పథకాలు పేదలకు సత్వరం అందేలా చూడండి
మంత్రి జగదీశ్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: వివిధ సంక్షేమ శాఖల ద్వారా అమలవుతున్న పథకాలు పేదలకు సత్వరం అందేలా చూడాలని అధికారులను మంత్రి జగదీశ్‌రెడ్డి సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు. మంగళవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ శాఖల అధికారులతో సమావేశమయ్యారు.
సంక్షేమ శాఖల ద్వారా అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు, హాస్టళ్ల స్థితిగతులు తదితరాల వివరాలను తెలుసుకున్నారు. గతేడాది ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఉన్న బకాయిలు, ఈ 2015-16 ఫీజుల కోసం వివిధ శాఖలకు అవసరమైన నిధులు తదితర వివరాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో సహకార శాఖ వినూత్న రీతిలో పనిచేయాలని మంత్రి జగదీశ్‌రెడ్డి ఆకాంక్షించారు. రైతులకు ఎరువుల సరఫరా, ధాన్యం సేకరణ తదితర అంశాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు. మార్క్‌ఫెడ్, హౌజ్‌ఫెడ్, హాకాల ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను సమీక్షించారు.