భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో జరగబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ శుక్రవారం ప్రకటించారు. ‘‘డబుల్ ఇంజన్ ప్రభుత్వాలుంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలెత్తుతుందని ఆశించాం. కానీ బీజేడీ అధికారంలో ఉన్న ఒడిశాలో కేంద్ర పథకాలు చివరి లబ్ధిదారు దాకా చేరడం లేదు’’ అని ఆరోపించారు.
రాష్ట్రంలో పొత్తుపై అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ), బీజేపీ మధ్య కొద్దిరోజుల క్రితం చర్చలు జరగడం తెలిసిందే. బీజేడీతో పొత్తుపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని గత వారమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతలో ఇలా ఒంటరిపోరు ప్రకటన వెలువడింది. తాము కూడా అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు బీజేడీ శుక్రవారం ప్రకటించింది. 1998–2009 మధ్య రెండు పార్టీలు 11 ఏళ్లు కూటమిగా ఉన్నాయి. మూడుసార్లు లోక్‌సభ, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి.
Comments
Please login to add a commentAdd a comment