సరికొత్త ముస్తాబుతో డుకాటీ ‘‘స్క్రాంబ్లర్‌’’ | Ducati launches BS 6 Scrambler range in India | Sakshi
Sakshi News home page

సరికొత్త ముస్తాబుతో డుకాటీ ‘‘స్క్రాంబ్లర్‌’’

Jan 23 2021 11:25 AM | Updated on Jan 23 2021 11:25 AM

Ducati launches BS 6 Scrambler range in India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్‌ సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ శుక్రవారం 2021 డుకాటీ స్క్రాంబ్లర్‌ రేంజ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్‌-6 ప్రమాణాలతో రూపొందించిన ఈ మోడల్‌ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఐకాన్‌ డార్క్‌ వేరియంట్‌ రూ.7.99 లక్షలుగా ఉంది. స్క్రాంబర్ల్‌ ఐకాన్, ఐకాన్‌ డార్క్‌ వేరియంట్ల ధరలు వరుసగా రూ.8.49 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉండే డుకాటీ డీలర్‌ షాపుల్లో బైకులను బుక్‌‌ చేసుకోవచ్చని, జనవరి 28 నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక కస్టమర్లు మెచ్చే బైకుల జాబితాలో స్క్రాంబ్లర్‌ రేంజ్‌ మోడళ్లు ఎల్లప్పుడూ స్థానాన్ని కలిగి ఉంటాయని ఆవిష్కరణ సందర్భంగా డుకాటీ ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ బిపుల్‌ చంద్ర తెలిపారు.

  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement