ఒడిశాలో బీజేడీ, కాంగ్రెస్, బీజేపీ హోరాహోరి
రాష్ట్రంలో లోక్‌సభతో పాటు అసెంబ్లీకీ ఎన్నికలు
నేడు 4 లోక్‌సభ స్థానాల పరిధిలో పోలింగ్
వాటిలో మూడు ఏపీ సరిహద్దు స్థానాలే
ఒడిశాలో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలో సోమవారం తొలి దశ పోలింగ్ జరగనుంది. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండటంతో పారీ్టలన్నీ హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నాయి.
సోమవారం 4 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు తేలిపోనున్నాయి. వీటిలో మూడు లోక్‌సభ స్థానాలు ఏపీ సరిహద్దు ప్రాంతాలే. అధికార బిజూ జనతాదళ్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి మధ్య ఒడిశాలో త్రిముఖ పోరు జరుగుతోంది.
బీజేడీని గద్దె దింపడంతో పాటు మెజారిటీ లోక్‌సభ స్థానాలు కొల్లగొట్టేందుకు బీజేపీ శ్రమిస్తోంది. కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక రెండు దశాబ్దాలకు పైగా సీఎం కురీ్చలో పాతుకుపోయిన బీజేడీ చీఫ్ నవీన్ పటా్నయక్ రెండు జాతీయ పారీ్టలనూ నిలువరించేందుకు
పోరాడుతున్నారు. పోలింగ్ జరగనున్న 4 లోక్‌సభ స్థానాల్లో పరిస్థితిపై ఫోకస్...
బరంపూర్... జంపింగ్ జపాంగ్!
ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ నియోజకవర్గంలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. బరంపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 1996లో ఇక్కడి నుంచి గెలిచారు. 1999లో కాషాయ జెండా కూడా ఎగిరింది. 2009 నుంచీ బీజేడీ హవాయే సాగుతోంది.
ఇక్కడ బరిలో ఉన్న, గెలిచిన అభ్యర్థులు పారీ్టలు మారిన వారే కావడం విశేషం. 2004 నుంచి 2019 మధ్య చంద్రశేఖర్ సాహు, ఒరియా సినీ నటుడు సిద్ధాంత మహాపాత్ర చెరో రెండుసార్లు గెలిచారు. సాహు 2004లో కాంగ్రెస్ తరఫున గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ అభ్యర్థి మహాపాత్ర చేతిలో ఓడారు. తర్వాత సాహు కాంగ్రెస్‌ను వీడి బీజేడీలో చేరారు! 2019లో ఆ పార్టీ టికెట్‌పై గెలిచారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి వచి్చన భృగు బాక్సిపాత్రకు బీజేడీ టికెటివ్వడం విశేషం. భృగు 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి సాహు చేతిలో ఓడారు. బీజేపీ ఈసారి సీఎం నవీన్ మాజీ అనుచరుడు ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహికి టికెటిచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రష్మి రంజన్ పటా్నయక్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.
కలహండి... కమలానికి ఎదురుగాలి!
బీజేపీకి తొలి నుంచీ గట్టి పట్టున్న స్థానం. కానీ 2009లో కాంగ్రెస్, 2014లో బీజేడీ గెలిచాయి. 2019లో మళ్లీ బీజేపీ నెగ్గింది. ఈసారి సిట్టింగ్ ఎంపీ బసంత కుమార్ పండాను పక్కనపెట్టి కలహండి రాజ కుటుంబానికి చెందిన మాళవిక కేసరీ దేవ్‌కు టికెటిచి్చంది. స్థానికులు రాణి మాతగా పిలుచుకునే మాళవిక మాజీ ఎంపీ అర్కా కేసరీ దేవ్ భార్య. అర్కా తండ్రి విక్రమ్ కేసరీ దేవ్ ఇక్కడ మూడుసార్లు బీజేపీ తరఫున గెలవడం విశేషం. ఆయన మరణానంతరం అర్కా ఇక్కడి నుంచే బీజేడీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2019లో బీజేడీ టికెట్ నిరాకరించడంతో పారీ్టకి గుడ్‌బై చెప్పారు. 2023లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి ద్రౌపది మఝి ఎస్టీ నేత. గిరిజనుల్లో బాగా పట్టుంది. నియోజకవర్గంలో 4 లక్షల ఎస్టీ ఓట్లుండటం ఆమెకు కలిసొచ్చే అంశం. గౌడ సామాజిక వర్గానికి చెందిన లంబూధర్ నియాల్‌ను బీజేడీ బరిలోకి దించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 26 వేల ఓట్ల మెజారిటీయే వచి్చంది. ఈసారి కూడా త్రిముఖ పోరులో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందంటున్నారు.
కోరాపుట్...
బీజేడీ, కాంగ్రెస్ మధ్యలో బీజేపీ! కనువిందు చేసే తూర్పు కనుమలు, అబ్బురపరిచే జలపాతాలతో ఒడిశా కశీ్మర్‌గా పేర్కొందిన కోరాపుట్ ఒకప్పుడు కాంగ్రెస్ దుర్గం. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ అడ్డా. ఇక్కడినుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు ఆయనది! 1999లో సీఎంగా ఉంటూ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసి గద్దె దించిన అపప్రథను గమాంగ్ మూటగట్టుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ చేతిలో ఓటమి చవిచూశారు. 2023లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన గమాంగ్ అనంతరం బీఆర్‌ఎస్‌కు జై కొట్టడం విశేషం! 2019లో కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి శంకర్ ఉలాక కేవలం 3,613 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేడీ నుంచి మాజీ ఎంపీ ఝినా హికాక భార్య కౌసల్య పోటీ చేస్తున్నారు. బీజేపీ కలిరామ్ మఝిని బరిలోకి దించింది. నియోజకవర్గంలో మంచి పట్టున్న జయరాం చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతమైంది. పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. దాంతో బీజేపీ చీల్చే ఓట్లు కీలకంగా మారాయి.
నవరంగ్‌పూర్... టఫ్ ఫైట్
ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న మరో ఎస్టీ నియోజకవర్గమిది. ఇదీ గతంలో కాంగ్రెస్ కంచుకోటే. ఖగపాటి ప్రధాని రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదిసార్లు గెలిచారు. తర్వాత నెమ్మదిగా బీజేపీ, ఆపై బీజేడీ ఇక్కడ పాగా వేశాయి. 2014లో బీజేడీ నుంచి బలభద్ర మఝి కేవలం 2,042 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించారు. ఆయన 2019లో పార్టీ మారి బీజేపీ తరఫున పోటీ చేశారు. బీజేడీ అభ్యర్థి రమేశ్ చంద్ర మఝి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ మాత్రం సిట్టింగ్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి
వచి్చన మాజీ ఎంపీ ప్రదీప్ కుమార్ మఝికి టికెటివ్వడం విశేషం. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భుజబల్ మఝిని రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంటున్నా బీజేపీకి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈసారి ఇక్కడ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీతో సహా బీజేపీ అగ్ర నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. దాంతో పోటీ త్రిముఖంగా మారి ఉత్కంఠ రేపుతోంది!
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment