Minister Kadiyam
-
13న ఎమ్మార్పీఎస్ బంద్ వాయిదా
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13న తలపెట్టిన బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ప్రకటించారు. ఆదివారం సికింద్రాబాద్ పార్శిగుట్టలోని కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా బంద్‌ను వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. 24 ఏళ్ల తమ ఉద్యమ పోరాటంలో బంద్‌ను వాయిదా వేయడం ఇదే తొలిసారని అన్నారు. ప్రజలకు ఇబ్బంది లేని రోజునే బంద్ నిర్వహిస్తామని చెప్పారు. 13న బంద్‌కు బదులుగా జిల్లా, మండల కేంద్రాల్లో అంబేడ్కర్ విగ్రహాల వద్ద ఆందోళనలు చేపడతామని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలని అన్నారు. రాజ్యసభలో వర్గీకరణ కోసం రాహుల్‌గాంధీ మాట్లాడాలని డిమాండ్ చేశారు. అఖిలపక్షంపై సీఎం కేసీఆర్, మంత్రి కడియం ఇచ్చిన మాట తప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల హక్కుల కోసం పోరాటం చేస్తున్న తనను హతమార్చేందుకు ప్రభుత్వం చేసిన కుట్రను ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు ప్రశ్నించాలని మంద కృష్ణ మాదిగ కోరారు. హత్యకుట్రపై సీబీఐ విచారణకు ప్రభుత్వం ఆదేశిస్తే నిరూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. -
స్కోరింగ్ సబ్జెక్టుగా తెలుగు
సాక్షి, హైదరాబాద్: ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు తెలుగును తప్పనిసరి సబ్జెక్టుగా అమలుకు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధికారులను ఆదేశించారు. ఆసక్తికరంగా ఉండేలా, మార్కుల స్కోరింగ్ సబ్జెక్టుగా తెలుగులో అవసరమైన మార్పులు చేయాలని సూచించారు. తెలుగు తప్పనిసరి చేసేందుకు ప్రభుత్వం నియ మించిన సబ్ కమిటీ మంగళవారం తన నివేదికను కడియం శ్రీహరికి అందజేసింది. ప్రస్తుతం వివిధ రాష్ట్రాల్లో మాతృభాష అమలు, తెలుగు అమలుకు చేపట్టాల్సిన చర్యలను నివేదికలో పొందుపరిచారు. రాష్ట్రంలో తెలుగు మాతృభాషగా లేని పాఠశాలలు 1,370 ఉన్నాయని పేర్కొన్నారు. 5వ తరగతి వరకు తెలుగును చదువుకోని వారికి 6వ తరగతిలో అత్యంత సులభంగా సబ్జెక్టును నేర్చుకునేలా పాఠ్యపుస్తకాలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. 7వ తరగతి వరకు తెలుగు చదువుకోని వారికి 8వ తరగతిలో, 10వ తరగతి వరకు చదువుకోని వారికి ఇంటర్ మొదటి సంవత్సరంలో తెలుగు భాషను సులభంగా నేర్చుకునేలా రూపొందిస్తామన్నారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈలో కూడా తెలుగు తప్పనిసరి సబ్జెక్టుగా అమలుకు ఆయా బోర్డుల ఉన్నతాధికా రులతో మాట్లాడగా.. తమకెలాంటి అభ్యంతరం లేదని చెప్పినట్లు కడియంకు వివరించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు తప్పనిసరి సబ్జెక్టుగా అమలు తీరు పర్యవేక్షణకు ఓ కమిటీ ఉండాలని కడియం అభిప్రాయపడ్డారు. ఇందుకు ప్రస్తుత సబ్ కమిటీని ‘తెలుగు భాష అమలు సలహా సంఘం’గా మారుస్తు న్నట్లు వెల్లడించారు. ఈ కమిటీ తెలుగు భాషను అన్ని విద్యా సంస్థల్లో తప్పనిసరి సబ్జెక్టుగా ఎలా అమలుచేయాలి.. అమలులోని ఇబ్బందులను అధిగ మించేందుకు ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలు.. అమలుపై పర్యవేక్షణకు సూచనలు చేయాలని చెప్పారు. జిల్లా స్థాయిలోనూ అమలుపై పర్యవేక్షణ కమిటీలుండాలని, వాటి నిర్మాణం ఎలా ఉండాలో కూడా ఈ కమిటీ సూచించాలన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్. ఆచార్య, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, సబ్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, కన్వీనర్ అశోక్, సభ్యులు దేశపతి శ్రీనివాస్, దేవులపల్లి ప్రభాకర్ రావు, సత్యనారాయణరెడ్డి, శేషు కుమారి, సువర్ణవినాయక్ పాల్గొన్నారు. నివేదికలోని ప్రధాన అంశాలు.. - 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్, ఇతర మీడియం వారు ద్వితీయ భాషగా తెలుగును ఎంచుకోవాలి. - సీబీఎస్ఈ 11, 12 తరగతుల్లో తెలుగును ఆప్షనల్ సబ్జెక్టుగా గానీ, ప్రధాన సబ్జెక్టుగా గానీ చదువుకోవాలి. - 10వ తరగతి వరకు తెలుగును ఒక సబ్జెక్టుగా, తెలుగు మీడియంలో చదువుకున్న వారంతా ఇంటర్మీడియెట్‌లో ద్వితీయ భాషగా తెలుగును కచ్చితంగా చదువుకోవాల్సిందే. - 10వ తరగతి వరకు తెలుగు మీడియం మినహా ఇతర మీడియంలో చదువుకున్న వారు ద్వితీయ భాషగా 50 మార్కులకు తెలుగును, మరో 50 మార్కులకు తమకు నచ్చిన భాషను ఎంచుకోవచ్చు. -
‘గురుకుల’ అర్హతలపై రేపు స్పష్టత
టీఎస్పీఎస్సీకి సంక్షేమ శాఖల వెల్లడి సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉపాధ్యా యుల పోస్టులకు సంబంధించి సవరించిన అర్హతలపై సోమవారానికి పూర్తి స్పష్టత, నిబంధనల వివరాలను అందిస్తామని సంక్షేమ శాఖలు టీఎస్పీఎస్సీకి తెలియజేశాయి. విద్యార్హతల వివరాలు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ వర్గాలు శనివారం ఆయా శాఖలను కోరగా.. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర స్థాయిలో గురుకుల టీచర్ పోస్టుల భర్తీకి కొత్త నిబంధనల రూపకల్పన ఇంకా పూర్తి కాలేదని, పూర్తిస్థాయి వివరాలను సోమవారం అందిస్తామని లిఖితపూర్వకం గా తెలియజేశాయి. మరోవైపు విద్యార్హతల విషయంలో టీఎస్పీఎస్సీకి ఎలాంటి సం బంధం ఉండదని, సంక్షేమ శాఖలు నిర్దేశిం చిన నిబంధనల ప్రకారమే నోటిఫికేషన్ జారీ చేస్తామని టీఎస్పీఎస్సీ చైర్మన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి తెలిపారు. మంత్రులకు తెలిసే... మూడు శాఖలకు చెందిన మంత్రులకు తెలిసే గురుకుల ఉపాధ్యాయుల పోస్టుల భర్తీకి సంబంధించిన నిబంధనలను ఆయా గురుకుల సొసైటీలు నిర్ణయించాయి. తెలం గాణ గురుకుల సొసైటీ పరిధిలోని పోస్టుల కు సంబంధించిన ఫైలుపై ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల పోస్టులకు సంబంధించిన నిబంధనల ఫైలుపై సంబంధిత మంత్రి జగదీశ్‌రెడ్డి, గిరిజన సంక్షేమ గురుకులాల పోస్టుల నిబంధనల ఫైలుపై మంత్రి చందూ లాల్ సంతకాలు చేశారు. ఆ సమయంలో ఎన్సీ టీఈ నిబంధనలు ఎలా ఉన్నాయన్నది కూడా మంత్రులు పరిశీలించలేదు. దీంతో గురుకుల సొసైటీలు పోస్టుల భర్తీకి టీఎస్పీ ఎస్సీకి ఇండెంట్లు సమర్పించాయి. అయి తే సంబంధిత శాఖల అధికారులు కూడా మంత్రులకు ఎన్సీటీఈ నిబంధనలపై స్పష్టం చేయకుండానే మంత్రుల ఆమోదం తీసుకున్నట్టు సమాచారం. -
మంత్రి కడియం క్షమాపణ చెప్పాలి
ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాణయ్య హత్నూర: మహిళా ఉపాధ్యాయుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన దౌల్తాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయురాలని చూడకుండా అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి కడియం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉపాద్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దౌల్తాబాద్ తెలంగాణతల్లి చౌరస్తా వద్ద 10వ తేదీ 10గంటలకు చేపట్టే నిరసన కార్యక్రమానికి మండలంలోని మహిళా ఉపాధ్యాయులు తరలిరావాలన్నారు. -
మంత్రి ‘కడియం’ను తొలగించాలి
నిర్మల్‌రూరల్ : ఎంసెట్–2 పేపర్ లీకేజీ వ్యవహారానికి సంబంధిత మంత్రి కడియం శ్రీహరిని బాధ్యుడిని చేస్తూ ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు లోలం శ్యాంసుందర్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. న్యాయబద్ధంగా పరీక్ష రాసిన విద్యార్థులు నష్టపోకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారం పాలకుల కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు. గతంలో ఆరోపణలు వస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తాటికొండ రాజయ్యను తొలగించారని, ఇప్పుడు కడియం శ్రీహరిని కూడా తప్పించాలని పేర్కొన్నారు. ఎన్నో ఆశలతో ఎంసెట్ రాసి ఉత్తమ ర్యాంకులు పొందిన విద్యార్థులు ఈ ఘటనతో ఆవేదన చెందుతున్నారని, వారందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని తెలిపారు. సర్కారు సరైన న్యాయం చేయని పక్షంలో టీడీపీ ఆందోళన చేపడుతుందని హెచ్చరించారు. -
లోపాలు సరిదిద్దుకుంటే మళ్లీ గుర్తింపు
మే నెలలో 4వ విడత తనిఖీలు ఉప ముఖ్యమంత్రి కడియం స్పష్టీకరణ హైదరాబాద్: రాష్ట్రంలోని 288 ప్రైవేటు ఇంజనీరింగ్ కళాశాలల్లో బోధన వసతులపై మే నెలలో నాలుగో విడత తనిఖీలు నిర్వహిస్తామని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రకటించారు. మూడు విడతల తనిఖీల అనంతరం గుర్తింపు (అఫిలియేషన్) కోల్పోయిన 163 కళాశాలలు నాలుగో విడత తనిఖీల నాటికి లోపాలు సరిదిద్దుకుంటే గుర్తింపును పునరుద్ధరిస్తామన్నారు. నాలుగో విడత తనిఖీల ఆధారంగానే కళాశాలల్లో 2015-16కు సంబంధించి ప్రవేశాలు, గుర్తింపు అంశంపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మేరకు అన్ని కళాశాలలకు నోటీసులు జారీ చేసినట్టు తెలిపారు. శనివారం రెండోరోజు జిల్లా కలెక్టర్ల సదస్సులో పాల్గొన్న ఆయన.. సదస్సు వేదిక మారియట్ హోటల్ బయట విలేకరుల సమావేశం నిర్వహించారు. విశ్వవిద్యాలయాల గుర్తింపు కోల్పోయిన 163 కళాశాలలకు అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) నుంచి గుర్తింపు పొడిగింపు లభించిన విషయం తమ దృష్టికి వచ్చిందని, ఏఐసీటీఈ అనుమతి లభిస్తే వర్సిటీల గుర్తింపునకు హక్కు కల్పించినట్లు కాదన్నారు. ఇది పూర్తిగా విశ్వవిద్యాలయాల పరిధిలోని అంశమన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఐఐటీహెచ్, బిట్స్ పిలానీ, నీట్ సంస్థల నిపుణులతో నిర్వహించిన మూడో విడత తనిఖీల నివేదికలను ఆన్లైన్లో ఉంచామన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం పేద విద్యార్థుల కోసమేనని, ప్రైవేటు కాలేజీల మనుగడ కోసం కాదన్నారు. 2014-15లో ప్రవేశాలు పొందిన ప్రతి విద్యార్థికి ఫీజు రీయింబర్స్మెంట్ వర్తింపజేస్తామన్నారు. గుర్తింపు రద్దయిన 163 కాలేజీల్లో ప్రవేశాలు పొంది న ఇంజనీరింగ్ ఫస్టియర్ విద్యార్థులను వార్షిక పరీక్షలకు అనుమతిస్తామన్నారు. పునర్విభజన చట్టంలోని 10వ షెడ్యూల్లో జేఎన్టీయూ-హెచ్ లేదని, హైదరాబాద్‌లో ఇంజనీరింగ్ కళాశాలలు ఫ్రీ జోన్ పరిధిలోకి రావన్నారు. ఏపీ రాష్ట్ర విశ్వవిద్యాలయాల చట్టాన్ని తెలంగాణ రాష్ట్రానికి అనుగుణంగా సవరణలు చేస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆ తర్వాతే రాష్ట్రంలోని వర్సిటీలకు శాశ్వత ప్రాతిపదికన వీసీలను నియమిస్తామన్నారు. 5 వర్సిటీలకు ఇన్చార్జ్ వీసీలు రాష్ట్రంలోని 5 వర్సిటీలకు ప్రభుత్వం ఇన్చార్జ్ వీసీ లను నియమించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రంజీవ్ ఆర్.ఆచార్య శనివారం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. వరంగల్‌లోని కాకతీయ వర్సిటీకి పాఠశాల విద్యా డెరైక్టర్ టి.చిరంజీవులు, నల్లగొండలోని మహాత్మాగాంధీ వర్సిటీకి కళాశాల విద్యా కమిషనర్ వాణిప్రసాద్లను ఇన్చార్జ్ వీసీలుగా నియమించారు. పాలమూరు, శాతవాహన, తెలుగు వర్సిటీలకు పాతవారినే కొనసాగించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.