పొత్తుల సమస్యే లేదు
పొత్తుల సమస్యే లేదు
Published Mon, Dec 26 2016 11:57 AM | Last Updated on Sat, Aug 25 2018 4:30 PM
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్‌బబ్బర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయగల సత్తా తమకుందని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని ఆయన అన్నారు. రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే భారీ మెజారిటీ ఖాయమని ఇంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ యూపీ చీఫ్ మాట్లాడటం గమనార్హం.
ఇక పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని రాజ్‌బబ్బర్ తీవ్రంగా విమర్శించారు. కేవలం కొద్దమంది తన స్నేహితులకు మేలు చేయడానికే ఆయనిలా చేశారని అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడుతోందని, దేశంలో స్వైపింగ్ సామ్రాజ్యం నడుపుతున్న కొద్దిమందికి దీనివల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికీ పెద్దనోట్ల రద్దు వల్ల సమస్యలు ఎదురయ్యాయన్నారు.
Advertisement
Advertisement