
ఈ ఎలుక తన బుర్రను ఇంట్లోని బీరువాలో పెట్టి వచ్చినట్లు ఉంది.. లేకపోతే.. కలర్‌ఫుల్‌గా కనిపిస్తే చాలు.. ఇలా డైరెక్టుగా వెళ్లిపోయి ముద్దులిచ్చేయడమేనా.. పోనీ మనమేమైనా పులా, సింహమా.. జస్ట్ ఎలుక.. ఎన్ని ప్రమాదాలు పొంచి ఉంటాయి.. ఎంతమంది మింగేయడానికి రెడీగా ఉంటారు.. ఇవన్నీ ఆలోచిస్తేగా.. అందుకే అన్నది బుర్రను బీరువాలో పెట్టి వచ్చిందని.. ఇంతకీ దీని తర్వాత ఏం జరిగిందని మాత్రం మమ్మల్ని అడగకండి.. ఎందుకంటే.. సార్‌వారు స్వర్గస్తులై.. అల్‌రెడీ రెండ్రోజులైంది.. ప్రస్తుతం దాని బంధుమిత్రులు సార్‌గారి దశదినకర్మ పనుల్లో బిజీబిజీగా ఉన్నారట. కార్యక్రమం ఎక్కడ జరగనుందో చెప్పలేదు కదూ.. ఇండోనేసియాలోని బెకాసీ అడవుల్లో..
Comments
Please login to add a commentAdd a comment