శ్రీకాకుళం జిల్లా వంగర మండలం మడ్డువలసలోని గురుకుల పాఠశాలను రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆదివారం ఆకస్మిక తనఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నాసిరకం భోజనాన్ని అందిస్తున్నారని గుర్తించి.. దీనికి బాధ్యుడైన ప్రిన్సిపల్‌పై మండిపడ్డారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలను పెడ చెవిన పెడుతోందని.. భావి పౌరులైన విద్యార్థుల విషయంలో ప్రభుత్వం చిత్త శుద్దితో వ్యవహరించడం లేదని ఆయన విమర్వించారు.