![Committee to monitor the Sustainable Development Goals - Sakshi](/styles/webp/s3/article_images/2023/06/29/jawahar.jpg.webp?itok=5MvlrGDW)
సాక్షి, అమరావతి: ఐక్యరాజ్యసమితి పేర్కొన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ఏపీఎస్‌డీజీ ప్రత్యేక పోర్టల్ ద్వారా సేకరించే సమాచారం దునియోగం కాకుండా ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎనిమిది మంది సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి బుధవారం ఉత్తర్వులిచ్చారు.
కమిటీలో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, మైనార్టీ, గిరిజన సంక్షేమ కార్యదర్శులు సభ్యులుగా, ఐటీశాఖ కార్యదర్శి సభ్య కన్వినర్‌గా వ్యవహరిస్తారని వివరించారు.
10 నుంచి 19 ఏళ్ల బాలికల్లో ఎనీమియా, 15 నుంచి 49 ఏళ్ల మధ్యలో గర్భందా ల్చిన మహిళల్లో ఎనీమియా, ఐదేళ్లలోపు వయసులో బరువు తక్కువగా ఉన్న వారిలో పౌష్టికాహారలోపం, ఐదేళ్లలోపు వయసుకు తగ్గట్టుగా బరువు పెరగని పిల్లల్లో పౌష్టికాహారలోపం, 1–8 తరగతుల విద్యార్థుల ప్రాథమిక విద్య నమోదు, ఇంటర్మిడియట్ విద్యార్థుల గ్రాస్ ఎన్‌రోల్‌మెంట్ నిష్పత్తి, పాఠశాలల్లో కనీస మౌలిక వసతులు, పాఠశాలల్లో విద్యార్థినుల టాయిలెట్స్ వంటి ఎనిమిది సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించిన సమాచారం గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎప్పటికప్పుడు సేకరించి ఏపీఎస్‌డీసీ పోర్టల్‌లో నమోదు చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment