!['మీరు నాపై ప్రేమ చూపిస్తే.. వడ్డీతో సహా తిరిగి ఇస్తా' - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/41417897922_625x300_1.jpg.webp?itok=-tBJll1s)
'మీరు నాపై ప్రేమ చూపిస్తే.. వడ్డీతో సహా తిరిగి ఇస్తా'
జమ్మూ: 'మీరూ నాపై ప్రేమ చూపిస్తే , అభివృద్ధి రూపంలో వడ్డీతో సహా తిరిగి ఇస్తానని' ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ రాష్ట్ర ప్రజలనుద్దేశించి అన్నారు. సోమవారం సాంబ జిల్లాలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడారు. బీజేపీకి ఓటు వేస్తే రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తామని మోదీ హామీ ఇచ్చారు. బ్యాలెట్ ద్వారా బుల్లెట్ ను ఓడించాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో వచ్చిన జమ్మూ వచ్చిన మోదీ అక్కడి నుంచి హెలికాప్టర్లో వేదిక వద్దకు చేరుకున్నారు. జమ్మూకు 25 కిలో మీటర్ల దూరంలోని విజయ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల సభలో మోదీ పాల్గొన్నారు. మోదీ రాక సందర్భంవగా అసాధారణ భద్రత ఏర్పాట్లు చేశారు.