జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్ అసెంబ్లీకి నాలుగో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ ప్రశాంతంగా ముగిసినట్టు జమ్మూ కశ్మీర్ సీనియర్ ఎన్నికల కమిషనర్ చెప్పారు.
50 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్టు తెలిపారు. ఈ రోజు జరిగిన ఎన్నికల్లో జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, మాజీ ముఖ్యమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ ఇతర ప్రముఖులు బరిలో ఉన్నారు.