మనం పాములను దేవతగా పూజిస్తాం. చంపేందుకు కూడా వెనకడతాం. ఎంతో పరిస్థితి సివియర్‌గా ఉంటేనే గానీ వాటి జోలికి వెళ్లం, హాని తలపెట్టం. అలాంటిది ఒక దేశంలో ఏకంగా వాటి రక్తాన్ని టీ, కాఫీలు తాగినట్టు తాగేస్తారట. పైగా ఎందుకుని ఇలా తాగుతారో వింటే గుండెఝల్లుమంటుంది. అందుకోసం వీటి రక్తాన్ని తాగాలా అని అసహ్యంచుకుంటారో కూడా. ఇంతకి ఎక్కడ ఇలా చేస్తారు? దేని కోసం అంటే.
విష సర్పాన్ని చూసి అల్లంతా దూరానికి పరిగెడతాం. కానీ ఇండోనేషియన్ అమ్మాయిలు మాత్రం లొట్టలేసుకుంటూ వాటి రక్తాన్ని తాగేస్తారు. వాటి రక్తం తాగితే శరీరాన్ని ఫిట్‌గా అందంగా ఉంటుందని వారు ప్రగాఢం నమ్ముతారట. పాము రక్తం కోసం దుకాణాల్లో రద్దీ కూడా ఓ రేంజ్‌లో ఉంటుందట. ఇండోనేషియా రాజధాని జకర్తాలో పాము రక్తం తాగడం అనేది అత్యంత సాధారణ విషయం. ఎక్కడ చూసినా కాఫీ, టీ స్టాల్ మాదిరిగా పాము రక్తాన్ని విక్రయించడం విశేషం.
ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వాకింగ్ చేసినప్పుడు పాము రక్తాన్ని తప్పక తాగుతారట. అంతేకాదు జకర్తాలో ఈ పాము రక్తానికి మంచి డిమాండ్, ట్రెండ్ కూడా ఉంది. దీని కారణంగా ప్రతిరోజు వేలాది పాములను చంపుతారట ప్రజలు. అయితే ఈ రక్తాన్ని తాగిన తర్వాత సుమారు మూడు నుంచి నాలుగ గంటల వరకు టీ, కాఫీలను తాగకూడదట. అయితే ఎప్పుడు పడితే అప్పుడు మనం ఆఫీస్‌లు, కాలేజీల్లో టీ, కాఫీలు ఎలా తాగుతామో అలా అక్కడ పాము రక్తం తాగేస్తారట వాళ్లు.
ఎందుకు తాగుతున్నారంటే..
ఇండోనేషియా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని.. ముఖ్యంగా అక్కడి స్త్రీలు తమ అందం పెంచుకునేందుకు తప్పనిసరిగా ఈ పాము రక్తం తాగుతారట. పాము రక్తం వల్ల చర్మం కాంతిమంతంగా ఉంటుందట. ఆరోగ్యం బాగుంటుందట. ఇలా పాము రక్తం తాగే సంప్రదాయం పురాతన కాలం నుంచి ఇండోనేషియన్ వాసులకు అనాదిగా వస్తుందట. అయితే వాళ్లు ఇలా పాము రక్తాన్ని తాగడమే కాదు వాటిని ఆహారంగా తింటారట కూడా. వాటిని చక్కగా నిమ్మగడ్డితో ఉడకబెట్టి వేయించి మరీ తింటారట.
(చదవండి: అక్కడ పోలీసులు పెట్రోలింగ్‌కి గేదెలను ఉపయోగిస్తారట!)
Comments
Please login to add a commentAdd a comment