హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్-6 ఉద్గార ప్రమాణాలు రెండవ దశ కింద అన్ని మోడళ్లను అప్‌గ్రేడ్ చేసినట్టు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. హ్యాచ్‌బ్యాక్స్, సెడాన్స్, ఎంపీవీలు, ఎస్‌యూవీలతోపాటు వాణిజ్య వాహనాలు సైతం వీటిలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్‌ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే)
ఈ20 ఇంధనం వినియోగానికి అనువుగా వీటిని తీర్చిదిద్దినట్టు పేర్కొంది. కాలుష్యం ఏ స్థాయిలో వెలువడుతుందో ఎప్పటికప్పుడు తెలిపే ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (ఓబీడీ) సిస్టమ్‌ను వాహనంలో అమర్చినట్టు వివరించింది. అన్ని మోడళ్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్‌సీ) వ్యవస్థను కలిగి ఉన్నాయని ప్రకటించింది. కంపెనీ ఖాతాలో ప్రస్తుతం 15 మోడళ్లు ఉన్నాయి.
(ఇదీ చదవండి: అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్ )
Comments
Please login to add a commentAdd a comment