
టాలీవుడ్ యంగ్ హీరో, మాస్ కా దాస్ విశ్వక్ సేన్ ప్రస్తుతం మెకానిక్ రాకీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాను రవితేజ ముళ్లపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో గుంటూరు కారం ఫేమ్ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా కనిపించనుంది. అంతే కాకుండా ఇటీవలే లైలా అనేపేరుతో కొత్త మూవీని కూడా ప్రకటించాడు. ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ సేన్ మరో మూవీని అనౌన్స్ చేశాడు. దీంతో వరుస సినిమాలతో టాలీవుడ్‌లో బిజీగా మారిపోయాడు.
తాజాగా వర్కింగ్ టైటిల్ వీఎస్13 పేరుతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు శ్రీధర్ గంట దర్శకత్వం వహిస్తున్నారు. కాంతార మూవీ మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ సంగీంతమందిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ చూస్తే విశ్వక్ సేన్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు.
A High Voltage Action Film 🧨🧨🪓🪓
Written and directed by #SreedharGanta@sudhakarcheruk5 @innamuri8888 @AJANEESHB @kishorkumardop @SLVCinemasOffl pic.twitter.com/lZbwFPlWH2— VishwakSen (@VishwakSenActor) August 6, 2024