border states
-
Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
ఒడిశాలో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలో సోమవారం తొలి దశ పోలింగ్ జరగనుంది. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండటంతో పారీ్టలన్నీ హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నాయి. సోమవారం 4 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు తేలిపోనున్నాయి. వీటిలో మూడు లోక్‌సభ స్థానాలు ఏపీ సరిహద్దు ప్రాంతాలే. అధికార బిజూ జనతాదళ్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి మధ్య ఒడిశాలో త్రిముఖ పోరు జరుగుతోంది. బీజేడీని గద్దె దింపడంతో పాటు మెజారిటీ లోక్‌సభ స్థానాలు కొల్లగొట్టేందుకు బీజేపీ శ్రమిస్తోంది. కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక రెండు దశాబ్దాలకు పైగా సీఎం కురీ్చలో పాతుకుపోయిన బీజేడీ చీఫ్ నవీన్ పటా్నయక్ రెండు జాతీయ పారీ్టలనూ నిలువరించేందుకు పోరాడుతున్నారు. పోలింగ్ జరగనున్న 4 లోక్‌సభ స్థానాల్లో పరిస్థితిపై ఫోకస్... బరంపూర్... జంపింగ్ జపాంగ్! ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ నియోజకవర్గంలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. బరంపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 1996లో ఇక్కడి నుంచి గెలిచారు. 1999లో కాషాయ జెండా కూడా ఎగిరింది. 2009 నుంచీ బీజేడీ హవాయే సాగుతోంది. ఇక్కడ బరిలో ఉన్న, గెలిచిన అభ్యర్థులు పారీ్టలు మారిన వారే కావడం విశేషం. 2004 నుంచి 2019 మధ్య చంద్రశేఖర్ సాహు, ఒరియా సినీ నటుడు సిద్ధాంత మహాపాత్ర చెరో రెండుసార్లు గెలిచారు. సాహు 2004లో కాంగ్రెస్ తరఫున గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ అభ్యర్థి మహాపాత్ర చేతిలో ఓడారు. తర్వాత సాహు కాంగ్రెస్‌ను వీడి బీజేడీలో చేరారు! 2019లో ఆ పార్టీ టికెట్‌పై గెలిచారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి వచి్చన భృగు బాక్సిపాత్రకు బీజేడీ టికెటివ్వడం విశేషం. భృగు 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి సాహు చేతిలో ఓడారు. బీజేపీ ఈసారి సీఎం నవీన్ మాజీ అనుచరుడు ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహికి టికెటిచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రష్మి రంజన్ పటా్నయక్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.కలహండి... కమలానికి ఎదురుగాలి! బీజేపీకి తొలి నుంచీ గట్టి పట్టున్న స్థానం. కానీ 2009లో కాంగ్రెస్, 2014లో బీజేడీ గెలిచాయి. 2019లో మళ్లీ బీజేపీ నెగ్గింది. ఈసారి సిట్టింగ్ ఎంపీ బసంత కుమార్ పండాను పక్కనపెట్టి కలహండి రాజ కుటుంబానికి చెందిన మాళవిక కేసరీ దేవ్‌కు టికెటిచి్చంది. స్థానికులు రాణి మాతగా పిలుచుకునే మాళవిక మాజీ ఎంపీ అర్కా కేసరీ దేవ్ భార్య. అర్కా తండ్రి విక్రమ్ కేసరీ దేవ్ ఇక్కడ మూడుసార్లు బీజేపీ తరఫున గెలవడం విశేషం. ఆయన మరణానంతరం అర్కా ఇక్కడి నుంచే బీజేడీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2019లో బీజేడీ టికెట్ నిరాకరించడంతో పారీ్టకి గుడ్‌బై చెప్పారు. 2023లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి ద్రౌపది మఝి ఎస్టీ నేత. గిరిజనుల్లో బాగా పట్టుంది. నియోజకవర్గంలో 4 లక్షల ఎస్టీ ఓట్లుండటం ఆమెకు కలిసొచ్చే అంశం. గౌడ సామాజిక వర్గానికి చెందిన లంబూధర్ నియాల్‌ను బీజేడీ బరిలోకి దించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 26 వేల ఓట్ల మెజారిటీయే వచి్చంది. ఈసారి కూడా త్రిముఖ పోరులో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందంటున్నారు.కోరాపుట్... బీజేడీ, కాంగ్రెస్ మధ్యలో బీజేపీ! కనువిందు చేసే తూర్పు కనుమలు, అబ్బురపరిచే జలపాతాలతో ఒడిశా కశీ్మర్గా పేర్కొందిన కోరాపుట్ ఒకప్పుడు కాంగ్రెస్ దుర్గం. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ అడ్డా. ఇక్కడినుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు ఆయనది! 1999లో సీఎంగా ఉంటూ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసి గద్దె దించిన అపప్రథను గమాంగ్ మూటగట్టుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ చేతిలో ఓటమి చవిచూశారు. 2023లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన గమాంగ్ అనంతరం బీఆర్ఎస్కు జై కొట్టడం విశేషం! 2019లో కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి శంకర్ ఉలాక కేవలం 3,613 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేడీ నుంచి మాజీ ఎంపీ ఝినా హికాక భార్య కౌసల్య పోటీ చేస్తున్నారు. బీజేపీ కలిరామ్ మఝిని బరిలోకి దించింది. నియోజకవర్గంలో మంచి పట్టున్న జయరాం చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతమైంది. పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. దాంతో బీజేపీ చీల్చే ఓట్లు కీలకంగా మారాయి.నవరంగ్‌పూర్... టఫ్ ఫైట్ ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న మరో ఎస్టీ నియోజకవర్గమిది. ఇదీ గతంలో కాంగ్రెస్ కంచుకోటే. ఖగపాటి ప్రధాని రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదిసార్లు గెలిచారు. తర్వాత నెమ్మదిగా బీజేపీ, ఆపై బీజేడీ ఇక్కడ పాగా వేశాయి. 2014లో బీజేడీ నుంచి బలభద్ర మఝి కేవలం 2,042 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించారు. ఆయన 2019లో పార్టీ మారి బీజేపీ తరఫున పోటీ చేశారు. బీజేడీ అభ్యర్థి రమేశ్ చంద్ర మఝి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ మాత్రం సిట్టింగ్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచి్చన మాజీ ఎంపీ ప్రదీప్ కుమార్ మఝికి టికెటివ్వడం విశేషం. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భుజబల్ మఝిని రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంటున్నా బీజేపీకి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈసారి ఇక్కడ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీతో సహా బీజేపీ అగ్ర నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. దాంతో పోటీ త్రిముఖంగా మారి ఉత్కంఠ రేపుతోంది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
మొదలైన మైలేర్ల సందడి.. మొదటి బహుమతిగా లారీలు, కార్లు
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని పలమనేరు, కుప్పం ప్రాంతాలతోపాటు పొరుగునే ఉన్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో మైలేర్ల (ఎద్దుల పరుగుపందేల) సందడి మొదలైంది. సంక్రాంతంటే ఈ మూడు రాష్ట్రాల సరిహద్దు ప్రజలకు గుర్తొచ్చేది మైలేర్లే. కనుమ పండుగ నుంచి ఏప్రిల్ వరకు మైలేర్లు జరుగుతాయి. ఈప్రాంతంలో జరిగే మైలేరు పండుగల్లో విజేతలకు మొదటి బహుమతిగా రూ.50 వేల నుంచి లక్ష దాకా ఉండేది. అదే తమిళనాడులో అయితే లారీలు, కార్లు మొదటి బహుమతిగా అందజేస్తున్నారు. మైలేరు అనే తమిళ పదానికి ఎద్దుల పరుగుపందెం అని అర్థం. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న ఈ ప్రాంతంలో మైలేర్లు నిర్వహించడం ఆనవాయితీ. దశాబ్దాలుగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. పలువురు తమ ఎడ్లను ఈ పందేలకు సిద్ధం చేస్తున్నారు. ఈ పోటీలో పాల్గొనే ఎద్దును సంరక్షిస్తున్న రైతును గౌరవంగా చూస్తారు. ఇక ఈ పోటీలో తమ గ్రామం ఎద్దు గెలిచిందంటే.. ఆ వూరి వారి ఉత్సాహాన్ని వర్ణించలేం. గెలిచిన ఎద్దుకు గ్రామంలో మెరవణి (ఊరేగింపు) ఉంటుంది. పండగెద్దులా మజాకా పండుగ నెల మొదలైనప్పటి నుంచి ఎద్దుకు మంచి మేత పెడతారు. వాటి కొమ్ములను జువ్వుతారు. ఎద్దు కొమ్ములు ఎంత బాగుంటే అంత క్రేజ్. ఇలా సిద్ధం చేసిన ఎడ్లను బాగా అలంకరించి పరుగుపందేలకు తీసుకెళతారు. కొమ్ములకు రంగులు వేసి ప్రభలతో అలంకరించి బెలూన్లు కడతారు. పోటీల్లో ఎద్దుపై యువకులు దెబ్బవేసేందుకు ప్రయత్నిస్తారు కాబట్టి దానికి రక్షణగా బ్లేడులు కట్టిన పరదాలను అమరుస్తారు. కాళ్లకు గజ్జలు కట్టి, గిట్టలకు పసుపు రాసి పూజ చేస్తారు. ఈ ప్రాంతంలో 500 వరకు ఎడ్లను ఈ పందేలకు సిద్ధం చేస్తున్నారు. పలమనేరు ప్రాంతంలో నిర్వహించే మైలేరు (ఫైల్) పందెం ఎద్దు ధర రూ. 2 లక్షల నుంచి రూ.5 లక్షలు పోటీలు జరిగేచోట కిక్కిరిసిన జనం మధ్య అల్లిని (నిర్ణీత ప్రదేశాన్ని) ముందుగా ఎద్దుకు చూపెడతారు. అనంతరం ఆ ఎద్దును మూడుసార్లు పరిగెత్తిస్తారు. ఈ మూడుసార్లలో సరాసరి తక్కువ సెకన్లలో గమ్యం చేరిన ఎద్దు విజేతగా నిలుస్తుంది. ఒక్కో మైలేరులో 500 నుంచి వెయ్యి వరకు ఎద్దులు పాల్గొంటాయి. ఒక్కో ఎద్దుకు ప్రవేశ రుసుము రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు ఉంది. మైలేరులో గెలుపొందిన ఎద్దు ధర అమాంతం పెరుగుతుంది. వీటిని లక్షలు పెట్టి కొనేందుకు పలువురు ముందుకొస్తారు. పలమనేరు ప్రాంతంలో మైలేరు విజేత ధర రూ.2 లక్షల నుంచి రూ.ఐదు లక్షల వరకు ఉంది. మైలేర్లకు పేరొందిన ఊళ్లు.. ఈ ప్రాంతంలో మైలేరు పండుగను గొప్పగా జరుపుకొనే ఊళ్లు చాలా ఉన్నాయి. బైరెడ్డిపల్లె, బంగారుపాళ్యం, మండీపేట కోటూరు, చెత్తపెంట, కాబ్బల్లి, కెంచనబల్ల, రామకుప్పం, మిట్టూరు, శాంతిపురం, కెనమాకులపల్లె, మల్లానూరు, నాయినూరు, గొల్లచీమనపల్లె తదితర గ్రామాల్లో మైలేర్లు నిర్వహిస్తారు. సరిహద్దులోని తమిళనాడులో బొరుగూర్, పర్చూరు (ఇక్కడ మొదటి బహుమతి లారీ, బుల్లెట్) గుడియాత్తం, ఆంబూరు, నాట్రాంపల్లె, పేర్నంబట్, పల్లికొండ, వేలూరు, క్రిష్ణగిరి, సేలం, ధర్మపురి తదితర ప్రాంతాల్లో నిర్వహిస్తారు. కర్ణాటకలోని దూలపల్లెలో ఈ పోటీ పెద్ద ఎత్తున జరుగుతుంది. దూలపల్లెలో పోటీలను తిలకించేందుకు ఆ రాష్ట్ర మంత్రులు కూడా హాజరవుతుంటారు. -
అడ్డదారిలో అక్రమ కిక్కు..!
ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో సరిహద్దు ప్రాంతాల నుంచి పండ్లు, పాలు, కూరగాయల మాటున పొరుగు రాష్ట్రాల మద్యాన్ని అడ్డదారుల్లో అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు దాడులు చేసి, కేసులు నమోదు చేస్తున్నా ఈ దందా ఆగడం లేదు. చదవండి: తిరుమల లడ్డూల కోసం పర్యావరణహిత సంచి.. కర్నూలు: జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో ఏడు అంతర్రాష్ట్ర, పది జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులున్నాయి. వీటిలో సెబ్ అధికారులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినప్పటికీ పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలోకి భారీగా మద్యం తరలివస్తోంది. పోలీసులు నాలుగు కేసులు పట్టుకుంటే 40 కేసుల మద్యాన్ని జిల్లాకు తీసుకొస్తున్నారు. కొందరు ఇదే వృత్తిగా మార్చుకుని పోలీసులకు సవాల్ విసురుతున్నారు. కర్ణాటక, తెలంగాణల రాష్ట్రాల నుంచి జిల్లాలోకి వచ్చేందుకు పలు అడ్డదారులున్నాయి. నిత్యం వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై, కాలినడకన నెత్తిన పెట్టుకుని పొరుగు మద్యాన్ని జిల్లాలోకి తీసుకొస్తున్నారు. సెబ్ అధికారులు ప్రధాన రోడ్లపైనే దృష్టి సారిస్తుండటంతో అడ్డదారుల్లో అక్రమదందా సాగిస్తున్నారు. గతంలో మద్యం దుకాణాలు నిర్వహించిన వారు తమ అనుచరుల ద్వారా ఈ దందాను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కర్నూలు సమీపంలోని పంచలింగాల, ఈ. తాండ్రపాడు, తిమ్మనదొడ్డి, చిన్న దన్వాడ, కేశవరం, రాజోలి నుంచి తెలంగాణ మద్యం కర్నూలుకు వస్తోంది. అలాగే చిన్న మంచాల, పుల్లాపురం, గుండ్రేవుల, చెట్నేపల్లి నుంచి కర్ణాటక మద్యం తరలుతోంది. మహిళలు, యువకుల ద్వారా.. విడతల వారీగా మద్య నిషేధం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలు పెంచింది. అలాగే దుకాణాలను సైతం తగ్గించింది. పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు తక్కువగా ఉండడంతో జిల్లాలోకి అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. తక్కువ సమయంలో అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. పోలీసులకు అనుమానం రాకుండా ఉండేందుకు మద్యం అక్రమ రవాణాలో మహిళలను సైతం ఉపయోగిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి 8 నెలల వ్యవధిలో జిల్లాలో 22 మంది మహిళలు మద్యం రవాణా చేస్తూ పట్టుబడ్డారు. అక్రమ మద్యం వ్యాపారులు నిరుద్యోగ యువకులకు సైతం వల వేస్తున్నారు. వారికి ద్విచక్ర వాహనాలిచ్చి మద్యం తీసుకొస్తే విడతకు రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు ముట్టజెబుతున్నారు. కడప రిమ్స్ కళాశాలలో ఎంబీబీఎస్ చదువుతున్న ఇద్దరు, డిగ్రీ చదువుతున్న మరొకరు, అనంతపురం జిల్లా నంబులపూలకుంట మండలానికి చెందిన ఎంబీఏ విద్యార్థి డబ్బు కోసం ఆశపడి మద్యం రవాణా చేస్తూ తనిఖీల్లో దొరికిపోయారు. ఒప్పంద కూలీల వ్యవహారం వీరి ద్వారా బయటపడటంతో తనిఖీ అధికారులే విస్తుపోయారు. ఇలా పట్టుబడిన వారిలో జిల్లాకు చెందిన విద్యార్థులతో పాటు తెలంగాణకు చెందిన వారు కూడా ఉన్నారు. ఎనిమిది నెలల వ్యవధిలోనే 56 మంది విద్యార్థులు, వందల సంఖ్యలో యువకులు పొరుగు మద్యం రవాణా చేస్తూ తనిఖీల్లో పట్టుబడ్డారు. ఈ నెల 11వ తేదీన మిరపకాయల మాటున మినీలారీలో అక్రమంగా తరలిస్తున్న 90 బాక్సుల కర్ణాటక మద్యాన్ని కోడుమూరులోని పత్తికొండ రోడ్డులో సెబ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 12వ తేదీన కర్నూలు ముజఫర్ నగర్‌కు చెందిన షేక్ హుస్సేన్ తన కారులో 10 కాటన్ బాక్సుల్లో 360 తెలంగాణ మద్యం బాటిళ్లు తీసుకొస్తుండగా తనిఖీ చేసి సీజ్ చేశారు. సెబ్ ఏర్పడినప్పటి నుంచి నమోదైన కేసుల మద్యం అక్రమ రవాణా నమోదైన కేసులు 6,529 పట్టుబడిన మద్యం(లీటర్లలో) 1,39,686 పట్టుబడిన బీర్లు (లీటర్లలో) 1,098.44 అరెస్ట్ అయిన వారి సంఖ్య 9,962 సీజ్ చేసిన వాహనాలు 3,775 పీడీ యాక్టు అమలు చేస్తాం మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. రవాణాదారులతో పాటు సహకరించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. అవసరమైతే పీడీ చట్టం ప్రయోగించేందుకు వెనుకాడం. విద్యార్థులు, ఉద్యోగులు ఇలాంటి కేసుల్లో పట్టుబడితే భవిష్యత్తు అంధకారం అవుతుంది. అసాంఘిక కార్యకలాపాలపై 7993822444 వాట్సాప్ నంబర్‌కు సమాచారం ఇవ్వండి. – తుహిన్ సిన్హా, సెబ్ జేడీ చదవండి: నేటి నుంచి ట్రిపుల్ ఐటీల్లో తరగతులు -
సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు.. ఉద్రిక్తం
సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో భారత వైమానిక దళం మెరుపు దాడులు జరిపిన నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతిదాడికి దిగే అవకాశం ఉన్నందున భారత నిఘా సంస్థలు దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్తాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. దీంతో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో సైన్యం భారీగా మొహరించింది. పాక్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యాధికారి ఆదేశాలను జారీచేశారు. ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎలాంటి దాడులు సంభవిస్తాయోనన్న భయం సరిహద్దు గ్రామాల్లోని ప్రజల్లో ఏర్పడింది. మరోవైపు తీర ప్రాంతాలను సైతం అప్రమత్తం చేశారు. నేవీ, కోస్ట్‌గార్డు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ సూచించింది. భారత దక్షిణ ప్రాంతాల్లో నౌకాదళం అలర్టయ్యింది. భారత వైమానిక దాడులపై పాకిస్తాన్లో కలవరం మొదలైంది. సరిహద్దులో సున్నితమైన ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్, గుజరాత్, రాజస్తాన్, కశ్మీర్, ఎల్ఓసీ ప్రాంతాల్లో సైన్యం భారీగా మొహరించింది. ఆయా రాష్ట్రాల సీఎంలతో, డీజీపీలతో ఐబీ చర్చలు జరిపి.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. సరిహద్దు వెంట ఎలాంటి చొరబాట్లు చోటుచేసుకుండా నిఘా సంస్థలు అలర్టయ్యాయి. -
ఆ 9 రాష్ట్రాలు.. రూ. 167 కోట్లు!
న్యూఢిల్లీ: దేశ రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడంలో భాగంగా అంతర్జాతీయ సరిహద్దులు గల తొమ్మిది రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం రూ. 167 కోట్లను విడుదలచేసింది. అంతర్జాతీయ సరిహద్దులు కలిగిన పంజాబ్, రాజస్తాన్ రాష్ట్రలు పాకిస్తాన్‌తో సరిహద్దును పంచుకుంటున్నాయి. అలాగే పశ్చిమ బెంగాల్, అస్సోం రాష్ట్రాలు బంగ్లాదేశ్‌తో సరిహద్దు కలిగి ఉన్నాయి. వాటిని బలోపేతం చేసేందుకు అధిక నిధులు విడుదల చేస్తున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు. బార్డర్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రామ్( బీఏడీపీ)లో భాగంగా ఈ నిధులను విడుదలచేసినట్టు తెలిపారు. మేఘాలయా, పంజాబ్, రాజాస్థాన్, బిహార్, సిక్కిం, త్రిపుర, అస్సోం, హిమాచల్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ఈ నిధులను ఖర్చుచేయనున్నారు. అంతర్జాతీయ సరిహద్దుకు 10 కి.మీ పరిధిలో ఉన్న 17 రాష్ట్రాలలో బీఏడీపీ పథకం అమలవుతుంది. సరిహద్దుల్లోని వెనుకబడిన గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించడం, క్రీడారంగం అభివృద్ధి, బోర్డర్ టూరిజ్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంటులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను ఖర్చుచేయనుంది. -
సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్
-
సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్
♦ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు ♦ కశ్మీర్, పంజాబ్‌లలో స్కూళ్లకు సెలవులు ♦ వాఘాలో బీటింగ్ రిట్రీట్ రద్దు న్యూఢిల్లీ/జమ్మూ:‘సర్జికల్ స్ట్రైక్స్’ నేపథ్యంలో భారత్ సరిహద్దు రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రత కట్టుదిట్టం చేసింది. ప్రతిదాడి జరిగే అవకాశం ఉందని భావించిన అధికారులు.. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించి భద్రత పెంచారు. పాక్ సరిహద్దులోని జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో అప్రమత్తంగా ఉండాలని బీసీఎఫ్ అధికారులు ఆదేశించారు. పౌరుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అట్టారి- వాఘా సరిహద్దులో జరిగే రిట్రీట్ను బీఎస్ఎఫ్ రద్దు చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎక్కువ సంఖ్యలో సిబ్బంది అవసరముందని సరిహద్దు రక్షణ బలగాలు కేంద్రాన్ని కోరాయి. అంతేకాకుండా జమ్మూకశ్మీర్‌లోని ఎల్ఓసీ వద్ద భద్రతా సిబ్బందిని పెంచాలని కేంద్రాన్ని కోరింది. సరిహద్దు గ్రామాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు త రలిపోవాలని కేంద్రం ఆదేశించింది. ఆ రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో 10 కిలో మీటర్ల మేర ఉన్న పాఠశాలలకు తదుపరి ఉత్తర్వులు వచ్చేంతవరకూ సెలవులు ప్రకటించారు. ఆర్ఎస్ పురా వంటి పలు ప్రాంతాల్లోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తుండటం ఇప్పటికే ప్రారంభమైందని అధికారులు తెలిపారు. భారత దళాలు గుజరాత్‌లోని నౌషారీ బెల్ట్ ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. ఇదే ప్రక్రియ పంజాబ్‌లోని ఆరు సరిహద్దు జిల్లాల్లోనూ కొనసాగుతోంది.