రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో జరుగుతోన్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగాను రద్దు చేసి కొన్ని రైళ్లను దారి మళ్లించినట్లు విజయవాడ డివిజన్ పీఆర్‌వో నుస్రత్ మండ్రుపక్కర్ గురువారం తెలిపారు.
రద్దైన రైళ్లు: ఈ నెల 13–19 వరకు కాకినాడ టౌన్–విశాఖ (17267/17268), గుంటూరు–రాయగడ (17243), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07461/07576), విజయవాడ–గూడూరు (07500/07458), బిట్రగుంట–విజయవాడ (07977/07978), రాజమండ్రి–విశాఖ (07466/07467), మచిలీపట్నం–విశాఖ (17219),గుంటూరు–విశాఖ (17239), 14–20 వరకు విశాఖ–మచిలీపట్నం (17220), రాయగడ–గుంటూరు (17244), 13, 14, 15, 17, 18 తేదీల్లో విజయవాడ–విశాఖ (22702/22701), విశాఖ–గుంటూరు (17240), ఈ నెల 13–17 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238).
పాక్షికంగా రద్దైన రైళ్లు: ఈ నెల 13–19 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు విజయవాడ–రాయనపాడు మధ్య పాక్షికంగా రద్దు చేశారు.
దారి మళ్లింపు: ఈ నెల 13న యర్నాకులం–పాట్నా (22643), 18న భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756),15న బెంగళూరు–గౌహతి (12509), 13, 15, 17, 18 తేదీలలో ఛత్రపతి శివాజీ టర్మినల్–భువనేశ్వర్ (11019) రైళ్లు విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
విజయవాడ మీదుగా వెళ్లే పలు రైళ్ల రద్దు
Published Fri, Nov 10 2023 3:36 AM | Last Updated on Fri, Nov 10 2023 3:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment