BS6 Standards Vehicles
-
BS6: మారుతి లవర్స్‌కు గుడ్ న్యూస్, మారుతీ వాహనాలన్నీ అప్‌గ్రేడ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: భారత్ స్టేజ్-6 ఉద్గార ప్రమాణాలు రెండవ దశ కింద అన్ని మోడళ్లను అప్‌గ్రేడ్ చేసినట్టు వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా వెల్లడించింది. హ్యాచ్బ్యాక్స్, సెడాన్స్, ఎంపీవీలు, ఎస్‌యూవీలతోపాటు వాణిజ్య వాహనాలు సైతం వీటిలో ఉన్నాయని కంపెనీ తెలిపింది. (వివో ఎక్స్ 90, 90ప్రొ స్మార్ట్ఫోన్లు లాంచ్, ధరలు చూస్తే) ఈ20 ఇంధనం వినియోగానికి అనువుగా వీటిని తీర్చిదిద్దినట్టు పేర్కొంది. కాలుష్యం ఏ స్థాయిలో వెలువడుతుందో ఎప్పటికప్పుడు తెలిపే ఆన్-బోర్డ్ డయాగ్నోస్టిక్స్ (ఓబీడీ) సిస్టమ్‌ను వాహనంలో అమర్చినట్టు వివరించింది. అన్ని మోడళ్లు ఇప్పుడు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ) వ్యవస్థను కలిగి ఉన్నాయని ప్రకటించింది. కంపెనీ ఖాతాలో ప్రస్తుతం 15 మోడళ్లు ఉన్నాయి. (ఇదీ చదవండి: అదరగొట్టిన మారుతి సుజుకి: భారీ డివిడెండ్ ) -
సరికొత్త ముస్తాబుతో డుకాటీ ‘‘స్క్రాంబ్లర్’’
సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ శుక్రవారం 2021 డుకాటీ స్క్రాంబ్లర్ రేంజ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన ఈ మోడల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఐకాన్ డార్క్ వేరియంట్ రూ.7.99 లక్షలుగా ఉంది. స్క్రాంబర్ల్ ఐకాన్, ఐకాన్ డార్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.8.49 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉండే డుకాటీ డీలర్ షాపుల్లో బైకులను బుక్ చేసుకోవచ్చని, జనవరి 28 నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక కస్టమర్లు మెచ్చే బైకుల జాబితాలో స్క్రాంబ్లర్ రేంజ్ మోడళ్లు ఎల్లప్పుడూ స్థానాన్ని కలిగి ఉంటాయని ఆవిష్కరణ సందర్భంగా డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర తెలిపారు. -
హీరో మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్, ధర ఎంతంటే..
సాక్షి,న్యూఢిల్లీ: దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ బుధవారం మాస్ట్రో ఎడ్జ్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఢిల్లీ ఎక్స్ షోరూం వద్ద దీని ధర రూ.72,950 గా ఉంది. బీఎస్-6 ప్రమాణాలకు అనుగుణంగా తయారుచేసిన ఈ 125 సీసీ మోడల్ 8 బ్రేక్ హార్స్ పవర్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ‘‘మా స్కూటర్ బ్రాండ్ మాస్ట్రో ఎడ్జ్‌కు మార్కెట్లో మంచి పేరుంది. ఈ కొత్త మోడల్ చేరికతో బ్రాండ్ ఆకర్షణ మరింత పెరుగుతుందని ఆశిస్తున్నాము’’ అని హీరో మోటోకార్ప్ సేల్స్ విభాగపు అధిపతి నవీన్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆటో మార్కెట్ కోలుకునేందుకు రానున్న వారాల్లో మరిన్ని కొత్త ఉత్పత్తులను ఆవిష్కరిస్తామని చౌహాన్ పేర్కొన్నారు.