సాక్షి,హైదరాబాద్:డబ్బు సంచులను కాంగ్రెస్ అధిష్టానానికి సమకూర్చడానికి,ఆరు గ్యారెంటీలపై నుంచి ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఈ విషయమై డీకే అరుణ శుక్రవారం(సెప్టెంబర్27)మీడియాతో మాట్లాడారు.
‘సామాన్యులను ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయం.హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను బెంబేలెత్తిస్తోంది.హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది.హైదరాబాద్ రావాలంటే పెట్టుబడిదారులు భయపడాల్సిన పరిస్థితి.కేసీఆర్‌కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు.అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా ? నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి.కొందరికి ఒకలా మరికొందరికి ఇంకోలా నిబంధనలు పెడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేశారు.
వక్ఫ్ యాక్ట్ 2024 సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రేపు హైదరాబాద్‌కు రానుంది.వివిధ రాష్ట్రాల్లో కమిటీ ఇప్పటికే పర్యటించింది. ఈక్రమంలోనే రేపు హైదరాబాద్‌లో కమిటీ పర్యటిస్తుంది.తాజ్ కృష్ణ హోటల్‌లో రేపు కమిటీని కలిసి వినతిపత్రాలు ఇవ్వవచ్చు.వక్ప్ సవరణ బిల్లుపై దుష్ప్రచారాలను ఎవరు నమ్మొద్దు.వక్ప్ బోర్డులు కొందరి చేతుల్లోనే ఉన్నాయి.పేద ముస్లీంలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది’అని డీకే అరుణ పేర్కొన్నారు.
ఇదీచదవండి: నిజాంకన్నా దుర్గార్ముడు సీఎం రేవంత్‌రెడ్డి: ఎంపీ ఈటల
Comments
Please login to add a commentAdd a comment