విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు  | Many Trains Canceled And Diverted In Vijayawada Division, Check Trains Details Inside - Sakshi
Sakshi News home page

విజయవాడ డివిజన్‌లో పలు రైళ్లు రద్దు, దారి మళ్లింపు 

Published Thu, Jan 4 2024 5:36 AM | Last Updated on Thu, Jan 4 2024 1:42 PM

Many trains canceled and diverted in Vijayawada division - Sakshi

రైల్వేస్టేషన్‌ (విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో నిర్వహ­ణ పనుల నిమిత్తం పలు రైళ్లు పూర్తిగా, పా­క్షికంగా రద్దు చేయడంతో పాటు మరికొన్నింటి­ని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
 
పూర్తిగా రద్దు చేసిన రైళ్లు 
♦ ఈ నెల 19, 20, 22, 23, 24, 26, 27 తేదీల్లో విజయవాడ–విశాఖపట్నం (22702/222701) 
♦ ఈ నెల 19 నుంచి 28 వరకు గుంటూరు–విశాఖపట్నం (17239) 
♦ ఈ నెల 20 నుంచి 29 వరకు విశాఖపట్నం–గుంటూరు (17240) 
♦ ఈ నెల 19 నుంచి 28 వరకు బిట్రగుంట–విజయవాడ (07977/07978) 
♦ ఈ నెల 22 నుంచి 26 వరకు బిట్రగుంట–చెన్నై సెంట్రల్‌ (17237/17238) 

పాక్షికంగా రద్దు చేసిన రైళ్లు 
♦    ఈ నెల 15 నుంచి 28 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్‌–విజయవాడ (07863/07866), మచిలీపట్నం–విజయవాడ (07770), విజయవాడ–భీమవరం జంక్షన్‌ (07283), మచిలీపట్నం–విజయ­వాడ (07870), విజయవాడ–నర్సాపూర్‌ (078661) రైళ్లను రెండు మార్గాల్లో రామవరప్పాడు–విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు చేశారు. 

దారి మళ్లించిన రైళ్లు 
ఈ నెల 15, 22 తేదీల్లో  ఎర్నాకుళం–పాట్నా (22643), ఈ నెల 20, 29 తేదీల్లో భావ్‌నగర్‌–కాకినాడ టౌన్‌ (12756), ఈ నెల 17, 19, 24, 26 తేదీల్లో బెంగళూరు గౌహతి (12509), ఈ నెల 15, 17, 19, 20, 22, 24, 26, 27 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్‌–భువనేశ్వర్‌ (11019) రైళ్లను దారి మళ్లించారు. అదేవిధంగా ఈ నెల 15 నుంచి 28 వరకు ధనబాద్‌–అలెప్పి (13351), ఈ నెల 18, 25 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్‌ (18111), ఈ ­నెల 17, 24 తేదీల్లో జసిదిహ్‌–తాంబరం (12­376), ఈ నెల 15, 22 తేదీల్లో హథియా–ఎర్నాకుళం (22837), ఈ నెల 15, 24 తేదీల్లో హథియా–బెంగళూరు (18637),  ఈ నెల 20, 27 తేదీలలో హథియా–బెంగళూరు (18637), ఈ నెల 16, 21, 23, 28 తేదీలలో హథియా–బెంగళూరు (12835), ఈ నెల 19, 26 తేదీల్లో టాటా–బెంగళూరు (12889) రైళ్లు  విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా మళ్లించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement