
మూషికానికి ముచ్చటైన విందు!
ఇంట్లో ఎలుకలను చూస్తే మనకు ఎక్కడలేని చీదర వచ్చేస్తుంది. కర్రపెట్టి పిల్లిని తరిమినట్లు తరిమితే అవి పోవు. అందుకే బోన్ పెట్టి బంధించడానికో.. మందు కలిపి మర్డర్ చేయడానికో అస్సలు వెనకాడం. కానీ కొన్ని దేశాల్లో ఎలుకలను పెట్స్‌గా పెంచుకుంటారు. ముద్దు చేసి ముచ్చటిస్తుంటారు.
ఇంట్లో మనిషిగా ప్రేమిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హచ్చుకుక్కలు, బొచ్చుకుక్కలను సాకినట్లుగా.. పెట్ ర్యాట్స్‌ని చూసుకుంటారు. అంత ప్రేమగా చూసుకునే పెట్ ర్యాట్స్‌ని ఇంట్లో వదిలి షికార్లకు వెళ్లాలంటే మనసు ఒప్పదుగా! అది గ్రహించిన శాన్ ఫ్రాన్సిస్కో టూరిజం తమ ప్రాంతాన్ని సందర్శించే వారి పెట్ ర్యాట్స్ కోసం ర్యాట్ కేఫ్‌ను ఫ్రారంభించింది.
అందుకోసం శాన్ ఫ్రాన్సిస్కోలోని క్రిటెర్స్ అనే కంపెనీ ‘ది శాన్ ఫ్రాన్సిస్కో డన్‌జిన్’ అనే పేరుతో ఒక ర్యాట్ కేఫ్‌ను జూలైలో నడిపింది. దానిలో ఎలుకలు తినేవి, తినగలిగేవీ అన్నీ సమకూర్చారు. ఈ కేఫ్ టికెట్ ఎంతో తెలుసా 49.99 డాలర్లు. అంటే 3,206 రూపాయలు. ఆ కేఫ్‌లో టీ, కాఫీ, కేక్స్ ఇలా చాలానే ఉన్నాయి. దాంతో తమ ప్రియతమ మూషికాలను ఈ కేఫ్‌కి తీసుకెళ్లి ఏం కావాలో తెలుసుకుని మరీ... వాటి కోరికలు తీర్చారు ఎలుక ప్రేమికులు!!