
శివమణి
చైతన్యపురి: ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేయలేదని మనస్థాపంతో ఓ ఎస్‌ఎస్‌సీ విద్యార్థి బ్లేడుతో చేయికోసుకున్న సంఘటన దిల్‌సుఖ్‌నగర్‌లో చోటు చేసుకుంది. స్థానిక గౌతంమోడల్ స్కూల్‌లో శివమణి అనే విద్యార్థి 10వ తరగతి చదువుతున్నాడు. కొన్నిరోజులుగా ఫేర్‌వెల్ పార్టీ ఏర్పాటు చేయాలని ఇన్‌చార్జి టీచర్ మెహర్‌మణిని కోరుతుండగా, హెడ్‌ఆఫీస్ అనుమతి వచ్చిన తరువాత ఫేర్‌వెల్ పార్టీ డేట్ ప్రకటిస్తామని ఆమె తెలిపింది. ప్రీఫైనల్ పరీక్ష చివరిరోజు కావటంతో బుధవారం విద్యార్థులు ఫేర్‌వెల్ పార్టీ విషయమై అడిగినా టీచర్ స్పందించక పోవటంతో మనస్థాపానిలోనైన శివమణి తరగతిగదిలో బ్లేడుతో చేయి కోసుకున్నాడు. దీనిని గుర్తించిన సిబ్బంది సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఎంఈఓ వెంకటేశ్వర్లు పాఠశాలకు చేరుకుని విద్యార్థులు, ప్రిన్సిపల్ రేణుకను అడిగి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment