రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్‌లో జరుగుతున్న నిర్వహణ పనుల కారణంగా పలు రైళ్లను పూర్తిగాను, పాక్షికంగాను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించి నడపనున్నట్లు రైల్వే అధికారులు బుధవారం ప్రకటించారు.
పూర్తిగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విశాఖపట్నం (17219/17220), విజయవాడ–విశాఖపట్నం (22702/22701), గుంటూరు–విశాఖపట్నం (17239/17240), బిట్రగుంట–విజయవాడ (07977/07978), బిట్రగుంట–చెన్నై సెంట్రల్ (17237/17238), విజయవాడ–తెనాలి (07279/07575), విజయవాడ–ఒంగోలు (07576/07500), విజయవాడ–గూడూరు (12744/12743) రైళ్లను పూర్తిగా రద్దు చేశారు.
పాక్షికంగా రద్దయిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 31 వరకు మచిలీపట్నం–విజయవాడ (07896/07769), నర్సాపూర్–విజయవాడ (07863), విజయవాడ–మచిలీపట్నం (07866/07770), విజయవాడ–భీమవరం టౌన్ (07283), మచిలీపట్నం–విజయవాడ (07870), విజయవాడ–నర్సాపూర్ (07861) రైళ్లు రామవరప్పాడు–విజయవాడ మధ్య పాక్షికంగా రద్దు అయ్యాయి.
దారి మళ్లించిన రైళ్లు: ఈ నెల 18 నుంచి 25 వరకు యర్నాకుళం–పాట్నా (22643), ఈ నెల 23 నుంచి 30 వరకు భావ్‌నగర్–కాకినాడ పోర్టు (12756), ఈ నెల 20, 22, 27, 29 తేదీల్లో బెంగళూరు–గౌహతి (12509), ఈ నెల 18, 20, 22, 23, 25, 27, 29, 30 తేదీల్లో ఛత్రపతి శివాజీ టెర్మినస్–భువనేశ్వర్ (11019), ఈ నెల 18 నుంచి 31 వరకు ధన్‌బాద్–అలెప్పి (13351), ఈ నెల 23, 30 తేదీల్లో హతియా–బెంగళూరు (18637), ఈ నెల 19, 24, 26, 31 తేదీల్లో హతియా–బెంగళూరు (12835), ఈ నెల 22, 29 తేదీల్లో టాటా–బెంగళూరు (12889), ఈ నెల 21, 28 తేదీల్లో టాటా–యశ్వంత్‌పూర్ (18111), ఈ నెల 18, 25 తేదీల్లో హతియా–యర్నాకులం (22837) రైళ్లు రెండు మార్గాల్లో వయా విజయవాడ, గుడివాడ, భీమవరం టౌన్, నిడదవోలు మీదుగా దారి మళ్లించారు.
పలు రైళ్ల రద్దు, దారి మళ్లింపు
Published Thu, Dec 14 2023 5:21 AM | Last Updated on Thu, Dec 14 2023 5:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment