సాక్షి, ఆదిలాబాద్: బహుజనులు ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం సిద్ధిస్తుం దని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్, మాజీ ఐపీఎస్ ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. బహుజనుల పక్షాన ఉద్యమించడంతో రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకు బడుగు, బలహీనవర్గాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. అంతకుముందు ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చేరుకున్న ప్రవీణ్‌కుమార్ ఆర్‌అండ్‌బీ విశ్రాంతి గృహంలో ఉమ్మ డిజిల్లా బీఎస్పీ నాయకులతో సమావేశమై పార్టీ పరిస్థితులపై ఆయన చర్చించారు. కుండలు తయారు చేసే చక్రంపై మట్టితో ప్రమిదలు తయారు చేశారు. ఆయన వెంట బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభాకర్, రాష్ట్ర కోఆర్డినేటర్ గంగాధర్, జిల్లా ఇన్‌చార్జి జంగుబాబు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment