Andhra Pradesh, Several Trains Diverted - Sakshi
Sakshi News home page

పలు రైళ్ల దారి మళ్లింపు 

Published Sat, May 15 2021 9:13 AM | Last Updated on Sat, May 15 2021 12:03 PM

Diversion Of Several Trains - Sakshi

తాటిచెట్లపాలెం(విశాఖ ఉత్తర): ఈస్ట్రన్‌ రైల్వే పరిధి హౌరా–బర్ధమాన్‌ సెక్షన్‌లో భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల కారణంగా వాల్తేర్‌ డివిజన్‌ నుంచి నడిచే పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. మార్పులను గమనించి, వీటికనుగుణంగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలన్నారు

బెంగళూరులో శుక్రవారం బయలుదేరిన బెంగళూరు–గౌహతి(02509) స్పెషల్‌ ఎక్స్‌ప్రెస్‌ వయా ఖరగ్‌పూర్, హౌరా, బందేల్, బర్ధమాన్‌ మీదుగా ప్రయాణించి హౌరా స్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది.  
యశ్వంత్‌పూర్‌లో శుక్రవారం బయలుదేరిన యశ్వంత్‌పూర్‌–గౌహతి(06577) సమ్మర్‌ స్పెషల్‌ వయా ఖరగ్‌పూర్, హౌరా, బందేల్, బర్ధమాన్‌ మీదుగా ప్రయాణించి హౌరా స్టేషన్‌లో మాత్రమే ఆగుతుంది.  

త్రివేండ్రం– మాల్డా మధ్య స్పెషల్‌ 
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా త్రివేండ్రం–మాల్డా –త్రివేండ్రం మధ్య స్పెషల్‌ సర్వీసు నడుపుతున్నట్లు డీసీఎం త్రిపాఠి తెలిపారు. త్రివేండ్రం–మాల్డా టౌన్‌ (06185) సమ్మర్‌ స్పెషల్‌ త్రివేండ్రంలో ఈ నెల 15వ తేదీ శనివారం సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఆదివారం రాత్రి 11.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి అర్ధరాత్రి 12.10 గంటలకు బయలుదేరి మూడవ రోజు(ప్రయాణ రోజు నుంచి) రాత్రి 8.10 గంటలకు మాల్డా టౌన్‌ చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో మాల్డా టౌన్‌–త్రివేండ్రం సమ్మర్‌ స్పెషల్‌ మాల్డా టౌన్‌లో ఈ నెల 18వ తేదీ మంగళవారం రాత్రి 7.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు బుధవారం మధ్యాహ్నం 3.35 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక్కడ నుంచి 3.55 గంటలకు బయలుదేరి మూడవ రోజు (ప్రయాణ రోజు నుంచి) రాత్రి 11.10 గంటలకు త్రివేండ్రం చేరుకుంటుంది. ఈ స్పెషల్‌ రైలు ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే జోన్‌ పరిధిలో దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, కటక్, భద్రక్‌ స్టేషన్లలో ఆగుతుంది. 13–స్లీపర్‌ క్లాస్, 4–జనరల్‌ సెకండ్‌ క్లాస్, 2–లగేజీ కం బ్రేక్‌ వ్యాన్‌ కోచ్‌లతో ఈ రైలు నడుస్తుంది.

చదవండి: పల్లెకు దూరమై.. చేనుకు చేరువై!  
ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో అక్రమాలపై విజిలెన్స్‌ కొరడా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement