గురుకుల పాఠశాలల్లో టీచర్ల పోస్టుల భర్తీకి త్వరలో విడుదలయ్యే సవరణ నోటిఫికేషన్‌లో బీసీ అభ్యర్థులకు నిరాశే
త్వరలో గురుకుల టీచర్ల సవరణ నోటిఫికేషన్
హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో టీచర్ల పోస్టుల భర్తీకి త్వరలో విడుదలయ్యే సవరణ నోటిఫికేషన్‌లో బీసీ అభ్యర్థులకు నిరాశే మిగలనుంది. డిగ్రీ అర్హతలో ఓసీలతో సమానంగా పోటీ పడాల్సిందేనని తెలుస్తోంది. టీఎస్‌పీ ఎస్సీ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్‌లో డిగ్రీలో అర్హత 60% తప్పనిసరని పేర్కొంది. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఆందోళనలు వ్యక్తం కావడం, జాతీయ ఉపాధ్యా య విద్యామండలి(ఎన్‌సీటీఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. డిగ్రీలో 50% మార్కులున్న వారికి అవకాశం కల్పిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన ఆదేశించడంతో అధి కారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ లకు డిగ్రీలో 45% మార్కులుంటే అర్హులుగా ప్రకటించే అవకాశముంది.
బీసీల అర్హత మార్కుల్లో సడలింపు లేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారుల తో సమావేశమై నిబంధనలపై సమీక్షించారు. దీని ప్రకా రం ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు మాత్రమే సడలింపు ఇవ్వను న్నట్లు్ల తెలిసింది. వయోపరిమితిలో మాత్రం ఓసీలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. క్రాఫ్ట్ టీచర్ల అర్హతను ఇంటర్‌కు బదులుగా పదోతరగతి పరిమితం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వికలాంగుల రిజర్వే షన్లపైనా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చైనా పర్యటనలో ఉన్నారు. ఈ నెల 21న హైదరాబాద్ వచ్చేలోపు సవరణ నోటిఫికేషన్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం.