Scrambler Classic
-
సరికొత్త ముస్తాబుతో డుకాటీ ‘‘స్క్రాంబ్లర్’’
సాక్షి, న్యూఢిల్లీ: ఇటాలియన్ సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ శుక్రవారం 2021 డుకాటీ స్క్రాంబ్లర్ రేంజ్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. బీఎస్-6 ప్రమాణాలతో రూపొందించిన ఈ మోడల్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో ఐకాన్ డార్క్ వేరియంట్ రూ.7.99 లక్షలుగా ఉంది. స్క్రాంబర్ల్ ఐకాన్, ఐకాన్ డార్క్ వేరియంట్ల ధరలు వరుసగా రూ.8.49 లక్షలు, రూ.10.99 లక్షలుగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉండే డుకాటీ డీలర్ షాపుల్లో బైకులను బుక్ చేసుకోవచ్చని, జనవరి 28 నుంచి డెలివరీలు మొదలవుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అత్యధిక కస్టమర్లు మెచ్చే బైకుల జాబితాలో స్క్రాంబ్లర్ రేంజ్ మోడళ్లు ఎల్లప్పుడూ స్థానాన్ని కలిగి ఉంటాయని ఆవిష్కరణ సందర్భంగా డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ బిపుల్ చంద్ర తెలిపారు. -
స్క్రాంబ్లర్ శ్రేణిలో డుకాటీ కొత్త బైక్‌లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటీ... మార్కెట్లోకి నూతన శ్రేణి ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. స్క్రాంబ్లర్ శ్రేణిలో ఐకాన్, డిసెర్ట్ స్లీడ్, ఫుల్ త్రోటిల్, కేఫ్ రేసర్ బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.7.89 లక్షల నుంచి రూ.9.93 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సెర్జీ కనోవాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశంలో తొమ్మిది షోరూమ్‌లున్నాయి. ఏడాదిలో మరొక రెండు స్టోర్లను ప్రారంభిస్తాం. ఇవి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నాం’’ అని చెప్పారు. ప్రస్తుతం డుకాటీ బైక్‌లను థాయ్‌లాండ్‌లో తయారు చేసి.. భారతదేశానికి దిగుమతి చేస్తున్నామని, డిమాండ్‌ను బట్టి ఇక్కడ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలియజేశారు. -
డుకాటి స్క్రాంబ్లర్.. 2 కొత్త వేరియంట్స్
ధరలు రూ.7.5 లక్షల నుంచి... న్యూఢిల్లీ : ప్రముఖ ఇటాలియన్ సూపర్ బైక్స్ తయారీ కంపెనీ డుకాటి తన స్క్రాంబ్లర్ మోడల్లో రెండు కొత్త వేరియంట్లను ఆవిష్కరించింది. స్క్రాంబ్లర్ క్లాసిక్, ఫుల్ థ్రోటిల్ అనే ఈ వేరియంట్ల ధరలు రూ.7.5 లక్షల (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) నుంచి ఉంటాయని కంపెనీ తెలిపింది. హైదరాబాద్‌లో డుకాటి షోరూమ్ డుకాటి కంపెనీ హైదరాబాద్‌లో కొత్త షోరూమ్‌ను ఏర్పాటుచేయనుంది. అలాగే భారత్‌లో కార్యకలాపాల విస్తరణపై దృష్టికేంద్రీకరించింది. ఏడాది చివరకు కొత్తగా 5 షోరూమ్‌లను ప్రారంభించాలని, వాటి సంఖ్యను 2016 నాటికి 13కు పెంచుకోవాలని భావిస్తోంది. అలాగే రూ.6.5 లక్షలు-రూ.40 లక్షల ధర శ్రేణిలో ఉన్న పది మోడళ్లకు చెందిన బైక్‌లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.