
జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగించిన తర్వాత తొలిసారిగా అసెంబ్లీ ఎన్నికలకు పరిపాలనా యంత్రాంగం సన్నాహాలు ముమ్మరం చేసింది. ఆగస్టులో రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. ప్రతిపాదిత అసెంబ్లీ ఎన్నికలను ఐదు దశల్లో నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.
జేకేలో ఎన్నికల నిర్వహణ విషయమై జూన్ 24 నుంచి న్యూఢిల్లీలో మూడు రోజుల పాటు సంబంధిత అధికారులకు శిక్షణ అందించనున్నారు. 2014 నవంబర్-డిసెంబర్‌లో జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. అనంతరం 2015లో పీడీపీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. తరువాత జరిగిన పరిణామాలతో బీజేపీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 2018 జూన్‌లో ప్రభుత్వం పడిపోయింది. అప్పటి నుంచి జమ్ముకశ్మీర్‌లో అధికారిక ప్రభుత్వం లేదు.