
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, బెంగళూరు: పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకుని ఓ యువకుడు మృత్యువాత పడ్డాడు. ఈ సంఘటన కర్ణాటకలోని హోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. క్రిష్ణగిరి సమీపంలోని మొల్లంపట్టి గ్రామానికి చెందిన సేదుపతి(18) అనే యువకుడు అదే ప్రాంతంలోని జ్యూస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. ఈనెల 21వ తేదీ పొరపాటున ఎలుకల మందుతో పళ్లు తోముకొని స్పృహకోల్పోయాడు. అస్వస్థతకు గురైన అతన్ని ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడు ఆదివారం మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment