కుక్కనుకుని పెంచితే చివరకు.. | Man Adopt A Dog But Later It Turns Rat | Sakshi
Sakshi News home page

కుక్కనుకుని పెంచితే చివరకు..

Published Tue, Oct 16 2018 3:29 PM | Last Updated on Tue, Oct 16 2018 3:54 PM

Man Adopt A Dog But Later It Turns Rat - Sakshi

కుక్కగా భావించిన ఎలుక

బీజింగ్‌ : కుక్క ఎప్పటికి ఎలుక కాలేదు. ఇది వాస్తవం. కానీ తాను కుక్క అనుకుని తెచ్చి పెంచుకున్న ఆ జీవి కాస్తా చివరకూ ఎలుక అయ్యింది. అంటే మొదట కుక్కగా ఉండి తరువాత ఎలుకగా మారలేదు. పుట్టడం, పెరగడం అంతా ఎలుకగానే చేసింది. కానీ దాన్ని పెంచుకున్న యాజమానే దాన్ని కుక్కగా భావించాడు. ఈ వింత సంఘటన చైనాలో చోటుచేసుకుంది.

చైనాలోని స్మాల్‌ మౌంటేన్‌ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. ఆ సమయంలో స్నేహితుని ఇంటి దగ్గర అతనికి ఓ చిన్న జీవి కనిపించింది. చూడ్డానికి చాలా చిన్నగా, నల్లగా ఉన్న ఆ జీవిని సదరు వ్యక్తి కుక్క పిల్లగా భావించాడు. దాంతో ఆ కుక్క పిల్లను పెంచుకోవాలని ముచ్చడపడ్డాడు. స్నేహితున్ని అడిగి ఆ బుజ్జి కుక్కపిల్లను ఇంటికి తీసుకువచ్చాడు. కుక్కపిల్లగానే భావించి దాన్ని కొన్ని రోజులపాటు పెంచాడు.

కానీ కొన్ని రోజులు గడిచిన తరువాత తాను పెంచుతున్న జీవి కుక్క కాదేమోనని ఆ వ్యక్తికి అనుమానం వచ్చింది. అసలు తన దగ్గర ఉన్న జీవి ఏంటో ఆ వ్యక్తికి అర్థం కాలేదు. దాంతో ఆ జీవి ఫోటో తీసి తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. ఫోటోలో ఉన్న జీవి ఏంటో చెప్పమని నెటిజన్లను కోరాడు. చివరకూ ఓ నెటిజన్‌ సదరు జీవిని ఎలుకగా తేల్చాడు. ఆ జీవి పేరు పేరు బ్యాంబో రాట్‌ అని అది ఎక్కువగా దక్షిణ చైనాలో కనిపిస్తుందని.. అది వెదురు తినడం వల్ల దానికి ఆ పేరు వచ్చిందని తెలిపాడు. గతంలో కూడా చైనాకు చెందిన ఓ వ్యక్తి కుక్కగా భావించి ఎలుగు బంటిని పెంచాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement