
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ డుకాటీ... మార్కెట్లోకి నూతన శ్రేణి ద్విచక్ర వాహనాలను విడుదల చేసింది. స్క్రాంబ్లర్ శ్రేణిలో ఐకాన్, డిసెర్ట్ స్లీడ్, ఫుల్ త్రోటిల్, కేఫ్ రేసర్ బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.7.89 లక్షల నుంచి రూ.9.93 లక్షల మధ్యలో ఉన్నాయి. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సెర్జీ కనోవాస్ మాట్లాడుతూ.. ‘‘ప్రస్తుతం దేశంలో తొమ్మిది షోరూమ్‌లున్నాయి.
ఏడాదిలో మరొక రెండు స్టోర్లను ప్రారంభిస్తాం. ఇవి ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఏర్పాటు చేసే యోచనలో కూడా ఉన్నాం’’ అని చెప్పారు. ప్రస్తుతం డుకాటీ బైక్‌లను థాయ్‌లాండ్‌లో తయారు చేసి.. భారతదేశానికి దిగుమతి చేస్తున్నామని, డిమాండ్‌ను బట్టి ఇక్కడ అసెంబ్లింగ్ ప్లాంట్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment