి పైగా బయటకొచ్చి నేరుగా దాన్ని నోట కరిచిపట్టింది. ఆ వెంటనే చక్కగా తన ఏసీ గదులు పడుకొని ఆరగించేందుకు తిరిగి మళ్లీ అదే ఏసీలోకి దూరిపోయింది. ఇదంతా చూసిన ఆ కుటుంబ సభ్యులు గజగజా వణికిపోతూనే ఈ వీడియో తీసి సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఇప్పుడా వీడియో తెగ వైరల్‌ అవుతోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement