- ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాణయ్య
హత్నూర: మహిళా ఉపాధ్యాయుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎస్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మాణయ్య డిమాండ్ చేశారు. మంగళవారం సాయంత్రం ఆయన దౌల్తాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ మహిళా ఉపాధ్యాయురాలని చూడకుండా అవమానించే విధంగా మాట్లాడిన మంత్రి కడియం మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు నిరసనగా బుధవారం జిల్లా వ్యాప్తంగా ఉపాద్యాయ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. దౌల్తాబాద్ తెలంగాణతల్లి చౌరస్తా వద్ద 10వ తేదీ 10గంటలకు చేపట్టే నిరసన కార్యక్రమానికి మండలంలోని మహిళా ఉపాధ్యాయులు తరలిరావాలన్నారు.