విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలోని కొత్తవలస- కిరండోలు రైలు మార్గంలో శుక్రవారం కొండ చరియలు విరిగిపడడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొండపై నుంచి ఓ గూడ్స్ రైలుపై కొండచరియలు విరిగిపడటంతో ఆ రైలు రెండు ఇంజన్లు దెబ్బతిన్నాయి. శివలింగాపురం-టైడా రైల్వే స్టేషన్ల మధ్య ఈ ప్రమాదం జరిగింది. దీంతో కొత్తవలస - కిరణ్‌డోలు ప్యాసింజర్ రైలును అధికారులు నిలిపివేశారు. రైల్వే సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మరమ్మతులు చేస్తున్నారు. గంటలతరబడి రైళ్లు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు.
రైలు పై విరిగిపడిన కొండచరియలు
Published Fri, Jun 30 2017 7:02 PM | Last Updated on Thu, May 3 2018 3:20 PM
Advertisement
Advertisement