పట్నా: బిహార్ అసెంబ్లీ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 35.68 శాతం ఓటింగ్ నమోదైనట్టు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.
ఈ రోజు బిహార్లో ఏడు జిల్లాల్లోని 55 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల కమిషన్ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. భద్రత కారణాల దృష్ట్యా 4 నియోజకవర్గాల్లో మధ్యాహ్నం 3 గంటలకే పోలింగ్ ప్రక్రియ నిలిపివేయనున్నారు. మరో 8 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటల వరకు, మిగతా 43 నియోజవర్గాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు.
బిహార్లో 12 గంటలకు 35.68 శాతం ఓటింగ్
Published Sun, Nov 1 2015 1:19 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM
Advertisement
Advertisement