Bahujan Samaj Party: BSP
-
ఇకపై మాది ఒంటరిపోరే: మాయావతి
సాక్షి, న్యూఢిల్లీ: అనుకున్నదొక్కటి... అయినదొక్కటిలా తయారైంది మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) పరిస్థితి. హరియాణా అసెంబ్లీ ఎన్నికలలో ఐఎన్ఎల్డీతో బీఎస్పీ పొత్తు చేదు అనుభవం మిగల్చడంతో, మున్ముందు జరిగే ఎన్నికల్లో ఎక్కడా ప్రాంతీయ పార్టీలతో పొత్తు పెట్టుకోరాదని మాయావతి నిర్ణయించారు. యూపీ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల్లో బీఎస్పీ ఓట్లు కూటమి పార్టీకి బదలాయించినా.. వారి సంప్రదాయ ఓట్లను బీఎస్పీకి బదలాయించే సామర్థ్యం మిత్రపక్షానికి లేకపోవడంతో ఆశించిన ఫలితం దక్కలేదని మాయావతి పేర్కొన్నారు. ఈ కారణంగానే బీఎస్పీ కేడర్ తీవ్ర నిరాశకు గురైందని శుక్రవారం ఆమె ‘ఎక్స్’లో అభిప్రాయపడ్డారు. -
ఎంపీ డానిష్ అలీపై బీఎస్పీ బహిష్కరణ వేటు
న్యూఢిల్లీ: లోక్‌సభ సభ్యుడు డానిష్ అలీని శనివారం బహుజన్ సమాజ్ పార్టి(బీఎస్పీ) సస్పెండ్ చేసింది. ఆయన పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది. ‘పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, క్రమశిక్షణను ఉల్లంఘిస్తూ మీరు ఎలాంటి ప్రకటన చేయరాదని, ఎటువంటి చర్య తీసుకోవద్దని చాలాసార్లు మౌఖికంగా చెప్పాం. అయినప్పటికీ మీరు పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించడం మానలేదు. అందుకే, పార్టీ ప్రయోజనాల రీత్యా మిమ్మల్ని బహుజన్ సమాజ్ పార్టీ సభ్యత్వం నుంచి తక్షణమే సస్పెండ్ చేస్తున్నాం’అని పార్టీ ప్రధాన కార్యదర్శి సతీష్ చంద్ర మిశ్రా డానిష్ అలీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. -
వైఫల్యాలు ఏమార్చేందుకే కొత్త ఎత్తులు: మాయావతి
లక్నో: బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే ఆర్ఎస్ఎస్ కొత్త అంశాలను తెరపైకి తెస్తోందని బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ మాయావతి ఆరోపించారు. లక్నోలో బీఎస్పీ పథాధికారులతో భేటీ సందర్భంగా మాయావతి ప్రసంగించారు. ‘ దేశంలో ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, హింస నెలకొన్నాయి. ఈ అంశాలపై ఆర్ఎస్ఎస్ మౌనమునిగా మారింది. మోదీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు మాత్రం ఆర్ఎస్ఎస్ ముందువరసలో నిల్చుంటుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆర్ఎస్ఎస్ మరో కుట్రకు తెరతీసింది. మతమార్పిడి, అధిక జనాభా అంటూ కొత్త విషయాలకు ప్రాధాన్యతనిస్తోంది. దేశవ్యాప్తంగా ఎక్కడ ఎన్నికలొచ్చినా బీజేపీకి ఆర్ఎస్ఎస్ మద్దతుపలుకుతుంది. బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై కనీసం ఒక్కసారైనా ఆర్ఎస్ఎస్ మాట్లాడలేదు. ఆర్ఎస్ఎస్ మౌనం విచారకరం, అంతేకాదు దేశానికి హానికరం ’ అని అన్నారు. మతమార్పిడి, బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల కారణంగా అధిక జనాభా సమస్య తలెత్తుతోందని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబళె బుధవారం వ్యాఖ్యానించిన నేపథ్యంలో మాయావతి స్పందించారు. -
మాయావతికి సీఎం పోస్ట్ ఆఫర్ చేశాం
న్యూఢిల్లీ: బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయావతిపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేద్దామని కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించినా ఆమె స్పందించలేదని, ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేస్తామని ఆఫర్ కూడా ఇచ్చామని ఆయన వెల్లడించారు. సీబీఐ, ఈడీ, పెగసస్ల భయంతోనే ఆమె బీజేపీ విజయానికి బాటలు వేశారని పేర్కొన్నారు. సమృద్ధ్ భారత్ ఫౌండేషన్ ప్రచురించిన ‘ది దళిత్ ట్రూత్’పుస్తకావిష్కరణ కార్యక్రమంలో శనివారం రాహుల్ ప్రసంగించారు. భారత రాజ్యాంగం ఒక ఆయుధమని కాంగ్రెస్ నేత రాహుల్ అభివర్ణించారు. ప్రస్తుతం రాజ్యాంగ వ్యవస్థలన్నిటినీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) హస్తగతం చేసుకుందని ఆరోపించారు. రాజ్యాంగంతో ప్రయోజనం లేకుండా పోయిందన్నారు.‘కేవలం అధికారం చేజిక్కించుకోవడం గురించే ఎల్లప్పుడూ ఆలోచించే కొందరు రాజకీయ నేతల వంటి వాడిని కాదు. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది. అదేవిధంగా, తీవ్రంగా కొట్టి హింసింది. నేనింకా నేర్చుకోవాలని దేశం భావిస్తున్నట్లు దాని ద్వారా తెలుసుకున్నాను’అని అన్నారు. -
ఓటమికి కారణం ఇదే: మాయావతి
-
‘మాయ’మైనట్టేనా?
సాక్షి, న్యూఢిల్లీ: యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా మార్చేశాయి. 403 అసెంబ్లీ స్థానాల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమై ఆ పార్టీ కుదేలైంది. తొలినుంచి ఆయువుపట్టుగా ఉన్న ఎస్సీ సామాజిక వర్గం ఆదరించకపోగా మాయా సొంత సామాజికవర్గం జాటవ్‌లు కూడా బీజేపీ వైపు మొగ్గారు. ఒక దశలో ప్రధాని అయ్యేంతగా వెలుగు వెలిగిన మాయావతి ప్రభ ఈ ఎన్నికలతో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయినట్టేనని విశ్లేషకులంటున్నారు. మాయా లేదు..మంత్రం లేదు.. బహుజనుల నేతగా 1995, 1997, 2002, 2007ల్లో నాలుగుసార్లు యూపీ సీఎం పీఠమెక్కిన ఘన చరిత్ర 66 ఏళ్ల మాయావతిది. అలాంటిది బీఎస్పీ ఈసారి ఎన్నడూ లేనంతటి ఘోర అపజయాన్ని మూటగట్టుకుంది. 2017 ఎన్నికల్లో 22.23 శాతం ఓట్లతో 19 స్థానాలు గెలిచిన పార్టీ ఈసారి నెగ్గింది ఒక్కటంటే ఒక్క సీటు! ఓట్ల శాతం కూడా 12.6 శాతానికి దిగజారింది. 2019 లోక్‌సభ ఎన్నికల్లోనూ బీఎస్పీ కేవలం 19.3 శాతం ఓట్లతో 10 స్థానాలతో సరిపెట్టుకుంది. అప్పటినుంచీ పార్టీ కార్యక్రమాలను మాయా పెద్దగా పట్టించుకోవడం లేదు. దాంతో పార్టీలో క్రియాశీలంగా ఉండే బ్రాహ్మణవర్గం బీజేపీలోకి, ముస్లింలు సమాజ్‌వాదీలో చేరారు. బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్ పోటాపోటీ సభలు, రోడ్‌షోలు, ర్యాలీలకు దిగాయి. కాంగ్రెస్ నుంచి ప్రియాంకా గాంధీ 209 ర్యాలీలు, సభలు; బీజేపీ నుంచి యోగి 203 సభలు, ర్యాలీలు; ఎస్పీ అధినేత అఖిలేశ్ 139 ర్యాలీలు, సభలు జరిపితే మాయా కేవలం 18 మీటింగులతో ముగించారు. ఎస్సీలూ దూరమయ్యారు యూపీలో 21 శాతమున్న దళిత ఓటర్లు తొలినుంచీ బీఎస్పీకే దన్నుగా నిలిచారు. సుమారు 4.2 కోట్ల దళితుల్లో 2.25 కోట్లు మాయా సామాజికవర్గం జాటవ్కే చెందిన వారు. పాసీలు 70 నుంచి 80 లక్షల దాకా (16 శాతం)ఉంటారు. కోటికి పైగా మిగతా కులాల వారున్నారు. రాష్ట్రంలోని 84 ఎస్సీ స్థానాల్లో 2007లో బీఎస్పీ ఏకంగా 61 గెలుచుకోగా 2012లో 14కు పడిపోయింది. 2017 ఎన్నికల నాటికి ఎస్సీలు దాదాపుగా బీజేపీ వైపు మొగ్గారు. 2017లో బీజేపీ అధికారంలోకి వచ్చాక జాటవేతర వర్గాలను విఛ్చిన్నం చేయడంతో దళితులు బీఎస్పీకి దూరమయ్యారు. ఈ ఎన్నికల్లోనూ బీజేపీ అదే ఫార్ములా వాడింది. దాంతో దళితులంతా మరోసారి బీజేపీవైపే నిలిచారు. గడిచిన ఎన్నికల్లో బీఎస్పీ సాధించిన సీట్లు, ఓట్లు ఎన్నికలు గెలిచిన ఓట్ల సీట్లు శాతం 2002 98 23.06 2007 206 30.43 2012 80 25.97 2017 19 22.23 2022 1 12.66 -
బహుజనుల ఐక్యతతోనే రాజ్యాధికారం
సాక్షి, ఆదిలాబాద్: బహుజనులు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సిద్ధిస్తుం దని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనుల పక్షాన ఉద్యమించడంతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకు బడుగు, బలహీనవర్గాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రవీణ్‌కుమార్ ఆర్అండ్బీ విశ్రాంతి గృహంలో ఉమ్మ డిజిల్లా బీఎస్పీ నాయకులతో సమావేశమై పార్టీ పరిస్థితులపై ఆయన చర్చించారు. కుండలు తయారు చేసే చక్రంపై మట్టితో ప్రమిదలు తయారు చేశారు. ఆయన వెంట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ గంగాధర్, జిల్లా ఇన్చార్జి జంగుబాబు ఉన్నారు. -
మరో రెండు రాష్ట్రాల్లో ఎస్పీ– బీఎస్పీ పొత్తు
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో అధికార బీజేపీకి వ్యతిరేకంగా ఒక్కటైన సమాజ్‌వాదీ పార్టీ–బహుజన్ సమాజ్ పార్టీ (ఎస్పీ–బీఎస్పీ)కూటమి మరో రెండు రాష్ట్రాల్లో పోటీ చేయనుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో యూపీతోపాటు మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోనూ కలిసి బరిలోకి దిగాలని ఈ రెండు పార్టీలు నిర్ణయించాయి. సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, బీఎస్పీ అధినేత్రి మాయావతి ఈ మేరకు సోమవారం ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. ‘2019 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్, టికమ్‌గర్హ్, ఖజరహోతో పాటు ఉత్తరాఖండ్‌లోని గధ్వాల్ స్థానాల నుంచి సమాజ్‌వాదీ పార్టీ పోటీ చేయనుండగా మిగతా చోట్ల బీఎస్పీ తమ అభ్యర్థులను బరిలోకి దించుతుంది’ అని అందులో పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లో 29, ఉత్తరాఖండ్‌లో 5 ఎంపీ స్థానాలున్నాయి. బిహార్‌లో పొత్తుల్లేకుండానే బీఎస్పీ.. పట్నా: బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లోనూ ఒంటరిగానే పోటీకి దిగాలని బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నిర్ణయించిందని ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, బిహార్ బిఎస్పీ ఇన్చార్జ్ లాల్జీ మేధ్కర్ సోమవారం వెల్లడించారు. బిహార్‌లో బీఎస్పీ టికెట్ ఆశావహులు, పార్టీ పథాధికారులతో గురువారం ఢిల్లీలో అధినేత్రి మాయవతితో సమావేశం ఉందని ఆయన తెలిపారు. ఎన్నికలకు సిద్ధం కావాల్సిందిగా ఆమె తమను ఇప్పటికే ఆదేశించారనీ, పూర్తి సూచనలు ఆమె గురువారం నాటి భేటీలో ఇచ్చే అవకాశం ఉందని మేధ్కర్ తెలిపారు. బిహార్‌లో ఇప్పటికే ఎన్డీయేతర పార్టీల మధ్య సఖ్యత లేదు. అటు కాంగ్రెస్‌ను, ఇటు ఆర్జేడీని కూడా వదిలేసి బీఎస్పీ ఒంటరిగా పోరుకు దిగాలనుకోవడం ఆ రెండు పార్టీలకూ దెబ్బేనని భావిస్తున్నారు. -
సమర సన్నాహాలు
సాక్షి. న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికలకు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) సన్నాహాలు ప్రారంభించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఈ నెల ఆరో తేదీన కార్యకర్తలతో సమావేశమవనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించాలంటూ ఆమె కార్యకర్తలను కోరనున్నారు. పార్టీ టికెట్లు ఎవరెవరికి లభిస్తాయనే విషయం ఈ సమావేశంలోనే తేలిపోతుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. స్థానిక తాల్కటోరా స్టేడియంలో తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని బీఎస్పీ నాయకుడు బ్రహ్మసింగ్ చెప్పారు. కార్యకర్త మహాసమ్మేళన్ పేరిట నిర్వహించే ఈ సమావేశం కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ 69 స్థానాల నుంచి తన అభ్యర్థులను నిలబెట్టి కేవలం రెండు సీట్లలో విజయం సాధించింది. వీరిలో ఒకరైన బదర్‌పుర్ ఎమ్మెల్యే రామ్‌సింగ్ నేతాజీ కొద్దిరోజుల కిందటే బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. బదర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ నరసింగ్షాను అభ్యర్థిగా ప్రకటించింది. మరో ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ తూర్పు ఢిల్లీలోని గోకుల్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలమధ్య పోటీకే అలవాటుపడిన ఢిల్లీలో గత ఎన్నికల్లో బీఎస్పీకూడా బరిలోకి దిగింది. దీంతో అనేక నియోజకవర్గాలలో పోటీ ముక్కోణపు పోటీ తప్పలేదు. దాదాపు డజనుపైగా స్థానాలలో బీఎస్పీ అభ్యర్థులు విజేతలకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులు వీరే న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 27 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, పీసీసీ అధ్యక్షుడు జె.పి.అగ ర్వాల్, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, కృష్ణ తీరథ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేది, అజయ్ మాకెన్ తదితరులు ఉన్నారు. వీరితోపాటు ఆ పార్టీ ఎంపీలు సందీప్ దీక్షిత్, రమేశ్‌కుమార్, పర్వేజ్ హష్మి, మహాబల్ మిశ్రా, సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులు తాజ్దార్ బాబర్, సుభాష్ చోప్రా, ప్రేమ్‌సింగ్, మంత్రులు అర్విందర్ సింగ్ లవ్లీ, హరూన్ యూసఫ్ తదితరులు కూడా ఉన్నారు. -
సమర సన్నాహాలు
సాక్షి. న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికలకు బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ (బీఎస్పీ) సన్నాహాలు ప్రారంభించింది. ఆ పార్టీ అధ్యక్షురాలు మాయావతి ఈ నెల ఆరో తేదీన కార్యకర్తలతో సమావేశమవనున్నారు. ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం అహర్నిశలు శ్రమించాలంటూ ఆమె కార్యకర్తలను కోరనున్నారు. పార్టీ టికెట్లు ఎవరెవరికి లభిస్తాయనే విషయం ఈ సమావేశంలోనే తేలిపోతుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. స్థానిక తాల్కటోరా స్టేడియంలో తమ పార్టీ అధ్యక్షురాలు మాయావతి కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారని బీఎస్పీ నాయకుడు బ్రహ్మసింగ్ చెప్పారు. కార్యకర్త మహాసమ్మేళన్ పేరిట నిర్వహించే ఈ సమావేశం కోసం అన్ని ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయన్నారు. కాగా గత శాసనసభ ఎన్నికల్లో బీఎస్పీ 69 స్థానాల నుంచి తన అభ్యర్థులను నిలబెట్టి కేవలం రెండు సీట్లలో విజయం సాధించింది. వీరిలో ఒకరైన బదర్‌పుర్ ఎమ్మెల్యే రామ్‌సింగ్ నేతాజీ కొద్దిరోజుల కిందటే బీఎస్పీని వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు. బదర్పూర్ నియోజకవర్గం నుంచి బీఎస్పీ నరసింగ్షాను అభ్యర్థిగా ప్రకటించింది. మరో ఎమ్మెల్యే సురేంద్ర కుమార్ తూర్పు ఢిల్లీలోని గోకుల్‌పురి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీలమధ్య పోటీకే అలవాటుపడిన ఢిల్లీలో గత ఎన్నికల్లో బీఎస్పీకూడా బరిలోకి దిగింది. దీంతో అనేక నియోజకవర్గాలలో పోటీ ముక్కోణపు పోటీ తప్పలేదు. దాదాపు డజనుపైగా స్థానాలలో బీఎస్పీ అభ్యర్థులు విజేతలకు గట్టి పోటీ ఇచ్చి రెండో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ ఎన్నికల కమిటీ సభ్యులు వీరే న్యూఢిల్లీ: శాసనసభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 27 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో ముఖ్యమంత్రి షీలాదీక్షిత్, పీసీసీ అధ్యక్షుడు జె.పి.అగ ర్వాల్, కేంద్ర మంత్రులు కపిల్ సిబల్, కృష్ణ తీరథ్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు జనార్దన్ ద్వివేది, అజయ్ మాకెన్ తదితరులు ఉన్నారు. వీరితోపాటు ఆ పార్టీ ఎంపీలు సందీప్ దీక్షిత్, రమేశ్‌కుమార్, పర్వేజ్ హష్మి, మహాబల్ మిశ్రా, సీనియర్ ఎమ్మెల్యేలు, నాయకులు తాజ్దార్ బాబర్, సుభాష్ చోప్రా, ప్రేమ్‌సింగ్, మంత్రులు అర్విందర్ సింగ్ లవ్లీ, హరూన్ యూసఫ్ తదితరులు కూడా ఉన్నారు.