
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీతో ఎలాంటి పొత్తు పెట్టుకోవడం లేదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తేల్చి చెప్పింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఢిల్లీ, హరియాణాల్లో సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య సయోధ్య కుదరని కారణంగానే పొత్తు కుదరలేదని స్పష్టం చేసింది. ‘బీజేపీకి అడ్డుకట్ట వేయాలన్న ఉద్దేశంతోనే ఆప్.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలనుకుంది. కానీ అందుకు కాంగ్రెస్ ఆసక్తి చూపడం లేదు. పొత్తులో భాగంగా మేం 18 సీట్లు అడిగాం. కానీ కాంగ్రెస్ అందుకు సిద్ధంగా లేదు. ఇరు పార్టీలు కలిస్తే బీజేపీని ఓడించేవాళ్లం’అని ఆప్ అధికార ప్రతినిధి సంజయ్ సింగ్ విలేకరులతో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment