బాలుడు కిడ్నాప్‌.. హిజ్రాగా ప్రత్యక్షం | Transgenders Kidnapped Tenth Class Student And Changed Like Hijra In Karnataka | Sakshi
Sakshi News home page

బాలుడు కిడ్నాప్‌.. హిజ్రాగా ప్రత్యక్షం

Published Wed, Oct 31 2018 12:06 PM | Last Updated on Wed, Oct 31 2018 6:14 PM

Transgenders Kidnapped Tenth Class Student And Changed Like Hijra In Karnataka - Sakshi

హిజ్రాగా ఉన్న చందన్‌

వేసవి సెలవులు ముగించుకుని బస్సులో వస్తుండగా హిజ్రాలు బాలునికి మాయమాటలు చెప్పి వెంట తీసుకెళ్లారు. అతనికి లింగమార్పిడి చేసి తమలాగే మార్చి భిక్షాటన ప్రారంభించారు. తమ కొడుకు ఏమయ్యాడోననిఅప్పటినుంచి నిరీక్షించిన తల్లిదండ్రులకు పిడుగులాంటి నిజం తెలిసిదిగ్భ్రాంతికి గురయ్యారు. మైసూరు జిల్లాలో షాక్‌కు గురిచేసే సంఘటన బయటపడింది. ఇలా ఇంకెంతమంది బాలలు ఇటువంటి ముఠాల చెరలో మగ్గిపోతున్నారోనని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.  

కర్ణాటక, యశవంతపుర: ఐదారు నెలల క్రితం అదృశ్యమైన 10వ తరగతి బాలుడు.. ఇప్పుడు హిజ్రాగా కనిపించడంతో కన్నవారు తీవ్రంగా విలపిస్తున్నారు. మైసూరు జిల్లా క్రిష్ణరాజపేట తాలూకా హక్కిమంచనహళ్లికి చెందిన చందన్‌కుమార్‌ (16) లింగమార్పిడితో ఇప్పుడు చందన్‌కుమారిగా మారిపోయాడు. వివరాలు.. చందన్‌కుమార్‌ బెంగళూరులోని పిన్నమ్మ ఇంట్లో ఉంటూ బీబీఎంపీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదివేవాడు. ఈ ఏడాది మేలో వేసవి సెలల్లో సొంతూరికి వెళ్లాడు. సెలవు ముగియటంతో తల్లిదండ్రులుఅతడిని బస్‌ ఎక్కించి బెంగళూరుకు పంపించారు.  

బెంగళూరుకు వస్తూ మిస్సింగ్‌  
అయితే చందన్‌ బెంగళూరుకు వెళ్లలేదు. అదృశ్యమయ్యాడని తల్లిదండ్రులు కేఆర్‌పేట పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పోలీసులు, కన్నవారు బాలుని కోసం గాలిస్తున్నారు. ఆదివారం ఉదయం ఇద్దరు హిజ్రాల జతలో బాలుడు కేఆర్‌ పేజీ పట్టణంలోని టీబీ రోడ్డులో ఉన్నాడు. ఆ సమయంలో మంజు అనే యాచకుడు చందన్‌ను చూసి గుర్తుపట్టాడు. ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని బాలున్ని ప్రశ్నిస్తుండగా ఇతర హిజ్రాలతో కలిసి ఆటోలో పారిపోవటానికి ప్రయత్నించగా మంజు ఆటోను వెంబడించి పట్టుకుని కేఆర్‌పేట పట్టణ పోలీసులకు అప్పగించాడు. తన కొడుకు హిజ్రాగా కనిపించాడని తెలిసిన తల్లిదండ్రులు బంధువులతో కలిసి స్టేషన్‌కు చేరుకున్నారు. తన కొడుకును హిజ్రాలే అపహరించి ఇలా మార్చారని తల్లిదండ్రులు పోలీసుల ముందు కన్నీరుమున్నీరయ్యారు. మైనర్‌ బాలుడిని కిడ్నాప్‌ చేసి లింగ మార్పిడి చేసిన ఆరోపణలపై ఇద్దరు హిజ్రాలను అదుపులోకి తీసుకోని పోలీసులు విచారిస్తున్నారు. చందన్‌ను మహిళ శిశు సంక్షేమశాఖ అధికారులకు అప్పగించిన్నట్లు ఎస్‌ఐ వెంకటేశ్‌ తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement