
దీక్షలో మాట్లాడుతున్న ప్రవీణ్‌కుమార్
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పాలన ఆటవిక రాజ్యాన్ని తలపిస్తోందని బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్‌ఎస్.ప్రవీణ్‌కుమార్ విరుచుకుపడ్డారు. శనివారం ఆదిలాబాద్ జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన నార్నూర్ మండల కేంద్రంలో స్వేరోస్ జైభీమ్ దీక్ష ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం స్థానికంగా జరిగిన జిల్లా బీఎస్పీ సమావేశంలో మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో తల్లీకొడుకుల ఆత్మహత్యలకు టీఆర్‌ఎస్ దౌర్జన్యమే కారణమని ఆరోపించారు.
కాగజ్‌నగర్‌లో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దౌర్జన్యం, ఇసుక మాఫియా, ప్రశ్నించే అధికారులపై దాడులు ఆటవిక రాజ్యం కాకపోతే మరేంటని ప్రశ్నించారు. జీవో 3ని సుప్రీంకోర్టు రద్దు చేస్తే రాష్ట్ర ప్రభు త్వం ఎలాంటి రివ్యూ పిటిషన్ వేయకపోవడం గిరిజనులపై ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనమని మండిపడ్డారు. దళితబంధు కింద లబ్ధిదారులకు వాహనాలు ఇస్తున్నట్లు చూపిస్తున్నప్పటికీ డబ్బులు కట్టకపోవడంతో ఆ వాహనాలను షోరూం యాజమాన్యాలు లాక్కెళ్తున్నాయని ప్రవీణ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment