fourth phase
-
Lok Sabha Election 2024: సరిహద్దు సమరం
ఒడిశాలో ఎన్నికల పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగో విడతలో భాగంగా రాష్ట్రంలో సోమవారం తొలి దశ పోలింగ్ జరగనుంది. లోక్‌సభతో పాటు ఒడిశా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతుండటంతో పారీ్టలన్నీ హోరాహోరీ తలపడుతున్నాయి. రాష్ట్రంలో 21 లోక్‌సభ, 147 అసెంబ్లీ సీట్లున్నాయి. గత ఎన్నికల్లో బీజేడీ 12, బీజేపీ 8 లోక్‌సభ సీట్లు గెలుచుకున్నాయి. సోమవారం 4 లోక్‌సభ స్థానాలు, వాటి పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో అభ్యర్థుల జాతకాలు తేలిపోనున్నాయి. వీటిలో మూడు లోక్‌సభ స్థానాలు ఏపీ సరిహద్దు ప్రాంతాలే. అధికార బిజూ జనతాదళ్, ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి మధ్య ఒడిశాలో త్రిముఖ పోరు జరుగుతోంది. బీజేడీని గద్దె దింపడంతో పాటు మెజారిటీ లోక్‌సభ స్థానాలు కొల్లగొట్టేందుకు బీజేపీ శ్రమిస్తోంది. కాంగ్రెస్ కూడా పూర్వ వైభవం కోసం సర్వశక్తులూ ఒడ్డుతోంది. ఇక రెండు దశాబ్దాలకు పైగా సీఎం కురీ్చలో పాతుకుపోయిన బీజేడీ చీఫ్ నవీన్ పటా్నయక్ రెండు జాతీయ పారీ్టలనూ నిలువరించేందుకు పోరాడుతున్నారు. పోలింగ్ జరగనున్న 4 లోక్‌సభ స్థానాల్లో పరిస్థితిపై ఫోకస్... బరంపూర్... జంపింగ్ జపాంగ్! ఏపీతో సరిహద్దులు పంచుకుంటున్న ఈ నియోజకవర్గంలో తెలుగువారు ఎక్కువగా ఉంటారు. బరంపూర్ ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోట. దివంగత ప్రధాని పీవీ నరసింహారావు 1996లో ఇక్కడి నుంచి గెలిచారు. 1999లో కాషాయ జెండా కూడా ఎగిరింది. 2009 నుంచీ బీజేడీ హవాయే సాగుతోంది. ఇక్కడ బరిలో ఉన్న, గెలిచిన అభ్యర్థులు పారీ్టలు మారిన వారే కావడం విశేషం. 2004 నుంచి 2019 మధ్య చంద్రశేఖర్ సాహు, ఒరియా సినీ నటుడు సిద్ధాంత మహాపాత్ర చెరో రెండుసార్లు గెలిచారు. సాహు 2004లో కాంగ్రెస్ తరఫున గెలిచి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ అభ్యర్థి మహాపాత్ర చేతిలో ఓడారు. తర్వాత సాహు కాంగ్రెస్‌ను వీడి బీజేడీలో చేరారు! 2019లో ఆ పార్టీ టికెట్‌పై గెలిచారు. ఈసారి మాత్రం బీజేపీ నుంచి వచి్చన భృగు బాక్సిపాత్రకు బీజేడీ టికెటివ్వడం విశేషం. భృగు 2019లో బీజేపీ తరఫున పోటీ చేసి సాహు చేతిలో ఓడారు. బీజేపీ ఈసారి సీఎం నవీన్ మాజీ అనుచరుడు ప్రదీప్‌కుమార్ పాణిగ్రాహికి టికెటిచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి రష్మి రంజన్ పటా్నయక్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు.కలహండి... కమలానికి ఎదురుగాలి! బీజేపీకి తొలి నుంచీ గట్టి పట్టున్న స్థానం. కానీ 2009లో కాంగ్రెస్, 2014లో బీజేడీ గెలిచాయి. 2019లో మళ్లీ బీజేపీ నెగ్గింది. ఈసారి సిట్టింగ్ ఎంపీ బసంత కుమార్ పండాను పక్కనపెట్టి కలహండి రాజ కుటుంబానికి చెందిన మాళవిక కేసరీ దేవ్‌కు టికెటిచి్చంది. స్థానికులు రాణి మాతగా పిలుచుకునే మాళవిక మాజీ ఎంపీ అర్కా కేసరీ దేవ్ భార్య. అర్కా తండ్రి విక్రమ్ కేసరీ దేవ్ ఇక్కడ మూడుసార్లు బీజేపీ తరఫున గెలవడం విశేషం. ఆయన మరణానంతరం అర్కా ఇక్కడి నుంచే బీజేడీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. కానీ 2019లో బీజేడీ టికెట్ నిరాకరించడంతో పారీ్టకి గుడ్‌బై చెప్పారు. 2023లో బీజేపీలో చేరారు. కాంగ్రెస్ అభ్యర్థి ద్రౌపది మఝి ఎస్టీ నేత. గిరిజనుల్లో బాగా పట్టుంది. నియోజకవర్గంలో 4 లక్షల ఎస్టీ ఓట్లుండటం ఆమెకు కలిసొచ్చే అంశం. గౌడ సామాజిక వర్గానికి చెందిన లంబూధర్ నియాల్‌ను బీజేడీ బరిలోకి దించింది. గత ఎన్నికల్లో బీజేపీకి 26 వేల ఓట్ల మెజారిటీయే వచి్చంది. ఈసారి కూడా త్రిముఖ పోరులో బీజేపీకి ఎదురుగాలి వీస్తోందంటున్నారు.కోరాపుట్... బీజేడీ, కాంగ్రెస్ మధ్యలో బీజేపీ! కనువిందు చేసే తూర్పు కనుమలు, అబ్బురపరిచే జలపాతాలతో ఒడిశా కశీ్మర్గా పేర్కొందిన కోరాపుట్ ఒకప్పుడు కాంగ్రెస్ దుర్గం. మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ అడ్డా. ఇక్కడినుంచి తొమ్మిదిసార్లు ఎంపీగా గెలిచిన రికార్డు ఆయనది! 1999లో సీఎంగా ఉంటూ కేంద్రంలో వాజ్‌పేయి ప్రభుత్వం విశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా ఓటేసి గద్దె దించిన అపప్రథను గమాంగ్ మూటగట్టుకున్నారు. 2009, 2014ల్లో బీజేడీ చేతిలో ఓటమి చవిచూశారు. 2023లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన గమాంగ్ అనంతరం బీఆర్ఎస్కు జై కొట్టడం విశేషం! 2019లో కాంగ్రెస్ అభ్యర్థి సప్తగిరి శంకర్ ఉలాక కేవలం 3,613 ఓట్ల మెజారిటీతో గెలిచారు. బీజేడీ నుంచి మాజీ ఎంపీ ఝినా హికాక భార్య కౌసల్య పోటీ చేస్తున్నారు. బీజేపీ కలిరామ్ మఝిని బరిలోకి దించింది. నియోజకవర్గంలో మంచి పట్టున్న జయరాం చేరికతో కాంగ్రెస్ మరింత బలోపేతమైంది. పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంది. దాంతో బీజేపీ చీల్చే ఓట్లు కీలకంగా మారాయి.నవరంగ్‌పూర్... టఫ్ ఫైట్ ఏపీ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఉన్న మరో ఎస్టీ నియోజకవర్గమిది. ఇదీ గతంలో కాంగ్రెస్ కంచుకోటే. ఖగపాటి ప్రధాని రికార్డు స్థాయిలో వరుసగా తొమ్మిదిసార్లు గెలిచారు. తర్వాత నెమ్మదిగా బీజేపీ, ఆపై బీజేడీ ఇక్కడ పాగా వేశాయి. 2014లో బీజేడీ నుంచి బలభద్ర మఝి కేవలం 2,042 ఓట్ల తేడాతో కాంగ్రెస్‌ను ఓడించారు. ఆయన 2019లో పార్టీ మారి బీజేపీ తరఫున పోటీ చేశారు. బీజేడీ అభ్యర్థి రమేశ్ చంద్ర మఝి చేతిలో ఓటమి చవిచూశారు. ఈసారీ బీజేపీ నుంచి మళ్లీ బరిలో ఉన్నారు. బీజేడీ మాత్రం సిట్టింగ్‌ను పక్కన పెట్టి కాంగ్రెస్ నుంచి వచి్చన మాజీ ఎంపీ ప్రదీప్ కుమార్ మఝికి టికెటివ్వడం విశేషం. కాంగ్రెస్ నుంచి సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే భుజబల్ మఝిని రంగంలో ఉన్నారు. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేడీ, కాంగ్రెస్ మధ్యే ఉంటున్నా బీజేపీకి భారీగా ఓట్లు పడుతున్నాయి. ఈసారి ఇక్కడ గెలుపును బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మోదీతో సహా బీజేపీ అగ్ర నేతలు ముమ్మరంగా ప్రచారం చేశారు. దాంతో పోటీ త్రిముఖంగా మారి ఉత్కంఠ రేపుతోంది!– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఆదిత్య –ఎల్1 కక్ష్య దూరం మళ్లీ పెంపు
సూళ్లూరుపేట(తిరుపతి జిల్లా): భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఈనెల 2న ప్రయోగించిన ఆదిత్య –ఎల్1 ఉపగ్రహానికి శుక్రవారం నాలుగో విడత కక్ష్య దూరాన్ని పెంచారు. బెంగళూరులోని ఇస్రో టెలీమెట్రీ ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్(ఇస్ట్రాక్), మారిషస్, అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్టుబ్లెయిర్ గ్రౌండ్‌స్టేషన్ల నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఉపగ్రహంలో అపోజి ఇంధనాన్ని మండించి కక్ష్య దూరాన్ని విజయవంతంగా పెంచారు. మూడో విడతలో 296గీ71,767 కిలోమీటర్ల దీర్ఘవృత్తాకార కక్ష్యలో భూమి చుట్టూ పరిభ్రమిస్తున్న సమయంలో నాలుగో విడుతలో భూమికి దగ్గరగా ఉన్న 296 కిలోమీటర్ల దూరాన్ని 256 కిలోమీటర్లకు తగ్గిస్తూ భూమికి దూరంగా ఉన్న 71,767 దూరాన్ని 1,21,973 కిలోమీటర్లకు పెంచారు. ఈనెల 19న అయిదోసారి కక్ష్యదూరం పెంపుదలలో భాగంగా ఆదిత్య –ఎల్1 ఉపగ్రహాన్ని భూ మధ్యంతర కక్ష్యనుంచి సూర్యుడికి దగ్గరగా లాంగ్రేజియన్ పాయింట్–1 వద్ద çహాలో కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నారు. -
‘అనుమతిస్తే సరి.. లేదంటే కోర్టుకెళ్తాం’
సాక్షి, హైదరాబాద్: ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత పాదయాత్రను అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోంది. పోలీసులు అనుమతిచ్చినా, ఇవ్వకపోయినా యాత్ర కొనసాగించి తీరుతాం. అనుమతిస్తే సరి, లేదంటే కోర్టును ఆశ్రయించి అనుమతి తెచ్చుకుంటాం’అని ఆ పార్టీ నేతలు స్పష్టం చేశారు. ఆ పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి, భండారి శాంతికుమార్, టి.వీరేందర్‌గౌడ్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి తదితరులు సంజయ్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్, రూట్‌మ్యాప్‌ను శనివారం ఇక్కడ విడుదల చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ‘గతంలోనూ యాత్రకు రాతపూర్వక అనుమతి ఇవ్వలేదు. ఇప్పటివరకైతే అనుమతి ఇచ్చినట్లుగానే భావిస్తున్నాం’అని అన్నారు. ఈ నెల 12న(సోమవారం) ఉదయం 10.30 గంటలకు కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని చిత్తారమ్మ ఆలయంలో సంజయ్ పూజలు నిర్వహించి పాదయాత్రగా బయలుదేరనున్నారని తెలిపారు. అక్కడికి సమీపంలోని రాంలీలా మైదానంలో నిర్వహించే ప్రారంభసభకు ముఖ్యఅతిథిగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ పాల్గొంటారని పేర్కొన్నారు. ప్రధానంగా మల్కాజిగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలోని కుత్భుల్లాపూర్, కూకట్పల్లి, సికింద్రాబాద్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, మేడ్చల్, ఉప్పల్‌తోపాటు ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా సాగే ఈ యాత్ర ఈ నెల 22న ఔటర్ రింగ్‌రోడ్డుకు సమీపంలోని పెద్దఅంబర్‌పేట వద్ద బహిరంగసభతో ముగియనుందని తెలిపారు. గ్రేటర్ ప్రజా సమస్యలే ఎజెండాగా.. ఆయా నియోజకవర్గాల్లో అర్ధాంతరంగా నిలిచిపోయిన డబుల్ బెడ్రూం ఇళ్లు, లబ్దిదారులకు అందని రాజీవ్ స్వగృహ ఇళ్లు, ట్రాఫిక్ నియంత్రణను గాలికొదిలేసిన పోలీసుల తీరు, ట్రాఫిక్‌లో ప్రజల నరకయాతన, గతుకుల రోడ్లు, కాలుష్యం, చెరువుల కబ్జా వంటి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని బీజేపీ నేతలు చెప్పారు. కాలనీల్లో దోమలబెడద, మంచినీటి సమస్య, విద్యుత్, ఆర్టీసీ చా ర్జీల పెంపు, పెట్రోల్‌పై వ్యాట్ తగ్గింపు వంటి అంశాలనూ ప్రస్తావిస్తామన్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ నుంచి తెలంగాణకు విముక్తి కల్పిద్దాం: బీజేపీ -
ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా
న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రతి నలుగురిలో ఒకరికి కరోనా సోకి, తగ్గిపోయినట్లు సెరోలాజికల్ సర్వేలో తేలింది. ఈ విషయాన్ని ఢిల్లీ ప్రభుత్వం రాష్ట్ర హైకోర్టుకు తెలియజేసింది. ఈ మేరకు ఒక నివేదిక సమర్పించింది. ఢిల్లీలో నాలుగో దశ సెరోలాజికల్ సర్వేలో భాగంగా తాజాగా 15,000 మందికి పరీక్షలు నిర్వహించారు. వీరిలో ప్రతి నలుగురిలో ఒకరి శరీరంలో యాంటీ బాడీలు(ప్రతి రక్షకాలు) ఉన్నట్లు తేలింది. అంటే వీరంతా కరోనాకు గురై కోలుకున్నవారే. సెప్టెంబర్ మొదటి వారంలో నిర్వహించిన పరీక్షల్లో 25.1 మందిలో, అక్టోబర్ మూడో వారంలో నిర్వహించిన పరీక్షల్లో 25.5 శాతం మందిలో యాంటీ బాడీలు ఉన్నట్లు గుర్తించారు. అంటే ఢిల్లీ జనాభాలో దాదాపు 25 శాతం మంది ఇప్పటికే కరోనా బారినపడినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో 80% బెడ్లు కోవిడ్ బాధితులకే! ఢిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా విస్తరిస్తుండడం పట్ల హైకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజారోగ్యంపై బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చిచెప్పింది. ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగి, కరోనా వ్యాప్తిని నియంత్రించాలని ధర్మాసనం సూచించింది. 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ పడకలను కోవిడ్–19 రోగులకు కేటాయించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ ఢిల్లీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 33 ప్రైవేట్ ఆసుపత్రుల్లో 80 శాతం ఐసీయూ పడకలను కరోనా బాధితులకు రిజర్వ్ చేసేందుకు ప్రభుత్వానికి అనుమతి మంజూరు చేసింది. ఢిల్లీలో బుధవారం ఒక్కరోజే కొత్తగా 8,593 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 85 మంది కోవిడ్ కారణంగా మృతిచెందారు. -
లాక్డౌన్ పొడిగింపుపై మీరేమంటారు?
న్యూఢిల్లీ: ఈనెల 31వ తేదీతో ముగియనున్న దేశవ్యాప్త లాక్‌డౌన్‌ను మరికొద్ది రోజులపాటు పొడిగించాలన్న ప్రతిపాదనపై హోం మంత్రి అమిత్ షా గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. నాలుగో దశ లాక్డౌన్ ఈ నెలాఖరుతో ముగియనున్న విషయం తెలిసిందే. ముఖ్యమంత్రులతో ఫోన్లో మాట్లాడిన అమిత్ షా..ఏఏ రంగాలకు మినహాయింపు అవసరం? ఎలాంటి సమస్యలున్నాయి? వంటి అంశాలపై చర్చించారు. సీఎంలు ఏం చెప్పారనే విషయం వెల్లడి కానప్పటికీ, ఏదో ఒక రూపంలో లాక్డౌన్ పొడిగింపునకే ఎక్కువ మంది మొగ్గు చూపినట్లు సమాచారం. ఆర్థిక కార్యకలాపాలు కొనసాగేందుకు, జన జీవనం సాధారణ స్థాయికి తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కేంద్రం తుది నిర్ణయాన్ని రెండుమూడు రోజుల్లో ప్రకటించే అవకాశాలున్నాయి. -
నాలుగో విడత రేషన్ పంపిణీ ప్రారంభం
సాక్షి, విజయవాడ: లాక్డౌన్ వేళ పేదల ఆకలిని తీర్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో నాలుగో విడత రేషన్ పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమైంది. కార్డుదారులకు మనిషికి 5 కిలోల చొప్పున పీడీఎఫ్ బియ్యం, కేజీ శనగలు అందజేసున్నారు. రాష్ట్రంలోని 28,354 రేషన్ దుకాణాల ద్వారా సరుకుల పంపిణీ జరుగుతోంది. రేషన్ తీసుకునేందుకు దుకాణాల వారీగా టైం స్లాట్ కూపన్లు ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,48,05,879 కుటుంబాలు లబ్ది పొందనున్నాయి. రాష్ట్రంలో 1,47,24,017 కుటుంబాలు బియ్యంకార్డులు కలిగి ఉన్నాయి. కొత్తగా 81,862 పేద కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. కార్డుదారులకు బయోమెట్రిక్ తప్పనిసరి చేశారు. పోర్టబిలిటీ ద్వారా ఎక్కడ వుంటే అక్కడే రేషన్ అందజేస్తున్నారు. రేషన్ షాప్ కౌంటర్ల వద్ద డీలర్లు శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. (ఆ గ్రామస్తులకు ఏ కష్టం రాకూడదు) నేటి నుంచి 27వ తేదీ వరకు సరుకులను పంపిణీ చేయనున్నారు. తెల్లరేషన్ కార్డుదారులకు ఒక్కో కుటుంబసభ్యుని ఐదు కేజీల ఉచిత బియ్యం, అంత్యోదయ అన్నయోజన కార్డుదారులకు 35 కేజీల ఉచిత బియ్యం పంపిణీ చెస్తున్నారు. అన్నపూర్ణ కార్డుదారులకు పదికిలోల ఉచిత బియ్యం అందజేస్తున్నారు. ప్రతీ కార్డుకూ కిలో శనగపప్పు ఉచితంగా ఇస్తున్నారు. వేలిముద్ర తప్పనిసరి కావటంతో రేషన్ షాపుల వద్ద శానిటైజర్లు ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ఆదేశాలతో రేషన్ కార్డు లేని పేదలకు కూడా సరుకులు పంపిణీ చేస్తున్నారు. సబ్సి డీ ధరపై అర కేజీ పంచదార అందజేస్తున్నారు. కృష్ణా జిల్లాలో 12, 59,936 రేషన్ కార్డు దారులు లబ్ది పొందనున్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడే సరుకులు తీసుకొనేలా పోర్టబిలిటీ అవకాశం కల్పించారు. కరోనా కారణంగా కూపన్ల పద్ధతి అమలు చేస్తున్నారు. గ్రామ/వార్డు వలంటీర్ల ద్వారా టైం స్లాట్ కూపన్లను అధికారులు అందజేస్తున్నారు. కూపన్లో సూచించిన తేదీలో నిర్ధేశించిన సమయానికే లబ్ధిదారులు రేషన్‌కి రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. లబ్ధిదారులు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని అధికారులు కోరుతున్నారు. మాస్కులు ధరించి క్యూలైన్లో దూరం పాటించాలని అధికారులు లబ్ధిదారులకు సూచనలు ఇస్తున్నారు. -
నాలుగో విడత ‘మిషన్’కు రెడీ
సాక్షిప్రతినిధి, కరీంనగర్ : మిషన్ కాకతీయ నాలుగోవిడత పనులను చేపట్టేందుకు సిద్ధం కావాలని నీటిపారుదలశాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం సర్వేలు చేసి అధికారులు పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగోవిడత కింద 641 చెరువులు, కుంటల మరమ్మతు, పునరుద్ధరణ పనులకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో అధికారులు నాలుగోవిడత మిషన్ కాకతీయ పనులు ప్రారంభించడంలో నిమగ్నమయ్యారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ కాకతీయ పనులు ఉమ్మడి జిల్లాలో మూడు విడతలుగా సాగాయి. జిల్లాల పునర్విభజనకు ముందు 5,998 చెరువులు, కుంటలు ఉన్నాయి. ఇందులో సిద్దిపేట, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్అర్బన్ జిల్లాలకు వెళ్లినవి మినహాయించగా, కరీంనగర్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో 4,445 మిగిలాయి. ఇందులో నుంచి మూడువిడతల్లో 2171 చెరువుల మరమ్మతు, పునరుద్ధరణ పనులు చేపట్టారు. నాలుగో విడతగా 641 చెరువుల పునరుద్ధరణ, మరమ్మతు పనులకు ప్రభుత్వం ఆమోదం తెలపగా.. ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. వేగం పెంచితేనే లక్ష్యం నెరవేరేది.. అగ్రిమెంట్ సమయంలోనే కాంట్రాక్టర్ల కట్టడి.. 2014లో చెరువులు, కుంటల మరమ్మతు, పునరుద్ధరణ పనులకు శ్రీకారం జరగగా.. అదే ఏడాదిలో అధికారులు సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదించారు. జిల్లాల పునర్విభజన తర్వాత నాలుగు జిల్లాల్లో 4,445 చెరువులు, కుంటలు మిగలగా.. మొదటి, రెండు, మూడు విడతల్లో 2,171 చెరువుల పనులకు టెండర్ల ద్వారా కాంట్రాక్టర్లను ఎంపిక చేశారు. ఈ పనుల కోసం రూ.795.95 కోట్లు అంచనావేశారు. మొదటి విడతలో 643 చెరువులకుగాను 631 పనులు పూర్తయ్యాయి. రెండోవిడతలో 863 చెరువులకు ఆమోదం లభించగా.. 859 చెరువుల పనులు ప్రారంభించారు. ఇందులో 581 చెరువులు పూర్తయ్యాయి. మూడో విడతలో 664 చెరువులకు ఆమోదం లభించగా, 654 చెరువులకు టెండర్లు పిలిచి 649 పనులను మొదలుపెట్టారు. మొత్తం మూడు విడతల్లో 2171 చెరువులకు 1212 చెరువులు పూర్తి కాగా, 959 పనులు వివిధస్థాయిల్లో ఉన్నాయి. ఈ పనులపై అధికారులు కాంట్రాక్టర్లకు రూ.213.95 కోట్లు చెల్లించినట్లు రికార్డులు చెప్తున్నాయి. వివిధ స్థాయిల్లో ఉన్న 959 పనులతోపాటు నాలుగో విడతలో 641 చెరువుల పనులు నిర్ణీత సమయంలో పూర్తి కావాలంటే పర్యవేక్షణ, వేగం పెంచడంతో పాటు అగ్రిమెంట్ సమయంలోనే కాంట్రాక్టర్లను కట్టడి చేయాలని పలువురు సూచిస్తున్నారు. పనులపై ఆదినుంచీ ఆరోపణలే మిషన్ కాకతీయ పథకం ప్రారంభం నుంచి చాలాచోట్ల పనులు జరుగుతున్న తీరుపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. తూము, కాలువలు, అలుగు, కట్ట నిర్మాణాల్లో నాణ్యత లోపించిందన్న ఫిర్యాదులు పలు గ్రామాల నుంచి వచ్చాయి. అధికార పార్టీ నేతలు తమ అనుయాయులకే టెండర్లను కట్టబెట్టడం వల్ల పనులు ఎలా చేసినా వారిపై చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వినిపించాయి. వీటిలో కొన్నింటిపై విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ విభాగం అధికారులు విచారణ కూడా జరిపారు. కరీంనగర్, జగిత్యాల డివిజన్లలో చాలాచోట్ల పనుల్లో నాణ్యత లేదని, నామమాత్రంగానే మట్టితరలింపు చేపట్టి బిల్లులు పొందారని తేలింది. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య సమన్వయంతో ఈ అవినీతి జరిగిందన్న విమర్శలు కూడా వచ్చాయి. చెరువులకు సంబంధించిన తూములు, అలుగుల నిర్మాణంలో నాణ్యత సరిగా ఉండడం లేదు. చెరువు కట్టలు ఎత్తు పెంచడంలో మొరం నింపుతూ పనులు ముగించారన్న ఫిర్యాదులున్నాయి. కొన్నిచోట్ల కాంట్రాక్టర్లు పనులను ఇతరులకు అప్పగించి తప్పించుకున్న సంఘటనలూ ఉన్నాయి. పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వచ్చిన ఆరోపణలపైనా విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అప్పట్లో విచారణ జరిపారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ పథకం సక్సెస్ కోసం అధికారులు అవినీతి, అక్రమాలకు తావు లేకుండా వ్యవహరించాలని పలువురు కోరుతున్నారు. -
78 శాతం పోలింగ్ నమోదు
న్యూఢిల్లీ: పశ్చిమ బెంగాల్లో ఈరోజు జరిగిన నాల్గవ దశ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం పోలింగ్ 78.05 శాతంనమోదైనట్టు డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ సందీప్ సక్సేనా తెలిపారు. 49 నియోజక వర్గాల్లో జరిగిన పోలింగ్ లో 18మందిపై కేసులు నమోదు చేసినట్టు ఆయన తెలిపారు. -
బిహార్‌లో 12 గంటలకు 35.68 శాతం ఓటింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 35.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. ఈ రోజు బిహార్‌లో ఏడు జిల్లాల్లోని 55 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత కారణాల దృష్ట్యా 4 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ నిలిపివేయనున్నారు. మరో 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా 43 నియోజవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. -
ప్రారంభమైన బిహార్ నాలుగో దశ పోలింగ్
పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ఆదివారం ప్రారంభమైంది. పోలింగ్ జరగనున్న ఏడు జిల్లాల్లో ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఉదయం నుంచే ప్రజలు ఓటేసేందుకు బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ముజఫర్‌పూర్, తూర్పు చంపారన్, పశ్చిమ చంపారన్, సీతామర్హి, షియోహర్, గోపాల్‌గంజ్ జిల్లాల్లోని మొత్తం 55 నియోజకవర్గాల్లో వివిధ పార్టీలకు చెందిన 776 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. భద్రత కారణాల దృష్ట్యా 4 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ నిలిపివేయనున్నారు. మరో 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా 43 నియోజవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. మొత్తం 1,46,93,294 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. 14, 139 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. నవంబర్ 5న ఐదో దశ పోలింగ్ జరగనుంది. -
బిహార్‌లో ముగిసిన నాలుగోదశ ప్రచార పర్వం
పాట్నా: బిహార్‌లో నాలుగో దశ ఎన్నికలకు ఆదివారం పోలింగ్ జరగనుంది. దీనికి సంబంధించిన ప్రచార పర్వం శుక్రవారంతో ముగిసింది. నాలుగో దశలో భాగంగా 55 స్థానాల్లో 776 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేపాల్‌తో సరిహద్దు గల జిల్లాలలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. రెండు వారాలుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో మహాకూటమి, ఎన్డీఏ నేతలతో పాటు లెఫ్ట్ పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ర్యాలీలను నిర్వహించాయి. అన్ని పార్టీలు ముఖ్యంగా అభివృద్ధి ఎజెండాగా ప్రచార కార్యక్రమాలను చేపట్టాయి. ఇప్పటివరకు జరిగిన మూడు దశలలో మహిళలు ఆసక్తిగా ఓటింగ్లొ పాల్గొనడమే కాకుండా ఓవరాల్‌గా గతంలో కంటే ఎక్కువ పోలింగ్ శాతం నమోదైంది. 5 వ దశ ఎన్నికల అనంతరం నవంబర్ 8న ప్రకటించే ఫలితాల్లో బిహార్ ప్రజలు ఎవరికి పట్టం కట్టనున్నారోనని దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. -
జమ్మూ కాశ్మీర్లో ముగిసిన నాలుగో విడత పోలింగ్
-
జమ్మూ కశ్మీర్లో ముగిసిన నాలుగో విడత పోలింగ్
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు జమ్మూ కశ్మీర్ సీనియర్ ఎన్నికల కమిషనర్ చెప్పారు. 50 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ ఇతర ప్రముఖులు బరిలో ఉన్నారు.