సాక్షి, న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లో భారత వైమానిక దళం మెరుపు దాడులు జరిపిన నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతిదాడికి దిగే అవకాశం ఉన్నందున భారత నిఘా సంస్థలు దేశ వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించాయి. ముఖ్యంగా పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన రాజస్తాన్, గుజరాత్, పంజాబ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల్లో ఉద్రికత్త పరిస్థితి నెలకొంది. దీంతో నాలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో సైన్యం భారీగా మొహరించింది. పాక్ నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురైనా తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని సైన్యాధికారి ఆదేశాలను జారీచేశారు. ముఖ్యంగా సరిహద్దుల్లోని గ్రామాల్లో భయానక వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఎలాంటి దాడులు సంభవిస్తాయోనన్న భయం సరిహద్దు గ్రామాల్లోని ప్రజల్లో ఏర్పడింది.
మరోవైపు తీర ప్రాంతాలను సైతం అప్రమత్తం చేశారు. నేవీ, కోస్ట్‌గార్డు సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని రక్షణ శాఖ సూచించింది. భారత దక్షిణ ప్రాంతాల్లో నౌకాదళం అలర్టయ్యింది. భారత వైమానిక దాడులపై పాకిస్తాన్‌లో కలవరం మొదలైంది. సరిహద్దులో సున్నితమైన ప్రాంతాలను టార్గెట్‌గా చేసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పంజాబ్, గుజరాత్, రాజస్తాన్, కశ్మీర్, ఎల్‌ఓసీ ప్రాంతాల్లో సైన్యం భారీగా మొహరించింది. ఆయా రాష్ట్రాల సీఎంలతో, డీజీపీలతో ఐబీ చర్చలు జరిపి.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీచేసింది. సరిహద్దు వెంట ఎలాంటి చొరబాట్లు చోటుచేసుకుండా నిఘా సంస్థలు అలర్టయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment