
మాస్కో: ఉక్రెయిన్‌పై యుద్ధం కారణంగా ఇప్పటికే పలు దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. శుక్రవారం యూరోపియన్ యూనియన్ (ఈయూ) సైతం రష్యాపై కఠిన ఆంక్షలు విధించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, విదేశాంగ మంత్రి లావ్రోవ్ ఆస్తులను ఫ్రీజ్ చేస్తున్నట్టు ఈయూ ప్రకటించింది.
ఈ ఆంక్షల నేపథ్యంలో రష్యా సంచలన నిర్ణయం తీసుకుంది. రష్యాలోని ఫ్రెంచ్ గయానా నుంచి అంతరిక్ష ప్రయోగాలను నిలిపివేస్తున్నట్లు శనివారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ మేరకు రష్యా అంతరిక్ష సంస్థ రోసోకాస్మోస్ డైరెక్టర్ జనరల్ డిమిత్రి రోగోజిన్ ట్విట్టర్ వేదికగా.. ఈయూ విధించిన ఆంక్షలకు ప్రతిస్పందనగా, రాకెట్ ప్రయోగాలకు సంబంధించి యూరప్‌లోని ఇతర భాగస్వామ్య దేశాలకు సహకారం నిలిపివేస్తున్నామని అన్నారు. ఫ్రెంచ్ గయానాలోని కౌరూ కాస్మోడ్రోమ్, రోసోకాస్మోస్ నుంచి రష్యా రాకెట్ ప్రయోగ సిబ్బందిని, సాంకేతిక నిపుణులను ఉపసంహరించుకున్నట్టు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment