సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిజాం సర్కార్ కంటే దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శని, ఆదివారాలు చూసుకుని పేదల ఇళ్లను కూల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందిస్తోందా? అని ప్రశ్నించారు.
హైడ్రా బాధితులు శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిశారు. ఈ సందర్బంగా అక్రమంగా తమ ఇళ్లను కూల్చివేసినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. రేవంత్ పాలన నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా ఉంది. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారు. శని, ఆదివారాలు చూసుకొని ఇళ్లను కూలగొడుతున్నారు.
సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతీ కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. ఆయనకు వారి ఉసురు తగిలింది అంటారు. పేదల కళ్ళలో నీళ్లు చూసేవారికి ఎప్పుడు మంచి జరగదు. పోయేకాలం వచ్చినట్టుంది కాబట్టే ఎలా ప్రవర్తిస్తున్నారు. పేదలతో పెట్టుకున్న ప్రభుత్వం బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ.. లక్ష కోట్లు పెట్టి మూసీ సుందరీ కరణ చేస్తారట. బట్టలు లేవు కానీ బంగారం కొనిపిస్తా అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల తీరు. మేక వన్నె పులులు ఎన్నికలప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఓట్లు అడిగారు. ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దు. నేను ఉన్నంత వరకు మీ పక్షాన కొట్లాడుతాను’ అంటూ కామెంట్స్ చేశారు.
ఇది కూడా చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు
Comments
Please login to add a commentAdd a comment