Odisha assembly polls
-
క్రియాశీల రాజకీయాలకు గుడ్ బై: వీకే పాండ్యన్
ఒడిశా అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేడీ ఘోర ఓటమి చవిచూడటంతో క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు మాజీ అధికారి, ఆ పార్టీ నేత వీకే పాండ్యన్ ప్రకటించారు. బీజేడీ చీఫ్ నవీన్ పట్నాయక్‌కు సాయంగా ఉండేందుకు మాత్రమే రాజకీయాల్లోకి వచ్చినట్లు ఆయన ఆదివారం విడుదల చేసిన ఒక వీడియోలో పేర్కొన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. -
ఒడిశా సీఎంగా సురేశ్ పూజారి?
భువనేశ్వర్: ఒడిశా అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో దాదాపు 24 ఏళ్లకు బీజేపీ గెలుపు సొంతం చేసుకోవడం తెల్సిందే. ముఖ్యమంత్రి కుర్చీని అధిరోహించేదెవరన్న విషయంలో మాత్రం సందిగ్ధం కొనసాగుతోంది. అయితే, సీనియర్ నేత, తాజాగా ఎమ్మెల్యే సురేశ్ పూజారిని పార్టీ హైకమాండ్ ఢిల్లీకి రావాలంటూ కబురు పంపించింది. దీంతో, సీఎం పదవి ఆయనకే దక్కవచ్చనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. శాసనసభా పక్ష నేత ఎవరనేది అధిష్టానమే చూసుకుంటుందని రాష్ట్ర వర్గాలు అంటున్నాయి. ఇలా ఉండగా, ప్రధానమంత్రి బిజీ షెడ్యూల్ దృష్ట్యా కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ఈ నెల 10కి బదులుగా 12న చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు వివరించాయి. -
Lok Sabha Election 2024: నేడే తుదిపోరు
సాక్షి, న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగింపు దశకు చేరింది. ఎన్నికల్లో భాగంగా ఆఖరి విడత పోలింగ్ శనివారం జరుగనుంది. కేంద్ర పాలిత ప్రాంతం చండీగఢ్‌పాటు బిహార్, హిమాచల్‌ప్రదేశ్, జార్ఖండ్, ఒడిశా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశి్చమ బెంగాల్ రాష్ట్రాల్లోని 57 లోక్‌సభ స్థానాలకు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమవుతుంది. వీటితో పాటు ఒడిశా శాసనసభ ఎన్నికల్లో మిగిలిన 42 అసెంబ్లీ నియోజకవర్గాలకు సైతం పోలింగ్ నిర్వహిస్తారు. అంతేకాకుండా బిహార్ ఒకటి, ఉత్తరప్రదేశ్‌లో ఒకటి, పశి్చమబెంగాల్లో ఒకటి, హిమాచల్‌ప్రదేశ్‌లో ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలకు కూడా ఉపఎన్నిక జరుగనుంది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆఖరి దశలో పోలింగ్ జరిగే స్థానాల్లో ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్, అభిõÙక్ బెనర్జీ, మీసా భారతి, కంగనా రనౌత్ వంటి ప్రముఖులు బరిలో నిలిచారు. చివరి విడతలోని 57 లోక్‌సభ స్థానాల్లో 2019 ఎన్నికల్లో ఎన్డీఏ 32, యూపీఏ 9 సీట్లు దక్కించుకున్నాయి. మిగతా స్థానాలను ఇతర పార్టీలు గెలుచుకున్నాయి. అంటే సగానికి పైగా ఎన్డీయే సిట్టింగ్ స్థానాలు ఉన్నాయి. ఏప్రిల్ 19న ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటిదాకా జరిగిన ఆరు దశల్లో 486 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యింది. కాగా మొత్తం ఏడు దశల్లోని 543 లోక్‌సభ స్థానాలకు జరిగిన ఎన్నికలు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలు, 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ జూన్ 4న ప్రారంభం కానుంది. అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జూన్ 2న ప్రారంభమవుతుంది. -
Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
ఒడిశాలో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలో సోమవారం తొలి దశ పోలింగ్ జరగనుంది. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండటంతో పారీ్టలన్నీ హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నాయి. సోమవారం 4 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు తేలిపోనున్నాయి. వీటిలో మూడు లోక్‌సభ స్థానాలు ఏపీ సరిహద్దు ప్రాంతాలే. అధికార బిజూ జనతాదళ్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి మధ్య ఒడిశాలో త్రిముఖ పోరు జరుగుతోంది. బీజేడీని గద్దె దింపడంతో పాటు మెజారిటీ లోక్‌సభ స్థానాలు కొల్లగొట్టేందుకు బీజేపీ శ్రమిస్తోంది. కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక రెండు దశాబ్దాలకు పైగా సీఎం కురీ్చలో పాతుకుపోయిన బీజేడీ చీఫ్ నవీన్ పటా్నయక్ రెండు జాతీయ పారీ్టలనూ నిలువరించేందుకు పోరాడుతున్నారు. పోలింగ్ జరగనున్న 4 లోక్‌సభ స్థానాల్లో పరిస్థితిపై ఫోకస్... బరంపూర్... జంపింగ్ జపాంగ్! ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ నియోజకవర్గంలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. బరంపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 1996లో ఇక్కడి నుంచి గెలిచారు. 1999లో కాషాయ జెండా కూడా ఎగిరింది. 2009 నుంచీ బీజేడీ హవాయే సాగుతోంది. ఇక్కడ బరిలో ఉన్న, గెలిచిన అభ్యర్థులు పారీ్టలు మారిన వారే కావడం విశేషం. 2004 నుంచి 2019 మధ్య చంద్రశేఖర్ సాహు, ఒరియా సినీ నటుడు సిద్ధాంత మహాపాత్ర చెరో రెండుసార్లు గెలిచారు. సాహు 2004లో కాంగ్రెస్ తరఫున గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ అభ్యర్థి మహాపాత్ర చేతిలో ఓడారు. తర్వాత సాహు కాంగ్రెస్‌ను వీడి బీజేడీలో చేరారు! 2019లో ఆ పార్టీ టికెట్‌పై గెలిచారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి వచి్చన భృగు బాక్సిపాత్రకు బీజేడీ టికెటివ్వడం విశేషం. భృగు 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి సాహు చేతిలో ఓడారు. బీజేపీ ఈసారి సీఎం నవీన్ మాజీ అనుచరుడు ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహికి టికెటిచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రష్మి రంజన్ పటా్నయక్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.కలహండి... కమలానికి ఎదురుగాలి! బీజేపీకి తొలి నుంచీ గట్టి పట్టున్న స్థానం. కానీ 2009లో కాంగ్రెస్, 2014లో బీజేడీ గెలిచాయి. 2019లో మళ్లీ బీజేపీ నెగ్గింది. ఈసారి సిట్టింగ్ ఎంపీ బసంత కుమార్ పండాను పక్కనపెట్టి కలహండి రాజ కుటుంబానికి చెందిన మాళవిక కేసరీ దేవ్‌కు టికెటిచి్చంది. స్థానికులు రాణి మాతగా పిలుచుకునే మాళవిక మాజీ ఎంపీ అర్కా కేసరీ దేవ్ భార్య. అర్కా తండ్రి విక్రమ్ కేసరీ దేవ్ ఇక్కడ మూడుసార్లు బీజేపీ తరఫున గెలవడం విశేషం. ఆయన మరణానంతరం అర్కా ఇక్కడి నుంచే బీజేడీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2019లో బీజేడీ టికెట్ నిరాకరించడంతో పారీ్టకి గుడ్‌బై చెప్పారు. 2023లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి ద్రౌపది మఝి ఎస్టీ నేత. గిరిజనుల్లో బాగా పట్టుంది. నియోజకవర్గంలో 4 లక్షల ఎస్టీ ఓట్లుండటం ఆమెకు కలిసొచ్చే అంశం. గౌడ సామాజిక వర్గానికి చెందిన లంబూధర్ నియాల్‌ను బీజేడీ బరిలోకి దించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 26 వేల ఓట్ల మెజారిటీయే వచి్చంది. ఈసారి కూడా త్రిముఖ పోరులో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందంటున్నారు.కోరాపుట్... బీజేడీ, కాంగ్రెస్ మధ్యలో బీజేపీ! కనువిందు చేసే తూర్పు కనుమలు, అబ్బురపరిచే జలపాతాలతో ఒడిశా కశీ్మర్గా పేర్కొందిన కోరాపుట్ ఒకప్పుడు కాంగ్రెస్ దుర్గం. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ అడ్డా. ఇక్కడినుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు ఆయనది! 1999లో సీఎంగా ఉంటూ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసి గద్దె దించిన అపప్రథను గమాంగ్ మూటగట్టుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ చేతిలో ఓటమి చవిచూశారు. 2023లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన గమాంగ్ అనంతరం బీఆర్ఎస్కు జై కొట్టడం విశేషం! 2019లో కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి శంకర్ ఉలాక కేవలం 3,613 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేడీ నుంచి మాజీ ఎంపీ ఝినా హికాక భార్య కౌసల్య పోటీ చేస్తున్నారు. బీజేపీ కలిరామ్ మఝిని బరిలోకి దించింది. నియోజకవర్గంలో మంచి పట్టున్న జయరాం చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతమైంది. పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. దాంతో బీజేపీ చీల్చే ఓట్లు కీలకంగా మారాయి.నవరంగ్‌పూర్... టఫ్ ఫైట్ ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న మరో ఎస్టీ నియోజకవర్గమిది. ఇదీ గతంలో కాంగ్రెస్ కంచుకోటే. ఖగపాటి ప్రధాని రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదిసార్లు గెలిచారు. తర్వాత నెమ్మదిగా బీజేపీ, ఆపై బీజేడీ ఇక్కడ పాగా వేశాయి. 2014లో బీజేడీ నుంచి బలభద్ర మఝి కేవలం 2,042 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించారు. ఆయన 2019లో పార్టీ మారి బీజేపీ తరఫున పోటీ చేశారు. బీజేడీ అభ్యర్థి రమేశ్ చంద్ర మఝి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ మాత్రం సిట్టింగ్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచి్చన మాజీ ఎంపీ ప్రదీప్ కుమార్ మఝికి టికెటివ్వడం విశేషం. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భుజబల్ మఝిని రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంటున్నా బీజేపీకి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈసారి ఇక్కడ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీతో సహా బీజేపీ అగ్ర నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. దాంతో పోటీ త్రిముఖంగా మారి ఉత్కంఠ రేపుతోంది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఒడిశాలో బీజేపీ ఒంటరి పోరు
భువనేశ్వర్: ఒడిశా రాష్ట్రంలో జరగబోయే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే బరిలో దిగుతుందని ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ శుక్రవారం ప్రకటించారు. ‘‘డబుల్ ఇంజన్ ప్రభుత్వాలుంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉరకలెత్తుతుందని ఆశించాం. కానీ బీజేడీ అధికారంలో ఉన్న ఒడిశాలో కేంద్ర పథకాలు చివరి లబ్ధిదారు దాకా చేరడం లేదు’’ అని ఆరోపించారు. రాష్ట్రంలో పొత్తుపై అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ), బీజేపీ మధ్య కొద్దిరోజుల క్రితం చర్చలు జరగడం తెలిసిందే. బీజేడీతో పొత్తుపై బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా త్వరలో ఒక నిర్ణయం తీసుకుంటారని గత వారమే కేంద్ర హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. అంతలో ఇలా ఒంటరిపోరు ప్రకటన వెలువడింది. తాము కూడా అన్ని లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల్లో పోటీకి దిగుతున్నట్లు బీజేడీ శుక్రవారం ప్రకటించింది. 1998–2009 మధ్య రెండు పార్టీలు 11 ఏళ్లు కూటమిగా ఉన్నాయి. మూడుసార్లు లోక్‌సభ, రెండు సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీచేశాయి. -
'ఒంటరిగా వెళ్తున్నాం.. ఒడిశా కూడా మాదే'
సాక్షి, భువనేశ్వర్ : ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన బీజేపీ తిరిగి అదే ఊపును ఒడిశాలో కొనసాగించాలనుకుంటోంది. గతంలో కొన్ని చిన్నపార్టీలతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్లిన బీజేపీ ఇప్పుడు ఏకంగా ఒంటరిగా వెళ్లి ఒడిశా పీఠాన్ని దక్కించుకోవాలని చూస్తోంది. ఇదే విషయాన్ని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా స్పష్టం చేశారు. 'ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ ఎవరితోనూ పొత్తు పెట్టుకోవడం లేదు. ఒంటరిగానే బరిలోకి దిగుతోంది. 2/3వంతు మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొని అధికారంలోకి వస్తుంది' అని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఒడిశాలో 2019లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తాము మొత్తం 147 స్థానాల్లో 120 స్థానాలు గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. అయితే, ఈ ఎన్నికలను బీజేపీ తరుపున ఎవరు ముందుండి నడిపిస్తారనే విషయం త్వరలోనే నిర్ణయిస్తామని తెలిపారు. 'కొంతమంది మాకు 120 సీట్లు రావడం సాధ్యం కాని పని అని అనుకుంటుండొచ్చు. కానీ, అక్కడ అధికారంలో ఉన్నవారిపై ప్రస్తుతం తీవ్ర వ్యతిరేకత ఉంది. బీజేపీ యువ నాయకత్వంతో ముందుకు వెళుతుంది. బీజేపీ అనుకూల పవనాలు దేశమంతా వీస్తున్నాయి. త్వరలోనే ఒడిశాకు వస్తాయి' అని అమిత్ షా చెప్పారు.