
కందుకూరు రూరల్: కరోనా వైరస్ ప్రభావంతో రాష్ట్రం లాక్ డౌన్‌లో ఉంది. 144 సెక్షన్ అమలులో ఉంది. విద్యా సంస్థలన్నీ మూతబడ్డాయి. ఇవేమీ పట్టని నారాయణ స్కూల్ యాజమాన్యం పదో తరగతి విద్యార్థినులకు తరగతులు నడుపుతున్నారు. అధిక ర్యాంకుల సాధించాలనే ఉద్దేశంతో ఇలాంటి కక్కుర్తిని ప్రదర్శించింది. పట్టణంలోని తూర్పు వడ్డెపాలెంలో అదే పాఠశాలలో పదో తరగతి చదివే ఓ విద్యార్థినీ ఇంటిని తీసుకొని రహస్యంగా పదో తరగతి విద్యార్థినులకు పాఠాలు బోధిస్తున్నారు.
మూడు నాలుగు రోజుల నుంచి ఇలా జరుగుతుందని తెలుసుకున్న వార్డు వలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు కందుకూరు పట్టణ ఎస్సైకు సమాచారం ఇచ్చారు. ఎస్సై తిరుపతిరావు తనిఖీ చేయగా ఒక చిన్న గదిలో సుమారు 25 మంది బాలికలకు తరగతులు నిర్వహిస్తున్నారు. దీంతో టీచింగ్ స్టాఫ్ ఐదుగురిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ చేపడతామని ఎస్సై తెలిపారు. దీనిపై నారాయణ పాఠశాలకు ఎంఈఓ జి.పెద్దిరాజు మెమో జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment