మాస్కో: ఇంటర్నేషనల్ స్పేస్‌స్టేషన్(ఐఎస్‌ఎస్) నుంచి బయటికి వచ్చేందుకు సిద్ధమైన రష్యా 2033నాటికి సొంత స్పేస్ స్టేషన్ ఏర్పాటు చేసుకోనుంది. ఈ విషయాన్ని రష్యాస్టేట్‌స్పేస్‌కార్పొరేషన్ (రోస్‌కోస్మోస్) మంగళవారం(జులై 23)ప్రకటించింది. రష్యా ఆర్బిటల్ స్టేషన్(రోస్) ఏర్పాటు షెడ్యూల్‌ను సంస్థ చీఫ్ యూరి బొరిసోవ్ ఆమోదించినట్లు తెలిపింది.
రోస్‌ను నిర్మించాలని 2021లోనే నిర్ణయించినట్లు తెలిపింది. 2027లో తొలి రీసెర్చ్ ఇంధన మాడ్యూల్‌ను లాంచ్ చేస్తామని వెల్లడించింది. దీని తర్వాత 2030లో యూనివర్సల్ నోడల్, గేట్‌వే, బేస్‌లైన్ మాడ్యూల్స్‌ను నింగిలోకి పంపుతామని తెలిపింది. అనంతరం కీలకమైన స్పెషల్ పర్పస్ మాడ్యూళ్లు టీఎస్‌ఎమ్1, టీఎస్‌ఎమ్2లను 2033కల్లా స్టేషన్‌కు అనుసంధానిస్తామని రోస్‌కోస్మోస్ వెల్లడించింది.
స్పేస్ స్టేషన్ ప్రాజెక్ట్ కోసం సుమారు 7 బిలియన్ డాలర్ల వ్యయం చేస్తామని రోస్‌కోస్మోస్ తెలిపింది. 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసిన రష్యాను ఒంటరిని చేసేందుకు అమెరికా, యూరప్‌లు రష్యాపై పలు ఆంక్షలు విధించాయి. ఈ ఆంక్షలను వెనక్కి తీసుకోకపోతే ఐఎస్‌ఎస్ నుంచి బయటకు వచ్చేస్తామని అప్పట్లో రష్యా హెచ్చరించింది. ఈ హెచ్చరికకు అమెరికా స్పందించకపోవడంతో ఐఎస్‌ఎస్ నుంచి బయటికి రావాలని నిర్ణయించుకుంది. స్పేస్‌స్టేషన్‌లు వ్యోమగాములకు నింగిలో ఆశ్రయమిస్తూ అంతరిక్ష పరిశోధనలకు దోహదపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment