up congress chief
-
‘రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్’
లక్నో: భారత్ జోడో యాత్ర చేబడుతున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రశంసలు కురిపించారు ఉత్తర్‌ప్రదేశ్ పార్టీ నూతన అధ్యక్షుడు బ్రిజ్‌లాల్ ఖబ్రీ. రాహుల్ అంటే భారత్.. భారత్ అంటే రాహుల్ అని నినదించారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడటమే లక్ష్యంగా రాహుల్ భారత్ జోడో యాత్ర చేబడుతున్నారని నొక్కి చెప్పారు. యూపీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన క్రమంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు దేవ్ కాంత్ బరూవా పాపులర్ డైలాగ్ ‘ఇండియా అంటే ఇందిరా, ఇందిరా అంటే ఇండియా’ను ఉద్ఘాటించారు. ఈ నినాదాన్ని తరుచుగా ప్రత్యర్థులు ఉపయోగిస్తూ కాంగ్రెస్ పార్టీ, గాంధీలపై విమర్శలు చేస్తుంటారు. ఎన్నికల పరంగా కీలకమైన ఉత్తర్‌ప్రదేశ్‌లో కేవలం ఒకే ఒక్క జిల్లా బులంద్‌షహర్‌లో మాత్రమే రాహుల్ భారత్ జోడో యాత్ర చేపట్టటంపై ప్రశ్నించగా.. వివరణ ఇచ్చారు ఖబ్రీ. ‘భారత్ అంటే ఒక జిల్లా కాదు, ఒక రాష్ట్రం కాదు. రాష్ట్రాల సమహారం. రాహుల్ 13 రాష్ట్రాల్లో యాత్ర చేస్తారు. ఆయనకు పెద్ద లక్ష్యం ఉంది. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అమ్మేసి రాజ్యాంగాన్ని నాశనం చేయాలని చూస్తోంది. 2024 ఎన్నికల్లో యూపీ మొత్తం 80 సీట్లు గెలవాలని కాంగ్రెస్ లక్ష్యంగా పెట్టుకుంది. బరేలీ, అమేఠీల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోతుంది. దేశాన్ని, రాజ్యాంగం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు. రాహుల్ పాదయాత్ర చేస్తే కొందరికి కడుపు మంట ఎందుకు వస్తోంది? లక్షల మంది రాహుల్‌తో కలిసి నడుస్తున్నారు. రాహుల్ అంటే భారత్, భారత్ అంటే రాహుల్ అని చెప్పగలను.’ అని పేర్కొన్నారు ఖబ్రీ. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టటంపై సంతోషం వ్యక్తం చేశారు ఖబ్రీ. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన ప్రణాళిక, వ్యూహాలను క్షేత్రస్థాయి నుంచి తీసుకొస్తామని తెలిపారు. 2024 ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొత్తం స్థానాలను గెలవాలనే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఇదీ చదవండి: కార్పొరేట్లకు కాదు, గుత్తాధిపత్యాలకే వ్యతిరేకం -
రాజ్‌బబ్బర్ స్థానం మార్పు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు రాజ్‌బబ్బర్ ఫతేపూర్‌సిక్రీ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో ఉన్నారు. గతంలో ఆయనకు పార్టీ మొరాదాబాద్ స్థానాన్ని కేటాయించింది. శుక్రవారం ఢిల్లీలో పార్టీ లోక్‌సభ అభ్యర్థుల ఏడవ జాబితా విడుదలచేసింది. ఉత్తరప్రదేశ్‌లో 9 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. రాజ్‌బబ్బర్‌కు మొదట కేటాయించిన మొరాదాబాద్ నుంచి ప్రస్తుతం ఇమ్రాన్ ప్రతాప్‌గర్యిహా పోటీ చేయనున్నారు. రాజ్‌బబ్బర్ 1999, 2004లో ఆగ్రా నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ ఎంపీగా కొనసాగుతున్నారు. పార్టీ వర్గాలు వెల్లడించిన ప్రకారం రాజ్‌బబ్బర్ మొరాదాబాద్ నుంచి పోటీ చేయడానికి ఆసక్తిగా లేరని తెలిసింది. నసీముద్దీన్ సిద్దిఖీ ప్రస్తుతం బిజ్నోర్‌నుంచి పోటీలో దిగుతున్నారు.. ప్రకటించిన పేర్లలో బరేలీ నుంచి ప్రవీణ్ అరోన్ కూడా ఉన్నారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఇదే స్థానంనుంచి విజయం సాధించారు. అలాగే బందా నుంచి బాల్కుమార్ పటేల్ బరిలో ఉన్నారు. దశాబ్దం క్రితం ఎన్కౌంటర్లో చనిపోయిన బందిపోటు శివకుమార్ అలియాస్ దదువాకు పటేల్ సోదరుడు. పటేల్‌కూడా గతంలో సమాజ్‌వాది పార్టీ నుంచి మీర్జాపూర్ నుంచి విజయం సాధించారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
వారణాసి దుర్ఘటనపై రాజకీయ దుమారం
వారణాసి: ప్రఖ్యాత ఆథ్యాత్మిక నగరం వారణాసిలో ఫ్లైఓవర్ కూలిన ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదుచేశారు. అధికారులు, ఉద్యోగుల తొలగింపులు కొనసాగుతున్నాయి. సదరు ఫ్లైఓవర్‌ను నిర్మిస్తున్నది ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘‘యూపీ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్’’ సంస్థ కావడంతో ఇటు రాజకీయంగానూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారణాసిలోని కంటోన్మెంట్ రైల్వేస్టేషన్ వద్ద మంగళవారం సాయంత్రం ఫ్లైఓవర్ పిల్లర్ విరిగిపడి.. కింది నుంచి వెళ్తున్న నాలుగు కార్లు, ఒక ఆటో, ఒక మినీ బస్సుపై పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రాణాలు కోల్పోగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సహాయకచర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఆలయాల ధ్వంసం వల్లే: యూపీ కాంగ్రెస్ చీఫ్ రాజ్ బబ్బర్ బుధవారం మధ్యాహ్నం ఫ్లైఓవర్ బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన విచిత్ర వ్యాఖ్యలు చేశారు. ఫ్లైఓవర్ నిర్మాణం కోసం మూడు వినాయకుడి ఆలయాలను ధ్వంసం చేశారని, దేవుడి శాపం వల్లే ఫ్లైఓవర్ కూలిపోయిందని స్థానికులు అనుకుంటున్నట్లు తెలిపారు. ‘‘మొన్నటి ఉప ఎన్నికలకు ముందే ఫ్లైఓవర్‌ను నిర్మించాలన్న తొందరలో పనులను అడ్డదిడ్డంగా, నాసిరకంగా చేశారు. పైగా, ఇక్కడ మూడు వినాయకుడి గుడులు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. బ్రిడ్జి కోసం వాటని ధ్వంసం చేశారని, ఆ శాపం వల్ల ఇంతటి విపత్తు సంభవించిందని వారు భావిస్తున్నారు’’ అని రాజ్ బబ్బర్ అన్నారు. కాగా, 2016నాటి కోల్‌కతా ఫ్లైఓవర్ దుర్ఘటన ‘‘తృణమూల్ కాంగ్రెస్‌కు దేవుడి హెచ్చరిక’’ అని మోదీ వ్యాఖ్యానించిన పాత వీడియోలు మళ్లీ వైరల్ అయ్యాయి. నాటి దుర్ఘటన ‘యాక్ట్ ఆఫ్ గాడ్ కాదు యాక్ట్ ఆఫ్ ఫ్రాడ్’ అని మోదీ వ్యాఖ్యానించడం తెలిసిందే. సూపర్ వైజర్‌పై కేసు: ఫ్లైఓవర్ కూలిన ఘటనపై విచారణ కొనసాగుతుండగానే నిర్మాణ సంస్థకు చెందిన పలువురు అధికారులు, ఇంజనీర్లపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రజల ప్రాణాలను హరించారంటూ స్టేట్ బ్రిడ్జ్ కార్పొరేషన్ లిమిటెడ్‌పై సిగ్రా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు దాఖలైంది. ఐపీసీ సెక్షన్ 304 కింద సంస్థ సూపర్ వైజర్‌పై కేసు నమోదుచేశామని సిగ్రా ఎస్ఐ ధనానంద్ త్రిపాఠి తెలిపారు. రూ. 200 లంచం తీసుకున్న చిరుద్యోగి అరెస్ట్: కాగా, వారణాసి ఫ్లైఓవర్ కూలిన ఘటనలో క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో చేర్పించారు. ఒకానొక బాధితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లిన సమయంలో వార్డుబాయ్ రెండు వందల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. బాధితుల ఫిర్యాదుమేరకు దర్యాప్తు చేసిన పోలీసులు.. సదరు చిరుద్యోగిని అరెస్టు చేశారు. -
పొత్తుల సమస్యే లేదు
ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ తాము పొత్తు పెట్టుకునేది లేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ రాజ్‌బబ్బర్ తెలిపారు. ఈ ఎన్నికల్లో సొంతంగా పోటీ చేయగల సత్తా తమకుందని, అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితోనూ పొత్తులు పెట్టుకోబోమని ఆయన అన్నారు. రెండు పార్టీలూ కలిసి పోటీ చేస్తే భారీ మెజారిటీ ఖాయమని ఇంతకుముందు సీఎం అఖిలేష్ యాదవ్ చెప్పిన విషయం తెలిసిందే. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ఇప్పుడు కాంగ్రెస్ యూపీ చీఫ్ మాట్లాడటం గమనార్హం. ఇక పెద్దనోట్లను రద్దుచేస్తూ ప్రధానమంత్రి ఇటీవల తీసుకున్న నిర్ణయాన్ని రాజ్‌బబ్బర్ తీవ్రంగా విమర్శించారు. కేవలం కొద్దమంది తన స్నేహితులకు మేలు చేయడానికే ఆయనిలా చేశారని అన్నారు. నోట్ల రద్దు వల్ల దేశం మొత్తం ఇబ్బంది పడుతోందని, దేశంలో స్వైపింగ్ సామ్రాజ్యం నడుపుతున్న కొద్దిమందికి దీనివల్ల ప్రత్యక్షంగా ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. సమాజంలో ప్రతి వర్గానికీ పెద్దనోట్ల రద్దు వల్ల సమస్యలు ఎదురయ్యాయన్నారు.