పదో తరగతి విద్యార్థినిపై ఢిల్లీలో గ్యాంగ్‌రేప్ | Delhi shame: Class 10th student gang-raped in Uttam Nagar at gun point | Sakshi
Sakshi News home page

పదో తరగతి విద్యార్థినిపై ఢిల్లీలో గ్యాంగ్‌రేప్

Published Wed, Jul 30 2014 1:35 AM | Last Updated on Sat, Sep 2 2017 11:04 AM

పదో తరగతి విద్యార్థినిపై  ఢిల్లీలో గ్యాంగ్‌రేప్

పదో తరగతి విద్యార్థినిపై ఢిల్లీలో గ్యాంగ్‌రేప్

న్యూఢిల్లీ: ఢిల్లీలో మరో దారుణ అత్యాచారం చోటు చేసుకుంది. పదో తరగతి విద్యార్థినిపై ఐదుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ నెల 19న జరిగిన ఈ దారుణంపై కుటుంబ సభ్యులతో కలసి బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నెల 19న స్కూల్‌కి వెళుతున్న విద్యార్థినిని నలుగురు వ్యక్తులు బలవంతంగా ఉత్తమ్ నగర్‌లోని ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై ఆ నలుగురితోపాటు మరొకరు కలసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

వీరిలో ఇద్దరు బాలురు కూడా ఉన్నారు. అత్యాచారం చేయడంతోపాటు దాన్ని మొబైల్‌లో చిత్రీకరించిన నిందితులు ఎవరికైనా చెబితే ఇంటర్నెట్‌లో పెడతామని బెదిరిం చినట్లు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొంది. కాగా, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశామని వారు బాధితురాలికి తెలిసినవారేనని పోలీ సులు తెలిపారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. కాగా, బెంగళూరులోని ఓ స్కూల్‌లో ఒకటో తరగతి బాలిక(6)పై అత్యాచారం కేసులో పోలీసులు స్కూల్ జిమ్ ఇన్‌స్ట్రక్టర్లు లాల్‌గిరి (21), వాసిం పాషా (28)లను అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement