టీఎస్‌పీఎస్‌సీకి సంక్షేమ శాఖల వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉపాధ్యా యుల పోస్టులకు సంబంధించి సవరించిన అర్హతలపై సోమవారానికి పూర్తి స్పష్టత, నిబంధనల వివరాలను అందిస్తామని సంక్షేమ శాఖలు టీఎస్‌పీఎస్‌సీకి తెలియజేశాయి. విద్యార్హతల వివరాలు ఇవ్వాలని టీఎస్‌పీఎస్‌సీ వర్గాలు శనివారం ఆయా శాఖలను కోరగా.. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి కొత్త నిబంధనల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదని, పూర్తిస్థాయి వివరాలను సోమవారం అందిస్తామని లిఖితపూర్వకం గా తెలియజేశాయి. మరోవైపు విద్యార్హతల విషయంలో టీఎస్‌పీఎస్‌సీకి ఎలాంటి సం బంధం ఉండదని, సంక్షేమ శాఖలు నిర్దేశిం చిన నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు.
మంత్రులకు తెలిసే...
మూడు శాఖలకు చెందిన మంత్రులకు తెలిసే గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనలను ఆయా గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. తెలం గాణ గురుకుల సొసైటీ పరిధిలోని పోస్టుల కు సంబంధించిన ఫైలుపై ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల పోస్టులకు సంబంధించిన నిబంధనల ఫైలుపై సంబంధిత మంత్రి జగదీశ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ గురుకులాల పోస్టుల నిబంధనల ఫైలుపై మంత్రి చందూ లాల్ సంతకాలు చేశారు. ఆ సమయంలో ఎన్‌సీ టీఈ నిబంధనలు ఎలా ఉన్నాయన్నది కూడా మంత్రులు పరిశీలించలేదు. దీంతో గురుకుల సొసైటీలు పోస్టుల భర్తీకి టీఎస్‌పీ ఎస్‌సీకి ఇండెంట్‌లు సమర్పించాయి. అయి తే సంబంధిత శాఖల అధికారులు కూడా మంత్రులకు ఎన్‌సీటీఈ నిబంధనలపై స్పష్టం చేయకుండానే మంత్రుల ఆమోదం తీసుకున్నట్టు సమాచారం.
‘గురుకుల’ అర్హతలపై రేపు స్పష్టత
Published Sun, Feb 12 2017 1:47 AM | Last Updated on Tue, Sep 5 2017 3:28 AM
Advertisement