Replacement teacher posts
-
20 వేలు దాటిన టీఎస్పీఎస్సీ నియామకాలు
సాక్షి, హైదరాబాద్: పోస్టుల భర్తీలో భాగంగా తాము చేపట్టిన నియామకాల సంఖ్య 20,679కి చేరుకుందని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మంగళవారం ఒక్కరోజే 2,528 పోస్టులను భర్తీ చేసినట్లు ఆమె వెల్లడించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి నేతృత్వంలో సభ్యు లు సి.విఠల్, డి.కృష్ణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, సాయిలు, మన్మథరెడ్డి మంగళవారం సమావేశమై 1,857 ఫారెస్టు బీట్ ఆఫీసర్, 699 స్కూల్ అసిస్టెంట్, 55 టీజీటీ సైన్స్ పోస్టుల ఫలితాలను ప్రకటించినట్లు తెలిపారు. 1,823 ఫారెస్టు బీట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేశామని, కోర్టు కేసుల కారణంగా 33 పోస్టుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టినట్లు పేర్కొన్నారు. మరొక పోస్టు అభ్యర్థులు లేక ఖాళీగా ఉండిపోయిందన్నారు. ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా 699 స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్టులను నోటిఫై చేయగా, 653 పోస్టులు భర్తీ అయ్యాయని తెలిపారు. కోర్టు కేసుల కారణంగా 22 పోస్టుల ఫలితాలను విత్‌హెల్డ్‌లో పెట్టామని, వికలాంగులకు సంబంధించిన 22 పోస్టుల ఫలితాలను మెడికల్ రిపోర్టులు వచ్చాక ప్రకటిస్తామని తెలిపారు. 52 టీజీటీ సైన్స్ పోస్టులను భర్తీ చేశామని వివరించారు. -
మూడ్రోజుల్లో టీఆర్టీ ఫైనల్ కీలు!
సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భాగంగా నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్టీ) ఫైనల్ కీలను రెండు, మూడ్రోజుల్లో ప్రకటించేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. ఆ తర్వాత 1:3 నిష్పత్తిలో అభ్యర్థుల వెరిఫికేషన్ జాబితాలను సిద్ధం చేయనుంది. అయితే ఈ ప్రక్రియను చేపట్టాలంటే కోర్టులో 200 వరకు ఉన్న కేసులపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, విద్యాశాఖ కమిషనర్ కిషన్, న్యాయ శాఖ కార్యదర్శితో టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ గురువారం సమావేశమై చర్చించారు. వారి ఫలితాలు ప్రకటించాలా.. వద్దా? సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్, పండిట్ పోస్టులకు సంబంధించిన అర్హతల విషయంలో అభ్యర్థులు అప్పట్లో కోర్టును ఆశ్రయించారు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనల ప్రకారం ఇంటర్మీడియట్, డిగ్రీలలో జనరల్ అభ్యర్థులకు 50 శాతం మార్కులు ఉండాల్సిందేనని ఆయా పోస్టుల నోటిఫికేషన్లలో పొందుపరిచారు. అలాగే విద్వాన్ వంటి కోర్సులకు ఎన్సీటీఈ ఆమోదం లేనందున వాటిని అనుమతించబోమని నోటిఫికేషన్లలో పేర్కొన్నారు. దీంతో ఆయా అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. వారంతా కోర్టు అనుమతితో పరీక్షలకు హాజరయ్యారు. కోర్టు వారిని పరీక్షకు అనుమతించాలని చెప్పిందే తప్ప వారి ఫలితాలను ప్రకటించాలని చెప్పలేదు. ఈ నేపథ్యంలో వారి ఫలితాలను వెల్లడించవద్దని, ఆయా కేసుల్లో అప్పీల్‌కు వెళతామని విద్యాశాఖ టీఎస్పీఎస్సీ అధికారులకు సూచించింది. ఒకట్రెండు రోజుల్లో కోర్టుకు.. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 16న ఫైనల్ కీలను ప్రకటించాల్సి ఉంది. దీంతో వాణీప్రసాద్ గతంలోనే విద్యాశాఖ ఉన్నతాధికారులకు లేఖ రాశారు. అందులో భాగంగా గురువారం సమావేశం నిర్వహించి ఆయా కేసులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లి స్పెషల్ అప్పీల్ ద్వారా ఆయా కేసులపై స్పష్టత ఇవ్వాలని నిర్ణయించారు. దీనిపై ఒకట్రెండు రోజుల్లో విద్యాశాఖ కోర్టును ఆశ్రయించనుంది. అయితే ప్రస్తుతం టీఎస్పీఎస్సీ ఫైనల్ కీలను ప్రకటించినా కోర్టులో ఉన్న కేసులపై స్పష్టత వచ్చాకే 1:3 నిష్పత్తిలో అభ్యర్థులను జిల్లాల వారీగా వెరిఫికేషన్ కోసం ఎంపిక చేసి పాఠశాల విద్యా కమిషనర్‌కు టీఎస్పీఎస్సీ పంపించనుంది. జిల్లాల్లో వెరిఫికేషన్ పూర్తయ్యాక డీఈవోలు ఆ జాబితాలను టీఎస్పీఎస్సీకి పంపిస్తే.. టీఎస్పీఎస్సీ ఫైనల్ సెలక్షన్ లిస్ట్‌లను ప్రకటించనుంది. -
పది జిల్లాల ప్రకారమే నిబంధనలు
సాక్షి, హైదరాబాద్: హైకోర్టు ఆదేశాల మేరకు 10 జిల్లాల ప్రాతిపదికనే ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేపట్టనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేయనున్నట్లు చెప్పారు. 8,792 పోస్టులకు పాత జిల్లాల వారీగా రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్ వివరాలను టీఎస్పీఎస్సీకి పంపినట్లు వెల్లడించారు. సోమవారం సచివాలయంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి, విద్యా శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగ నియామక ప్రక్రియపై ఆయన సమీక్షించారు. అనంతరం మాట్లాడుతూ.. ఉపాధ్యా య పోస్టులకు సంబంధించి టీఎస్పీఎస్సీ త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తుందని వెల్లడించారు. 10 జిల్లాల ప్రకారం టీఎస్పీఎస్సీ కొత్త నోటిఫికేషన్ ఇస్తుందా.. పాత నోటిఫికేషన్‌కే సవరణ నోటిఫికేషన్ ఇస్తుందా అన్నది టీఎస్పీఎస్సీ చూసుకుంటుందని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా వద్దా అనేది కూడా టీఎస్పీఎస్సీ వెల్లడిస్తుందని చెప్పారు. ఏజెన్సీ, వెనుకబడ్డ జిల్లాల నిరుద్యోగుల లబ్ధి కోసమే కొత్త జిల్లాల ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చామని వివరించారు. కొంతమంది కావాలనే ప్రతిదానికీ కోర్టుకు వెళ్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగులూ.. ఆందోళన వద్దు టీచర్ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు నిరాశ చెందొద్దని కడియం శ్రీహరి సూచించారు. సీఎం కేసీఆర్ హామీ మేరకు వచ్చే ఏడాది ఆగస్టులోగా 1.08 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసి తీరుతామని హామీ ఇచ్చారు. త్వరలో వాటి భర్తీకి క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు. ఇప్పటికే 29 వేల పోస్టులు భర్తీ చేశామని చెప్పారు. కొందరు రాజకీయ కొలువుల కోసమే ‘కొలువులకై కొట్లాట’లు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల కోసం నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదన్నారు. రాజకీయాల కోసం ఎవరికో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కొలువుల కొట్లాట ఎవరు చేస్తున్నారో.. నాయకులెవరో తమకు తెలుసని పేర్కొన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరం విద్యార్థులు తమ సమస్యలను పోరాడి గెలవాలని సూచించారు. ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ణప్తి చేశా రు. ఆత్మహత్యలను ఏ ప్రభుత్వమూ ప్రోత్సహించదని, వాటిని పార్టీలు రాజకీయం చేయొద్దని సూచించారు. ఓయూ విద్యార్థి సూసైడ్ లెటర్, అతడి చేతిరాతను పోల్చి చూస్తే నకిలీయో, అసలో తేలుతుందని, అలాంటప్పుడు అలా ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. ప్రతిపక్షాలు భావ దారిద్య్రంలో ఉన్నాయని విమర్శించారు. -
ఉపాధ్యాయ నోటిఫికేషన్లు రద్దు చేయండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 8,700లకు పైగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం జారీ చేసిన పలు నోటిఫికేషన్లను సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టు లో పిటిషన్ దాఖలైంది. ఉపాధ్యాయ నియామకాల రూల్స్, నోటిఫికేష న్లను రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించారని, వాటిని రద్దు చేయాలని కోరుతూ రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జనగాం జిల్లాలకు చెందిన కె.బాలకృష్ణ ముదిరాజ్, కె.భాను, ఆర్.రామ్మో హన్‌రెడ్డిలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రూల్స్‌కు సంబంధించిన జీవో 25పై స్టే విధించి, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం పది జిల్లాలను పరిగణనలోకి తీసుకుని ఒక్కో జిల్లాను ఓ యూనిట్‌గా నియామకాలు చేపట్టేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని పిటిషనర్లు కోరారు. ఈ వ్యాజ్యంలో తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిని ప్రతివాదులుగా పేర్కొ న్నారు. అధికరణ 371డీ, రాష్ట్రపతి ఉత్తర్వు లకు విరుద్ధంగా ఉపాధ్యాయ నియామక రూల్స్‌ను ప్రభుత్వం జారీ చేసిందని పిటిషనర్లు తెలిపారు. 31 జిల్లాలను యూని ట్‌గా తీసుకోనున్నట్లు రూల్స్‌లో పేర్కొన్నా రని, ఇది రాజ్యాంగ విరుద్ధమని వివరించారు. 31 జిల్లాల ఏర్పాటుకు రాష్ట్రపతి ఆమోదం లేదని, రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం 10 జిల్లా లకే గుర్తింపు ఉందని అన్నారు. ఈ ఉత్తర్వు లకు విరుద్ధంగా రూల్స్‌ను తయారు చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. జిల్లాల పునర్విభజన వల్ల పలువురు అభ్యర్థులు ఆయా జిల్లాలకు నాన్ లోకల్ అవుతారని తెలిపారు. కొత్త జిల్లాల ప్రకారం పోస్టులను భర్తీ చేస్తుండటంతో కొన్ని జిల్లాలకు అసలు పోస్టుల భర్తీయే ఉండటం లేదన్నారు. రంగారెడ్డి, నిర్మల్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జనగాం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి, నల్లగొండ తదితర జిల్లాల్లో పోస్టుల భర్తీయే లేదని తెలిపారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు కోర్టును కోరారు. -
టీచర్ పోస్టుల భర్తీలో రెండు రకాల విద్యార్హతలు!
- గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి అవే నిబంధనలు - 2007కు ముందు ఓసీలకు 45 శాతం మార్కులు - ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 శాతం మార్కులుంటే చాలు - 2007 తర్వాత ఓసీలకు 50% మార్కులు ఉండాల్సిందే - ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 45 శాతం మార్కులు చాలు సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ నియామకాల్లో పాటిం చాల్సిన విద్యార్హత నిబంధనలపై విద్యాశాఖ కసరత్తు వేగవంతం చేసింది. ఇప్పటికే గురుకుల పాఠశాలల్లో 7,600 టీచర్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధ నలపై జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) మార్గదర్శకాలను ప్రభుత్వానికి అందజే సింది. తాజాగా పాఠశాల విద్యాశాఖ పరిధిలోని 7,892 పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన నిబంధనలపై కసరత్తు చేస్తోంది. ఎన్సీటీఈ మార్గదర్శకాల ప్రకారం 2007కు ముందు ఇంటర్మీడియెట్, డిగ్రీ పూర్తి చేసిన ఓసీ అభ్యర్థులు బీఎడ్ పూర్తి చేయడంతోపాటు ఆయా కోర్సుల్లో 45 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 40 శాతం చాలు. 2007 తరువాత ఇంటర్మీడియెట్, డిగ్రీ ఉత్తీర్ణులైన ఓసీ అభ్యర్థులు బీఎడ్ పూర్తి చేయడంతో పాటు ఆయా కోర్సుల్లో 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. అదే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులైతే 45 శాతం మార్కులు ఉండాలన్న నిబంధనలను ఖరారు చేసేందుకు విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) వంటి గురుకుల టీచర్ పోస్టుల భర్తీలోనూ ఇవే నిబంధనలను అమలు చేయాలని దీని కోసం ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (బీఎడ్), డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఎడ్) వంటి ఉపాధ్యాయ శిక్షణ కోర్సుల్లో ఉత్తీర్ణులైతే చాలని, ఎలాంటి మార్కుల నిబంధన అవసరం లేదని గురుకుల పోస్టుల కోసం అందజేసినట్లు సమాచారం. పాఠశాల విద్యాశాఖ పరిధి లోని స్కూళ్లలో టీచర్ పోస్టులకు కూడా ఇవే నిబంధనలు ఉండేలా చర్యలు చేపడుతోంది. మరోవైపు గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి అనుసరించాల్సిన రెండంచెల పరీక్ష విధానం (ప్రిలిమ్స్, మెయిన్స్) కాకుండా పాఠశాలల్లో టీచర్ పోస్టుల భర్తీకి వేరుగా పరీక్ష విధానం రూపొందించే అంశంపై కసరత్తు చేస్తోంది. జనరల్ స్టడీస్ వంటి సబ్జెక్టులు లేకుండా, విద్యా పాఠ్య ప్రణాళికలు, నేషనల్ కరిక్యులమ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం పరీక్ష విధానాన్ని రూపొందించేందుకు కసరత్తు చేస్తోంది. త్వరలోనే దీనిపై ఓ స్పష్టత రానుంది. స్కూల్ అసిస్టెంట్, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులకు వేరుగానే పరీక్ష విధానం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. -
బీసీల అర్హత మార్కుల్లో మార్పు లేనట్లే!
త్వరలో గురుకుల టీచర్ల సవరణ నోటిఫికేషన్ హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో టీచర్ల పోస్టుల భర్తీకి త్వరలో విడుదలయ్యే సవరణ నోటిఫికేషన్లో బీసీ అభ్యర్థులకు నిరాశే మిగలనుంది. డిగ్రీ అర్హతలో ఓసీలతో సమానంగా పోటీ పడాల్సిందేనని తెలుస్తోంది. టీఎస్పీ ఎస్సీ ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్లో డిగ్రీలో అర్హత 60% తప్పనిసరని పేర్కొంది. దీంతో క్షేత్ర స్థాయి నుంచి ఆందోళనలు వ్యక్తం కావడం, జాతీయ ఉపాధ్యా య విద్యామండలి(ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధంగా ఉండడంతో సీఎం కేసీఆర్ జోక్యం చేసుకున్నారు. డిగ్రీలో 50% మార్కులున్న వారికి అవకాశం కల్పిస్తూ సవరణ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆయన ఆదేశించడంతో అధి కారులు కసరత్తు మొదలు పెట్టారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ లకు డిగ్రీలో 45% మార్కులుంటే అర్హులుగా ప్రకటించే అవకాశముంది. బీసీల అర్హత మార్కుల్లో సడలింపు లేదని అధికారులు చెబుతున్నారు. దీనిపై విద్యాశాఖ అధికారుల తో సమావేశమై నిబంధనలపై సమీక్షించారు. దీని ప్రకా రం ఎస్సీ, ఎస్టీ కేటగిరీలకు మాత్రమే సడలింపు ఇవ్వను న్నట్లు్ల తెలిసింది. వయోపరిమితిలో మాత్రం ఓసీలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు సడలింపు ఇవ్వాలని నిర్ణయించినట్లు సమాచారం. క్రాఫ్ట్ టీచర్ల అర్హతను ఇంటర్‌కు బదులుగా పదోతరగతి పరిమితం చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. వికలాంగుల రిజర్వే షన్లపైనా త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి చైనా పర్యటనలో ఉన్నారు. ఈ నెల 21న హైదరాబాద్ వచ్చేలోపు సవరణ నోటిఫికేషన్ సిద్ధం చేయనున్నట్లు సమాచారం. -
‘గురుకుల’ సవరణ నోటిఫికేషన్ ఆలస్యం!
⇒ చైనా పర్యటన నుంచి మంత్రులు తిరిగి వచ్చాకే అర్హతలపై నిర్ణయం ⇒ ఈ నెల 21 తరువాతే తదుపరి చర్యలు ⇒ నెలాఖరుకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం సాక్షి, హైదరాబాద్: గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించిన సవరణ నోటిఫికేషన్ మరింత ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. చైనా పర్యటనకు వెళ్లిన మంత్రులు తిరిగి వచ్చాకే.. నోటిఫికేషన్లో విద్యార్హతలు, మార్కుల శాతం, వయో పరిమితి తదితర అంశాలపై తుది నిర్ణయం వెలువడనుంది. ఆ లోగా నోటిఫికేషన్లో చేయాల్సిన మార్పులు, చేర్పులకు సంబంధించిన నివేదికను సిద్ధం చేయాలని సంక్షేమ శాఖ అధికారులు నిర్ణయించారు. కొనసాగుతున్న కసరత్తు.. గురుకులాల్లోని టీజీటీ, పీజీటీ పోస్టుల భర్తీ నోటి ఫికేషన్లో.. అభ్యర్థులు డిగ్రీ, పీజీల్లో కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలని పేర్కొన్న విషయం తెలిసిం దే. అది 50 శాతం మార్కులుంటే చాలన్న జాతీయ ఉపా ధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) నిబంధనలకు విరుద్ధ మంటూ అభ్యర్థుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. దీనిపై జోక్యం చేసుకున్న సీఎం కేసీఆర్.. ఎన్సీటీఈ నిబంధనల ప్రకారమే అర్హతలను నిర్ణయించాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్లో మార్పులు, చేర్పులపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల కోడ్ వర్తించదా?.. ప్రస్తుతం మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన రోజే గురుకుల నోటిఫికేషన్ కూడా జారీ అయింది. కానీ ఈ నోటిఫికేషన్‌కు ఎన్నికల కోడ్ వర్తించదని.. టీచర్లకు సంబంధించిన ఎన్నికలకు, కాబోయే టీచర్లకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారు. మరోవైపు ఈసారి ప్రైవేటు పాఠశాలలు, కాలేజీల్లో పనిచేసే టీచర్లు, లెక్చరర్లకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించారు. వీళ్లంతా గురుకుల టీచర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధ మయ్యారు. దీంతో ఎన్నికల సమయంలో టీచర్ పోస్టుల నోటిఫికేషన్ ద్వారా నేరుగా ప్రయోజనం కల్పించినట్లు అవు తుందని, ఇది ఎన్నికల్ కోడ్ పరిధిలోకి వస్తుందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విదేశ పర్యటన నుంచి మంత్రులు తిరిగొచ్చాక, దీనిపై చర్చించాలని భావిస్తున్నారు. వయో పరిమితి సడలించండి.. అర్హతలు, నిబంధనలు, వయో పరిమితి తదితర అంశాలకు సంబంధించి ఉపాధ్యాయ అభ్యర్థులు మంగళవారం ప్రభు త్వ సీఎస్ ఎస్పీ సింగ్‌ను కలసి వినతి పత్రం అందజేశారు. టీచర్ పోస్టులకు ప్రభుత్వం ఇచ్చిన పదేళ్ల ప్రత్యేక మినహా యింపు కాకుండా సాధారణ గరిష్ట వయోపరిమితి 39 ఏళ్లు గా ఉందని.. కానీ గురుకుల నోటిఫికేషన్లో 34 ఏళ్లుగానే పరిగణనలోకి తీసుకున్నారని పేర్కొన్నారు. గరిష్ట వయో పరిమితిని 39 ఏళ్లకు పెంచాలని, కనీసం రెండేళ్ల సడలింపు ఇస్తే అనేక మందికి ప్రయోజనం చేకూరుతుందని విజ్ఞప్తి చేశారు. మరోవైపు డిగ్రీ, డీఎడ్ కలిగిన అభ్యర్థులకు టీజీటీ పోస్టుల్లో అవకాశం ఇవ్వాలంటూ పలువురు అభ్యర్థులు గిరిజన సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సోమేష్‌కుమార్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. విదేశీ పర్యటనలో మంత్రులు మరోవైపు విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగ దీశ్రెడ్డిలు చైనా పర్యటనకు వెళ్లారు. గురుకుల నోటిఫి కేషన్లో ఎస్సీ గురుకులాలతో పాటు విద్యాశాఖ పరిధి లోని గురుకులాల పోస్టులు కూడా ఉన్నాయి. దీంతో మంత్రులు ఈ నెల 21న తిరిగి వచ్చాకే విద్యార్హతలు, ఇతర నిబంధనలపై నిర్ణయం తీసుకోనున్నారు. సంబం« దిత ఫైలుపై గురుకులాలకు సంబంధించిన అన్ని శాఖల మంత్రులు సంతకాలు చేశాక.. సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపుతారు. సీఎం ఆమోదం అనంతరం టీఎస్పీఎస్సీకి ఉత్తర్వులు వెళ్తాయి. తర్వాత నాలుగైదు రోజులకు టీఎస్పీఎస్సీ సవరణ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన నెలాఖరున సవరణ నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. -
‘గురుకుల’ అర్హతలపై రేపు స్పష్టత
టీఎస్పీఎస్సీకి సంక్షేమ శాఖల వెల్లడి సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉపాధ్యా యుల పోస్టులకు సంబంధించి సవరించిన అర్హతలపై సోమవారానికి పూర్తి స్పష్టత, నిబంధనల వివరాలను అందిస్తామని సంక్షేమ శాఖలు టీఎస్పీఎస్సీకి తెలియజేశాయి. విద్యార్హతల వివరాలు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ వర్గాలు శనివారం ఆయా శాఖలను కోరగా.. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి కొత్త నిబంధనల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదని, పూర్తిస్థాయి వివరాలను సోమవారం అందిస్తామని లిఖితపూర్వకం గా తెలియజేశాయి. మరోవైపు విద్యార్హతల విషయంలో టీఎస్పీఎస్సీకి ఎలాంటి సం బంధం ఉండదని, సంక్షేమ శాఖలు నిర్దేశిం చిన నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. మంత్రులకు తెలిసే... మూడు శాఖలకు చెందిన మంత్రులకు తెలిసే గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనలను ఆయా గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. తెలం గాణ గురుకుల సొసైటీ పరిధిలోని పోస్టుల కు సంబంధించిన ఫైలుపై ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల పోస్టులకు సంబంధించిన నిబంధనల ఫైలుపై సంబంధిత మంత్రి జగదీశ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ గురుకులాల పోస్టుల నిబంధనల ఫైలుపై మంత్రి చందూ లాల్ సంతకాలు చేశారు. ఆ సమయంలో ఎన్సీ టీఈ నిబంధనలు ఎలా ఉన్నాయన్నది కూడా మంత్రులు పరిశీలించలేదు. దీంతో గురుకుల సొసైటీలు పోస్టుల భర్తీకి టీఎస్పీ ఎస్సీకి ఇండెంట్లు సమర్పించాయి. అయి తే సంబంధిత శాఖల అధికారులు కూడా మంత్రులకు ఎన్సీటీఈ నిబంధనలపై స్పష్టం చేయకుండానే మంత్రుల ఆమోదం తీసుకున్నట్టు సమాచారం. -
‘టెట్’ వెయిటేజీపై తొలగని సందిగ్ధం
గురుకులాల్లో టీచర్ల భర్తీ విషయంలో అస్పష్టత సాక్షి, హైదరాబాద్: సంక్షేమ శాఖల పరిధిలోని గురుకులాల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు వెయిటేజీ ఉంటుందా, ఉండదా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) ఉత్తర్వుల ప్రకారం ఒకటి నుంచి 8వ తరగతి వరకు బోధించే వారు టెట్ అర్హత సాధించి ఉంటేనే ఉపాధ్యాయ పోస్టుల్లో నియామకాలు పొందేందుకు అర్హులు. అయితే ఇటీవల గురుకులాల్లోని ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టుల భర్తీకి జారీ చేసిన మార్గదర్శకాల్లో ప్రభుత్వం టెట్ ప్రస్తావనే చేయలేదు. దీనిపై ప్రభుత్వానికి లేఖ రాసిన విద్యా శాఖ.. ఎన్సీటీఈ ఆదేశాల ప్రకారం 8వ తరగతిలోపు బోధించే టీచర్ కచ్చితంగా టెట్ అర్హత సాధించి ఉండాలన్న విషయాన్ని స్పష్టం చేసింది. దీంతో గురుకుల విద్యాలయాల సొసైటీలు టెట్‌ను అర్హత పరీక్షగా తీసుకుంటామని పేర్కొన్నాయి. మరోవైపు టెట్ స్కోర్‌కు ప్రాధాన్యం, కొంత వెయిటేజీ ఇవ్వాలని ఎన్సీటీఈ అదే మార్గదర్శకాల్లో పేర్కొంది. దీంతో ఉపాధ్యాయ నియామకాల్లో టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ ఇవ్వాలని ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులిచ్చింది. విద్యా శాఖ ఈ నిబంధనను పాటిస్తూ, టెట్ స్కోర్‌కు 20 శాతం వెయిటేజీ, రాత పరీక్ష స్కోర్‌కు 80 శాతం వెయిటేజీ ఇచ్చి నియామకాలు చేపడుతోంది. కాని దీనిపై గురుకుల సొసైటీలు ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. టెట్‌ను అర్హత పరీక్షగా పరిగణనలోకి తీసుకుంటామన్నాయే తప్ప టెట్ స్కోర్ వెయిటేజీ విషయంపై నిర్ణయానికి రాలేదు. ప్రస్తుతం టీచర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. టెట్ స్కోర్‌కు వెయిటేజీ ఇవ్వాలా, వద్దా అన్న అంశంపై గురుకుల సొసైటీలను స్పష్టత ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది. సొసైటీలు నిర్ణయాన్ని తెలిపిన వెంటనే టీఎస్పీఎస్సీ 2,500కు పైగా పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. -
ఇంకెన్నాళ్లీ నిరీక్షణ?
ఏటా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం.. అన్న పాలకుల మాటలు నిరుద్యోగులు నిజమేనని నమ్మారు. చెప్పినట్టే నోటిఫికేషన్ ఇవ్వడంతో సంబరపడిపోయారు. పొట్ట పోసుకునేందుకు అప్పటి వరకు చేస్తున్న చిన్నా చితకా ఉద్యోగాలు వదిలేసి పరీక్షలకు సిద్ధమయ్యా రు. కొందరైతే అప్పు చేసి మరీ కోచింగ్ సెంటర్లలో చేరి డీఎస్సీ కోసం శిక్షణ పొందారు. పరీక్షలు ముగిశాయి. ఆ వెంటనే కీ విడుదలైంది. మార్కులు అంచనా వేసుకున్న ప్రతిభావంతులు తమకు ఉద్యోగం ఖాయమని, ఇక బాధ్యతలు స్వీకరించమే తరువాయి అని భావిం చారు. మెరిట్ జాబితా కోసం ఆర్నెల్ల నిరీక్షిస్తూనే ఉన్నారు. ప్రభుత్వం కనికరించలేదు. కోర్టు మెట్లెక్కినా.. మంత్రులను కలిసి వినతి పత్రాలు సమర్పించినా వీరి ఆశలు మాత్రం ఫలించలేదు. - వినుకొండ టౌన్ గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్... జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల భ ర్తీకి గత ఏడాది నవంబర్‌లో నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పటికే రెండేళ్ల నుంచి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులు ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో వేలాది రూపాయలు పెట్టి కోచింగ్‌లకు వెళ్లారు. 951 పోస్టులకు గాను జిల్లా అధికారులకు 33,365 దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది మే 9, 10, 11 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు. అనంతరం పాథమిక, తుది కీలను కూడా విడుదల చేశారు. తుది కీలో మంచి మార్కులు సాధించిన అభ్యర్థులు ఉద్యోగాలు వస్తాయని ఆశపడ్డారు. కానీ అక్కడి నుంచి ప్రక్రియను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లడం లేదు. దీంతో జిల్లాలో డీఎస్సీ పరీక్షలు రాసిన 33 వేల మంది అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు. జిల్లా ర్యాంకర్లకు ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయని తెలిసి, ప్రైవేటు యాజమాన్యాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడంతో వారు ఖాళీగా కాలం గడుపుతుంటే మరి కొందరు ర్యాంకర్లు కూలి పనులకు వెళ్తున్నారు. బాబొస్తే జాబొస్తుందని నమ్మిన నిరుద్యోగులు నిలువునా మునిగిపోతున్నారు. హైకోర్టు, ట్రిబ్యునల్‌లో కేసులు.. ప్రతి డీఎస్సీకీ అభ్యర్థులు కోర్టులను ఆశ్రయించటం సహజం. కానీ 2014 డీఎస్సీ మాత్రం ప్రత్యేకం. సుమారు 1836 కేసులు హైకోర్డు, ట్రిబ్యునల్‌లో అభ్యర్థులు దాఖలు చేశారు. టెట్ కం టీఆర్టీ రద్దు చేయాలనే ప్రధానమైన కేసును ఆగస్టు 6న హైకోర్డు కోట్టి వేసింది. మిగిలిన కేసులన్నీ ప్రభుత్వం విడుదల చేసిన తుది కీలపై ట్రిబ్యునల్‌లో దాఖలైనవే. వీటిని కుదించి 23 కేసులుగా ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. గత డీఎస్సీల్లోనూ కోర్టు కేసులు ఉన్నప్పటికీ తుది తీర్పుకు లోబడి నియామకాలు చేపట్టారని, ఉద్యోగాలు ఇవ్వడం ఇష్టంలేని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆల్యం చేస్తోందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నిరుద్యోగుల గోడు ఆలకించి డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల చేయాలని కోరుతున్నారు. అప్పుచేసి కోచింగ్ తీసుకున్నా.. లక్షరూపాయలు అప్పుతీసుకుని నేనూ నా భార్య కోచింగ్ తీసుకున్నాం. స్కూల్ అసిస్టెంట్ సోషలోలో నాకు 145.97 మార్కులు వచ్చాయి. జిల్లాలో 9వ ర్యాంకు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగాలు ఇవ్వకపోవడంలో తీసుకున్న అప్పుకు వడ్డీ చెల్లిస్తూ ఖాళీగా ఉన్నాను.నిరుద్యోగుల గోడు విని మెరిట్ జాబితా విడుదల చేసి నియామకాలు చేపట్టాలి. - కె.బి.ఎన్.శేఖర్, జిల్లా 9వ ర్యాంకు, ఎస్ఎ సోషల్ మంత్రులకు విన్నవించాం... నియామకాలు చేపట్టాలని మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చాం. 2012 డీఎస్సీ మూడు నెలల్లోనే ప్రక్రియా ముగిసింది. ఈ డీఎస్సీకి మాత్రం ఎదురు చూపులు తప్పడం లేదు. ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలనుకుంటే వెంటనే ఇవ్వవచ్చు. - వి.అనిల్‌కుమార్, ఎస్జీటీ అభ్యర్థి -
టెట్టా... టెర్టా!
* టెట్ వేరుగానా లేక ఎంపిక పరీక్షతో కలిపి నిర్వహించాలా? * ఉపాధ్యాయ అర్హత పరీక్షపై విద్యాశాఖ ఆలోచనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వచ్చే జనవరి నాటికి కొత్త టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భర్తీ విధానంపై మళ్లీ చర్చ మొదలైంది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను వేరుగా నిర్వహిం చాలా? లేక ఉపాధ్యాయ నియామక పరీక్షతో (టీఆర్టీ) టెట్‌ను కలిపి.. టీచర్ ఎలిజిబిలిటీ కమ్ రిక్రూట్మెంట్ టెస్టు (టెర్ట్) పేరుతో ఉమ్మడి పరీక్ష నిర్వహించాలా? అన్న అంశంపై విద్యాశాఖ సమాలోచనలు చేస్తోంది. ఇటీవల టీచర్ల హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ చేపట్టిన అనంతరం 7,974 పోస్టుల అవసరం ఉన్నట్లు విద్యాశాఖ లెక్కలు తేల్చింది. ఈ లెక్కలు తేలాక.. వచ్చే ఏడాది జూన్‌లో స్కూళ్లు తెరవడానికి ముందే కొత్త ఉపాధ్యాయులను నియమిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రకటించారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ అసలు టెట్ అవసరమా? అన్న అంశాన్ని తేల్చేందుకు జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి (ఎన్సీటీఈ) జారీ చేసిన టెట్ మార్గదర్శకాలనూ పరిశీలించే పనిలో పడింది. ఎన్సీటీఈ ఆదేశాల మేరకు 2011 మే నెలలో మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం టెట్ నిర్వహించింది. ఆ తరువాత మూడు సార్లు టెట్ నిర్వహించింది. అయితే ఉపాధ్యాయ విద్యా కోర్సులో చేరేందుకు ఎంపిక పరీక్ష, కోర్సు వార్షిక పరీక్షలు, ఆ తరువాత ఉపాధ్యాయ నియామక పరీక్ష.. ఇలా ఇన్ని పరీక్షల్లో అర్హతతో పాటు ప్రతిభ కనబరిస్తేనే ఉపాధ్యాయ ఉద్యోగం ఇస్తున్నపుడు మళ్లీ ప్రత్యేకంగా టెట్ అవసరమా? అన్న వాదన వ్యక్తమయింది. దీనిపై అధ్యయనం చేసేందుకు 2013లో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఆ కమిటీ సిఫారసుల మేరకు టెట్, డీఎస్సీల నేతృత్వంలోని టీఆర్టీ వేర్వేరుగా కాకుండా రెండూ కలిపి టెర్ట్ పేరుతో నిర్వహించాలని సిఫారసు చేసింది. ప్రభుత్వం కూడా అంగీకరించింది. ఆ తరువాత చివరి నిమిషంలో ఉమ్మడి పరీక్షపై వెనక్కి తగ్గింది. ఇక ఆ తరువాత రాష్ట్ర విభజన జరిగింది. వేర్వేరు పరీక్షలు కాకుండా టీఈఆర్టీ పేరుతో ఒకే రోజు పేపరు-1, పేపరు-2 (ఒకటి టెట్, మరొకటి టీఆర్టీ) ఈ పరీక్షలను నిర్వహించాలన్న ఆలోచనలు ఉన్నాయి. వీలుకాకపోతే టెట్‌ను వేరుగా నిర్వహించడాన్నీ పరిశీలించాలని భావిస్తోంది. మరోవైపు ఏపీలో ఇటీవల రెండింటికి ఒకే రోజు టెర్ట్ను రెండు పేపర్లుగా నిర్వహించారు. అయితే రెండూ కలిపి నిర్వహించడం ఎన్సీటీఈ నిబంధనలకు విరుద్ధమంటూ కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ కేసులో తుది తీర్పు రావాల్సి ఉంది. అది వ చ్చే వరకు వేచి చూడాలని, ఆ తీర్పు ప్రకారం తాము ముందుకు సాగాలన్న ఆలోచనలు అధికారుల్లో ఉన్నాయి.